Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

maha shivaratri:  దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధ శివాలయాలు ఇవే.. శివ భక్తులు తప్పక చూడవలసిని పుణ్యక్షేత్రాలు..

సాధారణంగా మహా శివరాత్రి పండుగ సమయంలో ప్రముఖ శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోతాయి. ఒక్కో క్షేత్రానికి ఒక్కో చరిత్ర, చారిత్రక నేపథ్యం, విశిష్టత ఉంటుంది. ఈ నేపథ్యంలో మన దక్షిణ భారతదేశంలోని ప్రముఖ శివాలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

maha shivaratri:  దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధ శివాలయాలు ఇవే.. శివ భక్తులు తప్పక చూడవలసిని పుణ్యక్షేత్రాలు..
Srisailam Temple
Follow us
Madhu

|

Updated on: Feb 19, 2023 | 12:06 PM

భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. విశిష్ట కళలు, విభిన్న సంస్కృతులు, ప్రపంచంలో మరెక్కడా లేనన్నిసనాతన ఆచార, సంప్రదాయాలు మనకు కనిపిస్తాయి. ముఖ్యంగా పూర్వకాలం నుంచి నేటి ఆధునిక యుగం వరకూ మన దేశంలో ఎన్నో అద్భుతమైన కట్టడాలు, శిల్పాలు, దేవాలయాలకు పుట్టినిల్లుగా నిలుస్తుంది. ఆలయాల విషయానికొస్తే మనకు ప్రముఖంగా వినిపించే పేరు మహా శివుడు. శివుని ఆదేశం లేనిదే చీమైన కుట్టదని మన పెద్దలు చెబుతుంటారు. అందుకే ఏ రాష్ట్రంలో అయినా శివాలయాలు కచ్చితంగా మనకు కనిపిస్తాయి. బోలేనాథుడు, కైలాసనాథుడు, కాశీ విశ్వనాథుడు, కేథరేశ్వరుడు, సోమనాథుడు, బైద్యనాథ, బద్రినాథ, రామనాథ, అమర్ నాథ స్వామితో పాటు ఇంకా అనేక పేర్లు శివయ్యకు ఉన్నాయి. సాధారణంగా మహా శివరాత్రి పండుగ సమయంలో ప్రముఖ శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోతాయి. ఒక్కో క్షేత్రానికి ఒక్కో విశిష్టత, చారిత్రక నేపథ్యం, ప్రాముఖ్యత ఉంటుంది. ఈ నేపథ్యంలో మన దక్షిణ భారతదేశంలోని ప్రముఖ శివాలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

శ్రీశైల మల్లిఖార్జున స్వామి ఆలయం.. శ్రీ భ్రమరాంభ మల్లిఖార్జున స్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైలంలో ఉంది. దీనిని సాధారణంగా శ్రీశైలం శివాలయం అని పిలుస్తారు. దీనిలో ఉచిత దర్శన వేళలు ఉదయం 4.30 నుంచి 10 గంటల వరకూ ఉంటుంది.

తంజావూరులోని బృహదీశ్వరాలయం.. కావేరి నదికి దక్షిణ ఒడ్డున ఉన్న శైవ హిందూ దేవాలయం బృహదీశ్వరాలయం. ఇది తమిళనాడులోని తంజావూరులో ఉంది. దీనిని సాధారణంగా తంజై కోవిల్, పెరువుడైయార్ కోవిల్ అని పిలుస్తారు. ఇది చోళ వాస్తు శిల్ప కళ ఆధారంగా నిర్మితమైంది. దక్షిణ భారతదేశంలోనే ఎత్తయిన పిరమిడ్ ఆకారపు శివాలయం ఇది.

ఇవి కూడా చదవండి

కర్ణాటకలోని ముర్దేశ్వర దేవాలయం.. మురుడేశ్వర్ ఆలయం ప్రపంచంలోనే రెండో ఎత్తయిన శివ విగ్రహంగా ప్రసిద్ధిచెందింది. మురుడేశ్వర అనేది కోస్టల్ కర్నాటకలోని ఉత్తర కెనరా జిల్లా భట్కల తాలుకాలోని ఒక ఆలయం. ఇది మంగళూరు పట్టణంలోని కార్వారఱ్ హైవేపై ఉంటుంది.

విరూపాక్ష దేవాలయం, హంపి.. ఇది కర్ణాటకలోని విజయనగర జిల్లా, హంపి ఎన్ హంపిలో ఉంది. ఇది తొమ్మిది అంచెల తూర్పు ద్వారాలను కలిగి ఉంది. దీనిలో స్తంభాలు విభిన్న ఆకృతుల్లో చెక్కబడి ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ ఆలయం చుట్టూ ముఖ ద్వారాలు, స్తంభాలు, చిన్ని చిన్న ఆలయ సమూహాలతో నిండి ఉంటుంది.

కేరళలోని వడక్కునాథన్ ఆలయం.. దక్షిణ భారతదేశంలోని పురాతన ఆలయాల్లో ఈ వడక్కునాథన్ ఆలయం కూడా ఒకటి. ఇది కేరళలోని త్రిస్సూర్ నగరం ఉంది. ఈ ఆలయ నిర్మాణ శైలి చూపురులను కట్టిపడేస్తుంది. ఆలయానికి నాలుగు వైపులా ఒక స్మారక గోపురం ఉంటుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..