AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: కొత్త సంవత్సరంలో సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా?.. అయితే, చాణక్యుడు చెప్పిన ఈ టిప్స్ తెలుసుకోండి..

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు తాను రాసిన నీతిశాస్త్రంలో వ్యక్తి జీవితంలో ముడిపడి ఉన్న ప్రతీ అంశాన్ని ప్రస్తావించారు. దూరదృష్టి, విషయ పరిజ్ఞానం, వ్యూహకర్త, అంతకు..

Chanakya Niti: కొత్త సంవత్సరంలో సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా?.. అయితే, చాణక్యుడు చెప్పిన ఈ టిప్స్ తెలుసుకోండి..
Shiva Prajapati
|

Updated on: Dec 21, 2021 | 11:45 AM

Share

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు తాను రాసిన నీతిశాస్త్రంలో వ్యక్తి జీవితంలో ముడిపడి ఉన్న ప్రతీ అంశాన్ని ప్రస్తావించారు. దూరదృష్టి, విషయ పరిజ్ఞానం, వ్యూహకర్త, అంతకు మించిన చాణక్యం కలిగిన ఆయన.. ఒక వ్యక్తి తన జీవితంలో విజయం సాధించాలంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే వివరాలను స్పష్టంగా పేర్కొన్నారు. ఆయన చెప్పివన్నీ వర్తమాన పరిస్థితులకు సరిగ్గా సరితూగుతాయి. ఆచార్య చాణక్యుడి ప్రకారం.. అపజయాలకు ఎప్పుడూ బయపడకూడదు. ఒక వ్యక్తి వైఫల్యాల నుంచి నేర్చుకుని తన జీవితంలో ముందుకు సాగాలని, ఏదో ఒక రోజు విజయం తప్పక వరిస్తుందని ఆయన పేర్కొన్నారు. అపజయానికి వెరవని వారు.. కష్టపడి, త్యాగాలతో తమ లక్ష్యాలను సాధించి ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తారని చాణక్యుడు పేర్కొన్నారు.

ఇప్పుడు మనం విషయంలోకి వెళ్దాం. మరికొద్ది రోజుల్లో నూతన సంవత్సరం ప్రారంభం కాబోతోంది. ఈ సంవత్సరంలో ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమైన వారు ఉంటారు. అలాంటి వారు ఏమాత్రం కుంగిపోకుండా, నిరుత్సాహపడకూడదు. రాబోయే కొత్త సంవత్సరంలో కొంగొత్త ఉత్సాహంతో ముందుకు దూసుకెళ్లాలని ఆచార్య చాణక్యుడు సూచించారు. రెట్టించిన ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే అనుకున్నది సిద్ధిస్తుందని పేర్కొన్నారు. ఆచార్య చాణక్య ప్రకారం.. లక్ష్య సాధనలో ఆత్మవిశ్వాసం చాలా కీలకం. ఆత్మవిశ్వాసం లేకుండా ఎందులోనూ విజయం సాధించలేరు. ధైర్యాన్ని కోల్పోయిన వారెప్పుడు కూడా చరిత్రలో తమ పేరును లిఖించలేరు. అందుకే విజయం సాధించాలంటే ఆత్మవిశ్వాసం, ధైర్యం తప్పనిసరి. ప్రస్తుత సంవత్సరంలో విజయం సాధించలేకపోయినప్పటికీ.. కొత్త సంవత్సరంలో విజయం సాధించాలంటే ఏం చేయాలో పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

సమయ పాలన.. సమయం చాలా విలువైనది. జీవితంలో ప్రతి ఒక్క క్షణం ముఖ్యమైనదే. అందుకే సమయాన్ని వృధా చేయవద్దు. ప్రతి క్షణం ఏదో ఒక కొత్త పని చేయాలనే తపన మనిషిని విజయ శిఖరాలకు చేర్చుతుంది. మీరు విజయం సాధించాలనుకుంటే ముందుగా సమయాన్ని గౌరవించాలి. సమయానుకూలంగా పనులు పూర్తి చేసేవారు జీవితంలో తప్పక విజయం సాధిస్తారు. నూతన సంవత్సరంలో మీరు కూడా విజయం సాధించాలంటే.. తప్పక సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

విమర్శలు వద్దు.. చాణక్య నీతి ప్రకారం.. ఎప్పుడూ ఇతరులను విమర్శించకూడదు. వీలైనంత వరకు విమర్శలు వినకుండా ఉండేందుకు ప్రయత్నించండి. విమర్శ అనేది విజయానికి అన్ని విధాలా ఆటంకాన్ని కలిగిస్తుంది. దూషించే మనస్సు ప్రతికూల భావనను కలిగిస్తుంది. ఇది మానసిక ఒత్తిడిని కూడా పెంచుతుంది. మనస్సు కూడా చంచలంగా మారుతుంది. ఒక వ్యక్తి స్వేచ్ఛగా, దోషాలకు దూరంగా ఉండటం ద్వారా మాత్రమే లక్ష్యాన్ని సాధించగలడు. కాబట్టి కొత్త సంవత్సరంలో దీనికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి.

డబ్బు ఆదా చేయండి.. ఎప్పుడూ అనాలోచితంగ డబ్బు ఖర్చు చేయొద్దని చాణక్య నీతి చెబుతోంది. ఎప్పుడైనా ఆపద ఏర్పడితే డబ్బు మాత్రమే ఉపయోగపడుతుంది. సంక్షోభంలో ఎవరూ మీకు సాయం చేయరు. డబ్బు మాత్రమే మీకు సహాయపడుతుంది. కాబట్టి కొత్త సంవత్సరంలో వీలైనంత వరకు డబ్బును ఆదా చేయడానికి ప్రయత్నించండి.

గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు ఆధారంగా ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఇది సాధారణ ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పబ్లిష్ చేయడం జరిగింది.

Also read:

Chanakya Niti: జీవితంలో విజయం సాధించాలంటే.. యవ్వనంలో ఈ విషయాలను గుర్తుంచుకోండి..

Health Tips: ఖాళీ కడుపుతో వీటిని తింటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.. ఏం తినాలో ఇక్కడ తెలుసుకోండి..

Stretch Marks: స్ట్రెచ్ మార్క్స్ ఇబ్బంది పెడుతున్నాయా? ఈ 5 సహజ మార్గాలతో ఉపశమనం పొందండి..