AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirupati: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. మార్చి 13 నుంచి 17 వరకూ స్వామివారి తెప్పోత్సవాలు.. ఆర్జిత సేవలు రద్దు..

Tirupati: తిరుమల తిరుపతిలో కొలువైన కలి యుగం ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి(Sri Venkateswara swami) వారి వైభవం నిత్యకల్యాణం పచ్చ తోరణం అన్నట్లు ఉంటుంది. శ్రీవారిని భారీ సంఖ్యలో రోజూ భక్తులు..

Tirupati: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. మార్చి 13 నుంచి 17 వరకూ స్వామివారి తెప్పోత్సవాలు.. ఆర్జిత సేవలు రద్దు..
Tirumala Tirupati Srivari A
Surya Kala
|

Updated on: Mar 10, 2022 | 8:56 AM

Share

Tirupati: తిరుమల తిరుపతిలో కొలువైన కలి యుగం ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి(Sri Venkateswara swami) వారి వైభవం నిత్యకల్యాణం పచ్చ తోరణం అన్నట్లు ఉంటుంది. శ్రీవారిని భారీ సంఖ్యలో రోజూ భక్తులు దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలో శ్రీవారి భక్తులకు అలెర్ట్.. తిరుమల(tirumala)లో ఈ నెల 13 నుంచి 17వ తేదీ వరకు ఐదు రోజులపాటు శ్రీ‌వారి సాలకట్ల తెప్పోత్సవాలు(Salakatla Teppotsavalu) జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో టీటీడీ ఆర్జిత సేవలను రద్దు చేసింది. స్వామివారి తెప్పోత్సవాల కారణంగా వ‌ర్చువ‌ల్ అర్జిత‌సేవ‌లైన సహస్రదీపాలంకార సేవను మార్చి 13, 14వ తేదీల్లో…  మార్చి 15, 16, 17వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది. భ‌క్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించాల్సిందిగా కోరుతుంది.

తెప్ప అనగా పడవ, ఓడ. ఓడలో సుఖాశీనులైన శ్రీవారిని కోనేటిలో విహారం చేయించడాన్నే తెప్పోత్సవం అంటారు. తెప్పోత్సవాలను తమిళంలో ‘తిరుపల్లి ఓడై తిరునాళ్‌’, తెలుగులో ‘తెప్ప తిరునాళ్లు అంటారు. తిరుమలలో తెప్పోత్సవాలు అత్యంత ప్రాచీనకాలం నుండి జరుగుతున్నాయని తెలుస్తోంది.

శ్రీ సాళువ నరసింహరాయలు క్రీ.శ 1468లో పుష్కరిణి మధ్యలో “నీరాళి మండపాన్ని” నిర్మించి తెప్పోత్సవాలకు అనువుగా తీర్చిదిద్దారు. క్రీ.శ.15వ శతాబ్దానికి చెందిన శ్రీ తాళ్లపాక అన్నమయ్య తిరుమల తెప్పోత్సవాలను గొప్పగా కీర్తించారు. వేసవి ప్రారంభంలో పున్నమి రోజుల నాటి వెన్నెల కాంతుల్లో చల్లని నీళ్లల్లో శ్రీ స్వామివారిని ఊరేగించే ఈ తెప్పోత్సవాలు భక్తులకు కనువిందు చేస్తాయి.

తెప్పోత్సవాలను ఐదు రోజుల పాటు ప్రతిరోజూ రాత్రి 7 నుంచి 8 గంటల వరకు నిర్వహిస్తారు. తొలిరోజు సాయంత్రం శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీ రామచంద్రమూర్తి, రెండో రోజు రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామివారు మాడ‌వీధుల ప్రదక్షిణంగా ఊరేగుతూ వచ్చి పుష్కరిణిలో తెప్పపై మూడు చుట్లు విహరిస్తారు. ఇక చివరి మూడురోజులు శ్రీదేవి, భూదేవి స‌మేత మలయప్పస్వామివారు తెప్పపై మూడో రోజు మూడు చుట్లు, నాలుగో రోజు ఐదు చుట్లు, ఐదో రోజు ఏడు చుట్లు విహరించి భక్తులను కటాక్షిస్తారు.

Also Read:

 నగరి రాజకీయాలకు సినీ గ్లామర్.. రోజాకి వాణి విశ్వనాథ్ షాక్.. నెక్స్ట్ ఎన్నికల బరిలో నగరినుంచే..