AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaishakh Purnima: వైశాఖ పౌర్ణమి రోజున లక్ష్మీ దేవికి వీటిని సమర్పించండి.. ఇంట్లో సంపదల వర్షం కురుస్తుంది

హిందూ మతంలో పౌర్ణమి తిధికి ప్రత్యేక స్థానం ఉంది. అయితే వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమి లక్ష్మీదేవికి ఇష్టమైన రోజుగా చెబుతారు. ఈ ఏడాది వైశాఖ పున్నమి మే 12న వచ్చింది. ఈ రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన కొన్ని వస్తువులను సమర్పించడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు, సంపద నెలకొంటాయని నమ్మకం. ఈ రోజు సంపదల అధిదేవత లక్ష్మీదేవి అనుగ్రహం కోసం వైశాఖ పూర్ణిమ రోజున లక్ష్మీ దేవికి ఏమి సమర్పించాలో తెలుసుకుందాం.

Vaishakh Purnima: వైశాఖ పౌర్ణమి రోజున లక్ష్మీ దేవికి వీటిని సమర్పించండి.. ఇంట్లో సంపదల వర్షం కురుస్తుంది
Lakshmi Devi Puja
Surya Kala
|

Updated on: May 08, 2025 | 3:51 PM

Share

హిందూమతంలో పౌర్ణమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున పవిత్ర నదిలో స్నానం చేసి దానాలు చేయడం ద్వారా పుణ్య ఫలితాలను పొందుతాడని నమ్మకమ. మతపరమైన దృక్కోణంలో వైశాఖ పున్నమి చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. వైశాఖ మాసం విష్ణువు ఆరాధన దానధర్మాలకు చాలా ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది. అటువంటి పరిస్థితిలో వైశాఖ పూర్ణిమ రోజున స్నానం చేయడం, దానాలు చేయడంతో పాటు శ్రీ మహా విష్ణువును పూజించడం వల్ల సమస్యల నుంచి బయటపడవచ్చు. ఈ సంవత్సరం వైశాఖ పౌర్ణమి 2025 మే 12న వచ్చింది.

పున్నమి రోజున సంపదకు దేవత అయిన లక్ష్మీ దేవిని , విష్ణువును పూజించే సంప్రదాయం ఉంది. ఈ రోజున లక్ష్మీ దేవిని పూజించడం వల్ల ఇంట్లో అదృష్టం, శ్రేయస్సు కలుగుతాయి. అటువంటి పరిస్థితిలో, వైశాఖ పౌర్ణమి రోజున, లక్ష్మీ దేవికి తనకు ఇష్టమైన వస్తువులను సమర్పించాలి. వీటిని సమర్పించడం ద్వారా లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి, ఇంట్లో సంపదకు, ఆహారానికి ఎప్పుడూ కొరత ఉండదు.

వైశాఖ పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి ఏమి సమర్పించాలంటే

బాటాషా: వైశాఖ పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి బటాషా సమర్పించాలి. దీని వలన లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి.

ఇవి కూడా చదవండి

బియ్యం పాయసం: లక్ష్మీదేవికి పాయసం అంటే చాలా ఇష్టం. కనుక వైశాఖ పూర్ణిమ రోజున అమ్మవారికి ఖచ్చితంగా మఖానాతో లేదా బియ్యం చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించండి.

స్వీట్లు: వైశాఖ పూర్ణిమ రోజున తెల్లని రంగు స్వీట్లు లేదా పాలతో చేసిన కోవా వంటివి లక్ష్మీ దేవికి సమర్పించాలి.

కొబ్బరికాయ: వైశాఖ పూర్ణిమ రోజున సంపద దేవతకు కొబ్బరికాయను సమర్పించండి. ఇది ఇంట్లో ఆనందం, శ్రేయస్సును కొనసాగిస్తుందని నమ్ముతారు.

తామర పువ్వు: తామర పువ్వు లక్ష్మీదేవికి చాలా ప్రియమైనది. అటువంటి పరిస్థితిలో వైశాఖ పూర్ణిమ రోజున లక్ష్మీ దేవికి తామర పువ్వును ఖచ్చితంగా సమర్పించండి.

వైశాఖ పౌర్ణమి ప్రాముఖ్యత ఏమిటి?

వైశాఖ పూర్ణిమ రోజున గంగ నది లేదా ఇతర పవిత్ర నదులలో స్నానం చేసి దానం చేయడం వల్ల పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసం. వైశాఖ అమావాస్య రోజున బట్టలు, డబ్బు, ఆహార ధాన్యాలు, పండ్లు దానం చేయడం వల్ల సంపద, శ్రేయస్సు కలుగుతుంది. దీనితో పాటు ఈ రోజున పాత్రలు, ధాన్యం, తెల్లని వస్త్రాలను దానం చేయడం కూడా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. వైశాఖ పూర్ణిమను బుద్ధ పూర్ణిమ అని కూడా అంటారు. గౌతమ బుద్ధుడు ఈ రోజే జన్మించాడని చెబుతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.