AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sri Ramanujacharya Jayanti: ఈ రోజు విశిష్టాద్వైత ప్రవక్త శ్రీ రామానుజాచార్యుల జయంతి..

‘విశిష్టాద్వైత’ ప్రవక్త రామానుజాచార్యులు 1017లో పంచమినాడు తమిళనాడులోని శ్రీపెరంబుదూరు వద్ద జన్మించారు. ఆయన

Sri Ramanujacharya Jayanti: ఈ రోజు విశిష్టాద్వైత ప్రవక్త శ్రీ రామానుజాచార్యుల జయంతి..
Sri Ramanujacharya
Rajitha Chanti
|

Updated on: Apr 18, 2021 | 3:01 PM

Share

‘విశిష్టాద్వైత’ ప్రవక్త రామానుజాచార్యులు 1017లో పంచమినాడు తమిళనాడులోని శ్రీపెరంబుదూరు వద్ద జన్మించారు. ఆయన తల్లిదండ్రులు- కాంతిమతి, కేశవాచార్యులు. శ్రీమన్నారాయణుడి ఆజ్ఞను అనుసరించి, ఆదిశేషుడే రామానుజుడుగా అవతరించాడని భక్తులు విశ్వసిస్తారు. రామానుజులు కంచిలోని అద్వైత పండితుల వద్ద వేదాంతాన్ని అధ్యయనం చేశారు.

యమునాచార్యుల ద్వారా రామానుజులు వైష్ణవ దీక్షను పొందారు. ముత్తాతగారైన అళవందారు తరవాత శ్రీరంగం వైష్ణవ మఠాధిపత్యాన్ని ఆయన స్వీకరించారు. మహాత్ముడైన ‘నంబి’ నారాయణ మంత్ర దీక్షనిచ్చారు. తిరుకోష్ఠియారు ‘ద్వయ మంత్ర’ రహస్యాన్ని వివరించి, దాన్ని గోప్యంగా ఉంచాలని కోరారు. మోక్షం ఏ కొద్దిమందికో పరిమితం కాకూడదని తలచిన రామానుజులు శ్రీరంగం ఆలయ గోపురం అధిరోహించి, అక్కడ గుమిగూడిన జనులందరికీ, స్త్రీ పురుష విచక్షణ లేకుండా మంత్రాన్ని బోధించారు.

ఆధ్యాత్మికంగా అభ్యుదయం సాధించిన వ్యక్తుల్లో ఎటువంటి భేద భావాలకూ తావు ఉండదని రామానుజులు విశ్వసించారు. పరమాత్మ ఒక్కడే. ఆయన విశిష్ట గుణ సంపన్నుడు. ఆ విశేషణాలు, తత్వాలకు గల లక్షణాల్ని, వాటి మధ్య పరస్పర సంబంధాన్ని అవగాహన చేసుకునేందుకు తోడ్పడేదే ‘జ్ఞానం’ అని విశిష్టాద్వైతం చెబుతుంది. రామానుజులు- వేదాంత సాగరం, వేదాంత సంగ్రహం, వేదాంత దీపం అనే గ్రంథాలు రాశారు. బ్రహ్మసూత్రాలకు, భగవద్గీతకు భాష్యం రచించారు. ఆయన కేవలం వేదాంతి కాదు. సమత, మమతలను నిత్యజీవితంలో ఆచరించిన పుణ్యయోగి. భక్తి కంటే ప్రవృత్తి గొప్పదని అనేవారు. ‘ప్రవృత్తి’ అంటే, భక్తుడు తనను తాను భగవంతుడికి అర్పించుకోవడం! నేను, నాది అనేవి నశించి- దైవానికి దాసుడినని భావించడమే ప్రవృత్తి. ఇటువంటి బోధనలతో రామానుజులు- ఆళ్వారుల భక్తి తాత్విక సంప్రదాయానికి వారసులుగా వెలుగొందారు. రామానుజులు 120 సంవత్సరాలు జీవించారు.

Also Read: నీ ఒక్క రోజు జీతంతో అతన్ని బతికించు.. నెటిజన్ కామెంట్… స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన స్టార్ హీరో..

అప్పుడు.. ఇప్పుడు పవన్ కళ్యాణ్‏లో చాలా మార్పులు చూసాను.. నేను చూసిన కళ్యాణ్ వేరు.. ప్రకాశ్ రాజ్..

Aparichithudu : హిందీ ‘అపరిచితుడి’కి జోడి దొరికేసింది.. రణ్‏వీర్ సరసన మహేష్ హీరోయిన్..