AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sindhoor: హిందూ మత విశ్వాసం ప్రకారం సింధూరం ప్రాముఖ్యత? నుదిట మధ్యలో ఎందుకు పెట్టుకుంటారో తెలుసా..

ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్ లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో ఇరవై మందికి పైగా భారతీయులు మరణించారు. ఆ చర్యకు తొలి ప్రతిస్పందనగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ అనే ఆపరేషన్‌ను ప్రారంభించింది. ఈ సందర్భంలో ప్రఖ్యాత జ్యోతిష్యుడు సింధురానికి, కుంకుమకు గల తేడా గురించి చెప్పారు. ఈ నేపధ్యంలో ఈ రోజు సింధూరం అంటే ఏమిటే తెలుసుకుందాం..

Sindhoor: హిందూ మత విశ్వాసం ప్రకారం సింధూరం ప్రాముఖ్యత? నుదిట మధ్యలో ఎందుకు పెట్టుకుంటారో తెలుసా..
What Is Sindoor
Surya Kala
|

Updated on: May 08, 2025 | 4:53 PM

Share

పహల్గామ్‌కు విహారయాత్రకు వచ్చిన జంటల్లోని పురుషులను మతం అడిగి మరీ ఉగ్రవాదులు హత్య చేశారు. ముస్లిం ఉగ్రవాదులు మహిళల సింధూరాన్ని తుడిచిపెట్టారు. హైందవ స్త్రీకి తాళి, మెట్టెలు, సిందూరం’ కేవలం వివాహానికి చిహ్నాలు మాత్రమే కాదు. అంతకంటే ఎక్కువ. భారత ప్రభుత్వం పాక్ పెంచి పోషిస్తున్న ఉగ్ర స్థావరాలపై గత రాత్రి దాడి చేసింది. ఈ ఉగ్రవాదుల స్థావరాలపై దాడి చేసి ఉగ్రవాదులను నిర్మూలించడానికి సైన్యం చేపట్టిన ఈ ఆపరేషన్ కు ‘ఆపరేషన్ సింధూర్’ అని పేరు పెట్టింది. ఈ ఆపరేషన్ విషయం బయటకు రాగానే.. ఎక్క చూసినా సింధూరం అంటే ఏమిటి అనే చర్చ ప్రారంభమయింది. ఇది భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చర్చ.

సింధూరాన్ని కనుబొమ్మల మధ్య.. జుట్టు పాపిడి ప్రారంభంలో పెట్టుకుంటారు. సింధూరం ఎరుపు రంగులో ఉంటుంది. నవ గ్రహాలలో ఎరుపు రంగును రెండు గ్రహాలు సూచిస్తాయి. అంగారక గ్రహం, సూర్యుడు ఎరుపు రంగుని సూచిస్తాయి. మరీ ముఖ్యంగా కుజుడు శరీర రక్తాన్ని సూచిస్తుంది. శుభానికి సంకేతం. ధైర్యానికి చిహ్నం. అటువంటి ఈ ఎరుపు రంగును కనుబొమ్మల మధ్యలో ధరించడానికి ప్రధాన కారణం ఏమిటంటే ఈ స్థానం మానవుల మొత్తం శరీరాన్ని శక్తివంతం చేసే భాగం. అందువల్ల.. నుదిటి మధ్యలో కుంకుమ ధరిస్తూ వేలితో సున్నితంగా నొక్కినా, శక్తి ప్రవహిస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ కనుబొమ్మల రెండింటి మధ్య ఉన్న ప్రాంతాన్ని దుర్గాదేవి నివాసంగా కూడా చెబుతారు.

అయితే కుంకుమ, సింధూరం రెండూ భిన్నమైనవని. సిందూరం తయారుచేసే విధానం భిన్నంగా ఉంటుంది. ఇది చాలా ఖరీదైనది. మన ఇళ్లలో ఉపయోగించే కుంకుమలో కూడా పసుపు ఉంటుంది.

ఇవి కూడా చదవండి

నుదురు మధ్య భాగం చాలా శక్తివంతమైనది. ముఖ్యమైనది. మనిషి మూడవ నేత్రం ఇక్కడే ఉంటుంది. కనుక ధ్యానం కోసం కూర్చునే వారు ఒక ఆచారం పాటిస్తారు. తమ కళ్ళను కనుబొమ్మల మధ్య ఉంచి ధ్యానం చేస్తారు. ఇలాంటి భంగిమను అనేక చిత్రాలలో చూడవచ్చు. హిందూ సంప్రదాయంలో ఆడ, మగ అనే తేడా లేకుండా కుంకుమ లేదా సింధూరాన్ని ధరిస్తారు. ఇది శరీరం జీవశక్తికి సహాయపడుతుంది. కనుక ఇలా చేస్తారు. అదే ఆజ్ఞ చక్రం. దీని శక్తిని అర్థం చేసుకోవడం, నిర్వహించడం చాలా ముఖ్యం. అందుకే సింధూరం ధరిస్తారు.

