Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yadadri Lakshmi Narasimha Swamy: అంగరంగ వైభవంగా యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహా స్వామి వారి క‌ళ్యాణ మహోత్సవం

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహా స్వామి వారి క‌ళ్యాణం వైభవంగా జ‌రిగింది. యాదాద్రి కొండకింద గల పాత హై స్కూల్ గ్రౌండ్ లో ప్రారంభమైన ఈ వేడుకలు నిర్వహించారు.

Yadadri Lakshmi Narasimha Swamy: అంగరంగ వైభవంగా యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహా స్వామి వారి క‌ళ్యాణ మహోత్సవం
Yadadri
Follow us
Sanjay Kasula

|

Updated on: Mar 23, 2021 | 1:17 AM

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహా స్వామి వారి క‌ళ్యాణం వైభవంగా జ‌రిగింది. యాదాద్రి కొండకింద గల పాత హై స్కూల్ గ్రౌండ్ లో ప్రారంభమైన ఈ వేడుకలు నిర్వహించారు. అర్చకుల వేద మంత్రోచ్చరణలు, భక్తజనుల గోవింద నామస్మరణల మధ్య కన్నులపండువగా సాగింది.

అంతకు ముందు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా.. స్వామివారి కళ్యాణానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

స్వామి వారికి పట్టు వస్త్రాలను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమర్పించారు. వేద మంత్రోచ్చరణల మధ్య కన్యా దానం తంతు వేడుకగా జరిగింది. స్వామి వారి కళ్యాణాన్ని వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరాడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. వివిధ రూపాలతో ఏర్పాటు చేసిన విద్యుద్దీపాలు ప్రత్యేక ఆకర్శనగా నిలిచాయి.

ఈ నెల15న ప్రారంభమైన యాదాద్రీశుని బ్రహ్మోత్సవాలు కళ్యాణోత్సవం ముగిసింది. ఈ వేడుకల్లో భాగంగా స్వామివారి కల్యాణ మహోత్సవం ఉదయం కొండపైన బాలాలయంలో నిర్వహించారు. ఆలయ పునర్నిర్మాణ పనులు జరుగుతున్నందున భక్తులు వీక్షించేలా కొండకింద కళ్యాణం నిర్వహించారు

ఇవి కూడా చదవండి:  TS PRC Calculator 2021: పీఆర్‌సీలో మీకు పెరిగిన జీతం ఎంతో తెలుసా.. అయితే ఈ క్యాలిక్యులేటర్‌తో చూసుకోండి..!

Alert ! LIC: ఎల్ఐసీ ఖాతాదారులకు ముఖ్య సూచన..ఈ ఫారం నింపకపోతే మీ డబ్బులు ఇరుక్కుపోతాయి..