Statue of Equality: మన సంస్కృతి ఎంతో వైవిధ్యమైనది.. రామానుజ సహస్త్రాబ్ధి వేడుకల్లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్..
మన దేశ సంస్కృతి మొదటి నుంచి భిన్నత్వంతో కూడుకున్నదని కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. మన ప్రాచీన గ్రంథాలలో పేర్కొనబడిన సూర్, అసుర, నాగ్, యక్ష, కిన్నర్ కులాల నుంచి నేటి వరకు..
Statue of Sri Ramanuja: శ్రీరామనగరం…దివ్యసాకేతంలో ఆధ్యాత్మిక పరిమళం ఉట్టిపడుతోంది. జై శ్రీమన్నారాయణ..! నామస్మరణతో శ్రీరామనగరి మార్మోగిపోయింది. యాగాలు, యజ్ఞక్రతువులు, విశేషపూజలతో అలరారుతోంది. ముచ్చింతల్ లోని సమతామూర్తి శ్రీశ్రీశ్రీ రామానుజాచార్యులను కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్(Union defence minister Rajnath Singh) దర్శించుకున్నారు. అనంతరం ప్రవచన మండపంలో జరిగే ధర్మాచార్య సభలో ఆయన ప్రసంగిస్తూ.. దేశ సంస్కృతి భిన్నత్వంతో నిండి ఉందన్నారు. మానవచరిత్రలోని మహానుభావుల్లో ఒకరైన స్వామి రామానుజాచార్యజీ అవతార సహస్రాబ్ది ఉత్సవాల్లో మీ అందరి మహనీయుల మధ్య ఉండే అవకాశం రావడం నాకు చాలా గర్వంగా ఉందన్నారు. సమానత్వ ప్రతిమ అయిన స్వామి రామానుజన్ ఈ అద్భుతమైన, భారీ విగ్రహాన్ని తానుకు లభించిన పునర్జన్మ సుకృతం అని అన్నారు. ఆయన బోధనలు, ఆదర్శాలు, విలువలు ఈ విగ్రహం ద్వారా రాబోయే యుగాలకు లభిస్తాయని తాను నమ్ముతున్నానని అన్నారు.
మన దేశ సంస్కృతి మొదటి నుంచి భిన్నత్వంతో కూడుకున్నదని అన్నారు. మన ప్రాచీన గ్రంథాలలో పేర్కొనబడిన సూర్, అసుర, నాగ్, యక్ష, కిన్నర్ కులాల నుంచి నేటి వరకు అనేక కులాలు, మతాలు, తత్వాలు, వర్గాలు ప్రపంచ వ్యాప్తంగా భారతదేశ విశిష్టతకు కారణమయ్యాయని అన్నారు. స్వామి రామానుజాచార్యజీ కూడా అటువంటి వైవిధ్యంలో సమతుల్యతను తెచ్చిన గొప్ప ‘సేతుపురుషు’ అని అభివర్ణించారు.
హైదరాబాద్‌కు బయలుదేరే ముందు రాజ్‌నాథ్ సింగ్ తన పర్యటన గురించి ట్వీట్ చేస్తూ.. రామానుజాచార్య సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొనడానికి ఢిల్లీ నుంచి బయలుదేరుతున్నట్లు వెల్లడించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కంటే ముందు, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో కలిసి ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సమానత్వ విగ్రహాన్ని బుధవారం సందర్శించారు.
అంతకు ముందు.. సమతామూర్తి కేంద్రాన్ని సందర్శించిన కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ శ్రీరామనగరం విశేషాలను తెలుసుకున్నారు. 108 దివ్య దేశాలను దర్శించుకున్నారు. సమతామూర్తి కేంద్రంలో మొక్కలు నాటిని రాజ్‌నాథ్‌సింగ్ … లక్ష్మీనారాయణ క్రతువులో పాల్గొన్నారు. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్, ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ,ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురూజీ శ్రీశ్రీశ్రీ రవిశంకర్ తదితరులు సమతామూర్తి కేంద్రాన్ని సందర్శించిన వారిలో ఉన్నారు.
ఇవాళ సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో కొలువైన 108 దివ్యతిరుపతుల్లోని 20 దేవాలయాల్లో ప్రాణప్రతిష్ఠ, కుంభాభిషేకం, మహా సంప్రోక్షణ నిర్వహించారు. నక్షత్రం, రాశి ఆధారంగా దివ్యదేశాలకు ప్రాణ ప్రతిష్ట చేశారు శ్రీ త్రిదండి రామానుజ చినజీయర్‌స్వామి. సారనాథ పెరుమాళ్, నాన్మదియ పెరుమాళ్, వయవాళి మణవాళన్, సౌందర్యరాజ పెరుమాళ్, తడాళన్, గజేంద్రవరదన్, వైకుంఠనాథ పెరుమాళ్,పేరారుళ్ళాన్, మణిక్కూడనాయకన్,సేంగన్ మాళ్, తామరైయాళ్ కేళ్వన్, సత్యగిరినాథన్,తణ్కాలప్పన్,కాట్కరైయప్పన్, తిరుమూళిక్కలత్తాన్,అద్భుతనారాయణన్, శ్రీఅనంతపద్మనాభస్వామి, నృసింహ పెరుమాళ్, నిత్యకళ్యాణ పెరుమాళ్, స్థలశయన పెరుమాళ్ దివ్య తిరుపతులకు ప్రాణప్రతిష్ట చేశారు.
ఇవి కూడా చదవండి: UP Election 2022: మీ వెంట మేమున్నాం.. ముస్లిం మహిళల పోరాటంపై ప్రధాని మోడీ ప్రశంసలు..
Andhra Pradesh: అప్పటికల్లా కొత్త జిల్లాల ఏర్పాటు.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..