హిందూ మత విశ్వాసం ప్రకారం వివాహిత స్త్రీలు కాలి వేళ్లకు మెట్టెలు, చేతులకు గాజులు, నుదిటిన సింధూరం ధరిస్తారు. హిందూ మతంలో పితృస్వామ్యంపై అంచలన విశ్వాసం ఉంది. వితంతువులు మాత్రమే నుదుటిన కుంకుమ పెట్టుకోరు. అంతేకాదు భర్తను కోల్పోయిన స్త్రీ అని తెలిసేందుకు మహిళలు నుదిట సింధూరం సహా ముత్తైదువుతనాన్ని తెలియజేసే ఏ వస్తువుని ధరించరు. అయితే మారుతున్న కాలంలో పాటు ఈ సంప్రదాయంలో కూడా మార్పులు వస్తున్నాయి. అయినా హిందూ మత విశ్వాసంలో నేటికీ ముత్తైదు స్త్రీలకు కొన్ని అలంకారాలను విడిచి పెట్టాలని చెబుతూనే ఉంది.

నుదిట మధ్యలో కుంకుమ బొట్టు పెట్టుకునే స్థానానికి ఆకర్షించే శక్తి ఉంది. దుర్గాదేవి అక్కడ నివసిస్తుంది. అందుకే ఎరుపు లేదా కుంకుమ రంగు సింధూరంతో ఆ స్థానాన్ని దాచి ఉంచుతారు. స్త్రీ , పురుషులు అనే తేడా లేకుండా కనుబొమ్మల మధ్యలో కుంకుమ ఉంచబడుతుంది. కనుబొమ్మల మధ్యలో పసుపు ఆధారిత కుంకుమను ఉంచడం ఒక సంప్రదాయం. ఆ రంగు కనుబొమ్మల మధ్యలో ఉన్న ప్రదేశం ప్రత్యేక శక్తిని కలిగి ఉంటుంది. సింధూరం తయారుచేసే విధానం భిన్నంగా ఉంటుంది. ఖరీదైనది. స్త్రీకి శరీరంలో ఆకర్షణ, అందం, బలం, తేజస్సును ఇచ్చే సింధూరం గురించి ఎవరు చేదుగా మాట్లాడరారు. అగౌరవపరచరు. మన ప్రాచీన సంప్రదాయం నుంచి హిందూ సంప్రదాయంలో మహిళలకు ప్రత్యేక స్థానం ఉంది. ఇంటికి తల్లి, ఇంటి దేవత , జ్ఞానాన్ని ఇచ్చే సరస్వతి. మన సంస్కృతిలో పురుషుల కంటే స్త్రీలనే ఎక్కువగా చూసే సమాజం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

Follow Us
పెన్షనర్లకు శుభవార్త.. ఇక నెలవారీ పెన్షన్ రూ. 25,000 దాటవచ్చు..!
పెన్షనర్లకు శుభవార్త.. ఇక నెలవారీ పెన్షన్ రూ. 25,000 దాటవచ్చు..!
మీకు ఈ ఆరోగ్య సమస్యలుంటే మజ్జిగ విషంతో సమానం అని తెలుసా?
మీకు ఈ ఆరోగ్య సమస్యలుంటే మజ్జిగ విషంతో సమానం అని తెలుసా?
2ఏళ్లకే 2 ప్రపంచ రికార్డులు.. ఈ బుడ్డోడు ఎవరో తెలుసా?
2ఏళ్లకే 2 ప్రపంచ రికార్డులు.. ఈ బుడ్డోడు ఎవరో తెలుసా?
బ్యాంకులతో పోటీ పడుతున్న పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్స్ ఇవే!
బ్యాంకులతో పోటీ పడుతున్న పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్స్ ఇవే!
పెళ్లి పీటలెక్కనున్న బిగ్ బాస్ శ్రీజ? వీడియోతో హింట్ ఇచ్చేసిందా?
పెళ్లి పీటలెక్కనున్న బిగ్ బాస్ శ్రీజ? వీడియోతో హింట్ ఇచ్చేసిందా?
అదిరిపోయే సమ్మర్ బ్రేక్‌ఫాస్ట్! సీజన్ ముగిసేలోపు టేస్ట్ చేయాల్సిం
అదిరిపోయే సమ్మర్ బ్రేక్‌ఫాస్ట్! సీజన్ ముగిసేలోపు టేస్ట్ చేయాల్సిం
పట్టపగలు కుక్క స్వైరవిహారం.. ఆస్పత్రికి గ్రామస్తుల క్యూ..!
పట్టపగలు కుక్క స్వైరవిహారం.. ఆస్పత్రికి గ్రామస్తుల క్యూ..!
బొండు మల్లెలా బొద్దుగా ఉండేది.. ఇప్పుడు
బొండు మల్లెలా బొద్దుగా ఉండేది.. ఇప్పుడు
ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఫైనల్‌ వార్నింగ్‌..
ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఫైనల్‌ వార్నింగ్‌..
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 1,11,278 కొత్త ఉద్యోగాలు వస్తున్నాయ్!
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 1,11,278 కొత్త ఉద్యోగాలు వస్తున్నాయ్!