AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sravana Pournami: జంధ్యం మార్చేటప్పుడు, ధరించేటప్పుడు .. పాటించాల్సిన నియమాలు.. పఠించాల్సిన మంత్రాలు ఏమిటంటే..

హిందూ మతంలో ఉపనయనం వేడుకను సాధారణంగా బ్రాహ్మణులకు తల్లి గర్భంతో కూడి 8వ ఏట, క్షత్రియులకు సూర్యవంశం రాజులు, చంద్రవంశం రాజులు, భట్ట రాజులు గర్భధారణతో కలిపి 11 ఏట, వైశ్యులకు గర్భధారణ సంవత్సరంతో కలిపి 12వ ఏట ఉపనయనం చేయాలని వేదం చెబుతోంది. ఇది హిందూ ఆచారాలలో ముఖ్యమైన ఆచారం కాబట్టి, ప్రజలు నియమనిష్టలతో నిర్వహిస్తారు.

Sravana Pournami: జంధ్యం మార్చేటప్పుడు, ధరించేటప్పుడు .. పాటించాల్సిన నియమాలు.. పఠించాల్సిన మంత్రాలు ఏమిటంటే..
Yagyopavitam
Surya Kala
|

Updated on: Aug 12, 2023 | 10:23 AM

Share

హిందూమతంలో యజ్ఞోపవీతం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. పవిత్ర యజ్ఞోపవీతం లేదా  జంద్యంలో ఉన్న మూడు దారాలు.. దేవతలకు ప్రతిరూపాలని.. ముఖ్యంగా బ్రహ్మ, విష్ణు మహేశ్వరులు ప్రతి రూపంగా భావిస్తారు. అంతేకాదు పితృరులకు, ఋషిరుణులకు చిహ్నంగా పరిగణించబడుతుంది. హిందూ మతంలోని ప్రధాన 16 మతకర్మలలో ఒకటి. యజ్ఞోపవీతాన్ని ధరించేవారు కొన్ని నియమాలను పూర్తిగా పాటించాలి. హిందూ విశ్వాసం ప్రకారం యజ్ఞోపవీతం  ఎప్పుడు మార్చుకోవాలి.. దానికి సంబంధించిన ఆచారాలు, ముఖ్యమైన నియమాల గురించి వివరంగా తెలుసుకుందాం.

ఉపనయనం లేదా ఒడుగు అంటే ఏమిటి

హిందూ మతంలో ఉపనయనం వేడుకను సాధారణంగా బ్రాహ్మణులకు తల్లి గర్భంతో కూడి 8వ ఏట, క్షత్రియులకు సూర్యవంశం రాజులు, చంద్రవంశం రాజులు, భట్ట రాజులు గర్భధారణతో కలిపి 11 ఏట, వైశ్యులకు గర్భధారణ సంవత్సరంతో కలిపి 12వ ఏట ఉపనయనం చేయాలని వేదం చెబుతోంది. ఇది హిందూ ఆచారాలలో ముఖ్యమైన ఆచారం కాబట్టి, ప్రజలు నియమనిష్టలతో నిర్వహిస్తారు. ఉపనయనం చేసిన తర్వాత ఆ బాలుడు పూర్తి ఆచారాలతో యజ్ఞోపవీతానికి విలువ ఇవ్వాల్సి ఉంటుంది. దాని స్వచ్ఛతను కాపాడుకోవడానికి కొన్ని నియమాలను పాటించాలి.

జంద్యం ధరించే సమయంలో పాటించాల్సిన నియమాలు

జంద్యం ఎల్లప్పుడూ ఎడమ భుజం నుండి కుడి నడుము వైపు ఉండాలి. ‘ఓం యజ్ఞ ఉపవీతం పరమం పవిత్రం, ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్. ‘ ఆయుష్యం అగ్రియం ప్రతిముంచ శుభ్రం, యజ్ఞోపవీతం బలమస్తు తేజః’ అనే మంత్రాన్ని పఠిస్తూ ధరిస్తారు. ఈ జంద్యంలో 64 కళలు,  32 శాస్త్రాలు నేర్చుకోమని  సారాంశం ఉంది. పంచేంద్రియాకు , ఐదు చర్యలకు ప్రతీక. మలవిసర్జన సమయంలో జంధ్యాన్ని చెవి చుట్టూ రెండుసార్లు గట్టిగా చుట్టుకోవాలి. దీని వెనుక ఉన్న మొదటి కారణం ఏమిటంటే, అలా చేయడం వల్ల అపరిశుభ్రంగా మారే ప్రమాదం ఉండదు. మూత్రం సులభంగా విసర్జించబడుతుంది. అయితే జంధ్యంను ధరించిన వ్యక్తి ఇతర ఆరోగ్య ప్రయోజనాలను పొందుతాడు.

ఇవి కూడా చదవండి

ఎప్పుడు జంధ్యం మార్చుకోవాలంటే..

హిందూ విశ్వాసం ప్రకారం.. మీ ఇంట్లో ఎవరైనా చనిపోతే, అంత్యక్రియలు, శ్రద్ధ కర్మలు ముగిసిన తర్వాత   మీ పవిత్ర యజ్ఞోపవీతాన్ని మార్చుకోవాలి. అదేవిధంగా ఈ యజ్ఞోపవీతం మీ భుజం నుండి జారిపోయి మీ ఎడమ చేతి కిందకు వచ్చినా, లేదా ఏదైనా కారణం వల్ల తెగిపడినా, లేదా మలవిసర్జన సమయంలో మీరు దానిని మీ చెవిపై ఉంచుకోవడం మరచినా అపవిత్రంగా భావిస్తారు.  వెంటనే యజ్ఞోపవీతాన్ని మార్చుకోవడం చేయాలి.  . అదేవిధంగా, శ్రాద్ధ కర్మలు చేసిన తర్వాత, చంద్రగ్రహణం, సూర్యగ్రహణం తర్వాత కూడా, నియమా , నిబంధనల ప్రకారం పవిత్రమైన జంధ్యాన్ని మార్చాలి.

జంద్యం ఎలా మార్చుకోవాలంటే..

ఈ పవిత్రమైన దారం అపవిత్రం అయినప్పుడు “ఉపవీతం ఛిన్నతంతుం జీర్ణం కశ్మలదూషితం విసృజామి యశోబ్రహ్మవర్భో దీర్ఘాయురస్తుమే ఈ విధంగా జపిస్తూ పాత జంద్యాన్ని తీసి వేయాలి.  ఆ తర్వాత నియమ,  నిబంధనల ప్రకారం మరొక పవిత్రమైన దారాన్ని ధరించాలి. అంతేకాదు సంవత్సరానికి ఒకసారి.. శ్రావణ పౌర్ణమి రోజుని తప్పని సరిగా జంధ్యం మార్చుకుంటారు. కనుకనే ఈ పౌర్ణమిని జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు. శ్రావణ పౌర్ణమి రోజున గురువు ఆధ్వర్యంలో, నది లేదా సరస్సులో నిలబడి, పూజలు, కర్మలు చేసిన తర్వాత, పవిత్రమైనజంధ్యం మార్చుకుంటారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)