Tirumala News: నాగుల చవితి వేళ.. తిరుమల శ్రీవారికి పెద్దశేష వాహనసేవ.. Watch Video
Tirumala Pedda sesha Vahana Seva: నాగుల చవితి సందర్భంగా తిరుమల శ్రీవారికి సోమవారం రాత్రి పెద్దశేష వాహనసేవ నిర్వహించనున్నారు. నాగులచవితి నాడు శ్రీవారికి పెద్దశేష వాహన సేవ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

Nagula Chavithi
నాగుల చవితి సందర్భంగా తిరుమల శ్రీవారికి సోమవారం రాత్రి పెద్దశేష వాహనసేవ నిర్వహించారు. ప్రతియేటా నాగులచవితి నాడు శ్రీవారికి పెద్దశేష వాహన సేవ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. మలయప్పస్వామి వారు శ్రీదేవి, భూదేవి సమేతంగా పెద్దశేష వాహనంపై ఆశీనులై భక్తులకు అభయ ప్రదానం చేశారు. పెద్దశేష వాహనసేవను వీక్షించేందుకు భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా తిరుమల గిరులు భక్తుల గోవింద నామస్మరణలతో మార్మోగింది.
పెద్ద శేష వాహనంపై భక్తులకు అభయప్రదానం చేసిన మలయప్ప స్వామి.. వీడియో
Also Read..
Viral Photo: ఈ ఫోటోలో పులిని గుర్తించండి.. అదెక్కడుందో ఈజీగా కనిపెట్టొచ్చు.!
Viral Video: నాగుపాము- కొండ చిలువ మధ్య భీకరపోరు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో..!