Success Mantra: మీ మనసు భయానికి గురైతే వైఫల్యం మీ సొంతం.. భయం వదిలించుకునే ఐదు ప్రేరణాత్మక వ్యాఖ్యలు మీకోసం
ఈ భయం మరెక్కడా లేదని మీకు తెలుసా.. మీ మనస్సులోనే భయం అనేది ఉంటుంది. భయం తరచుగా వైఫల్యానికి కారణం అవుతుంది. మీరు మీ మనస్సు నుండి భయాన్ని తొలగిస్తే.. మీకు ఏ పని కష్టం కాదు. అలాగే మీరు భయపడరు.

భయపడటానికి నిర్ణీత వయస్సు లేదు. ఎవరికైనా ఎప్పుడైనా ఏ సంఘంటన విషయంలోనైనా భయపడవచ్చు. విద్యార్ధి చదువు విషయంలో అపజయం ఎదురైతే భయపడుతాడు. వ్యాపారవేత్త వ్యాపారంలో నష్టం వస్తుందేమో అని భయపడతాడు. అదేవిధంగా.. ఎవరైనా ఏదో ఒక రకమైన భయం ఉంటుంది. దేనికైనా భయపడడం మానవ సహజం. అయితే ఈ భయం మరెక్కడా లేదని మీకు తెలుసా.. మీ మనస్సులోనే భయం అనేది ఉంటుంది. భయం తరచుగా వైఫల్యానికి కారణం అవుతుంది. మీరు మీ మనస్సు నుండి భయాన్ని తొలగిస్తే.. మీకు ఏ పని కష్టం కాదు. అలాగే మీరు భయపడరు. భయాన్ని అధిగమించడానికి సంబంధించిన 5 ప్రేరణాత్మక వాక్యాల గురించి తెలుసుకుందాం..
- ప్రతి ఒక్కరూ ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలన్నా.. ప్రారంభించినా వైఫల్యానికి భయపడతారు. అయితే ఆ వైఫల్యానికి భయపడవద్దు లేదా దాని గురించి భయపడి ఆ పనిని మధ్యలో వదిలివేయవద్దు. ఎవరైతే చిత్తశుద్ధితో.. నిరంతరంగా కృషి చేస్తారో.. వారు ఖచ్చితంగా ఏదో ఒక రోజు విజయం సాధిస్తారు.
- మీరు ఏ పని చేయడానికి భయపడుతున్నారో.. దాన్ని మళ్లీ మళ్లీ చేస్తూ ఉండండి. మీ భయాన్ని జయించడానికి ఇదే సులభమైన మార్గం అని పెద్దలు చెప్పారు. ఇది ఖచ్చితంగా మీకు విజయాన్ని అందిస్తుంది.
- జీవితంలో భయాన్ని మీ దగ్గరికి రానివ్వకండి. ఏదైనా కారణంతో మీకు భయం కలిగితే.. మీరు భయాన్ని మరచిపోయే విధంగా ఏదొక పనిలో నిమగ్నం అవండి. భయం నుంచి పారిపోకండి.. భయాన్ని దైర్యంగా ఎదుర్కోండి.
- మీకు భయం లేకపోతే.. అది విజయానికి గుర్తింపు కాదు. ఎలాంటి భయాన్ని అధిగమించడానికైనా ధైర్యం అంటారు. భయపడనివాడు ధైర్యవంతుడు కాదు.. భయాన్ని ఓడించేవాడు ధైర్యవంతుడు అని అంటారు.
- మీరు మీ భయాన్ని పోగొట్టుకోవాలనుకుంటే.. ఇంట్లో ఖాళీగా కూర్చొని దాని గురించి ఆలోచించకండి.. భయాన్ని తరిమికొట్టడానికి ఏదొక పనిలో బిజీగా ఉండండి.




మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)