shrimad bhagwat katha: కృష్ణుడికి అర్జునుడితో మాత్రమే కాదు దుర్యోధనుడితో కూడా ప్రత్యేక సంబంధం ఉందని తెలుసా..!

శ్రీమద భాగవత కథలో కృష్ణుడు, దుర్యోధనుడికి ఉన్న సంబంధం గురించి ప్రస్తావించాడు. శ్రీకృష్ణుడు జామవంతి లకు జన్మించిన కొడుకు సాంబుడు. ఈ సాంబుడికి దుర్యోధనుని ఏకైక కుమార్తె లక్ష్మణతో వివాహం జరిగినట్లు శ్రీమద్ భగవత్ లో ఒక కథ ఉంది. ఈ విధంగా కృష్ణుడు, దుర్యోధనుడు ఒకరికొకరు బంధువులు. ఈ వివాహ కథ శ్రీమద్ భగవత్ లో కూడా వస్తుంది..

shrimad bhagwat katha: కృష్ణుడికి అర్జునుడితో మాత్రమే కాదు దుర్యోధనుడితో కూడా ప్రత్యేక సంబంధం ఉందని తెలుసా..!
Shrimad Bhagwat Katha
Follow us
Surya Kala

|

Updated on: Jul 15, 2024 | 12:32 PM

శ్రీ మహా విష్ణు అవతారమైన శ్రీ కృష్ణుడు హిందువులు పూజించే దైవం. శ్రీ కృష్ణుడికి 8 మంది భార్యలు, 16 వేల మంది గోపికలు అని నమ్మకం. కృష్ణుడు అంటే పాండవుల మధ్యముడు అర్జునుడు కూడా వెంటనే గుర్తుకొస్తాడు ఎవరికైనా.. కృష్ణుడితో అర్జునుడికి ప్రత్యేకమైన అనుబంధం కూడా ఉంది. ఈ సంబంధం బావా బావమరిది. శ్రీకృష్ణుడు స్వయంగా తన సోదరి సుభద్రను అపహరించి మరీ అర్జునుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. అందువల్ల అర్జునుడు శ్రీకృష్ణుని శిష్యుడి మాత్రమే కాదు అతని బావ కూడా.. ఇక శ్రీకృష్ణుడుకి కూడా దుర్యోధనుడితో సంబంధం ఉంది. ఈ సంబంధం కూడా చాలా ప్రత్యేకమైనది. అయినప్పటికీ ఈ సంబంధం చాలా అరుదుగా చర్చించబడుతుంది.

శ్రీమద భాగవత కథలో కృష్ణుడు, దుర్యోధనుడికి ఉన్న సంబంధం గురించి ప్రస్తావించాడు. శ్రీకృష్ణుడు జామవంతి లకు జన్మించిన కొడుకు సాంబుడు. ఈ సాంబుడికి దుర్యోధనుని ఏకైక కుమార్తె లక్ష్మణతో వివాహం జరిగినట్లు శ్రీమద్ భగవత్ లో ఒక కథ ఉంది. ఈ విధంగా కృష్ణుడు, దుర్యోధనుడు ఒకరికొకరు బంధువులు. ఈ వివాహ కథ శ్రీమద్ భగవత్ లో కూడా వస్తుంది.. కథ ప్రకారం మహాభారత యుద్ధం ముగిసిన సమయంలో ఒక వైపు సాంబుడు యుక్తవయస్సు దాటాడు. దుర్యోధనుడి, భానుమతి దంపతుల కుమార్తె లక్ష్మణ కూడా కౌమారదశ దాటింది.

యుధిష్ఠిరుడు పెళ్లి ప్రతిపాదన

మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత యుధిష్ఠిరుడు హస్తినాపూరానికి, కురు కుటుంబానికి అధిపతి. అందుకే లక్ష్మణుని వివాహాన్ని శ్రీకృష్ణుని వద్ద ప్రతిపాదించాడు. ఈ ప్రతిపాదనను చర్చిస్తూ, అర్జునుడు, ద్రౌపదిలు లక్ష్మణునికి తగిన వరుడిగా శ్రీకృష్ణుడి కుమారుడు సాంబుడు అయితే బాగుంటుంది అనుకున్నారు. ఆ సమయంలో లక్ష్మణుడి తల్లి అంటే దుర్యోధనుడి భార్య భానుమతి.. అర్జునుడి ఆలోచనను అంగీకరించింది. ఇది చూసిన శ్రీకృష్ణుడు ఈ సంబంధాన్ని అంగీకరించాడు. అప్పుడు కృష్ణుడు కొడుకు సాంబుడితో దుర్యోధనుడి కుమార్తె లక్ష్మణల వివాహం చాలా వైభవంగా జరిగింది.

ఇవి కూడా చదవండి

శ్రీ కృష్ణుడి మేనత్త కుంతి

హస్తినాపూర రాజకుటుంబంతో శ్రీకృష్ణునికి ఇది మొదటి సంబంధం కాదు. వాస్తవానికి కుంతీ వివాహంతో రెండు కుటుంబాల మధ్య మొదటి సంబంధం ఏర్పడింది. రాణి కుంతీ శ్రీకృష్ణుని మేనత్త. భాగవత కథ ప్రకారం కుంతీ శ్రీకృష్ణుని తండ్రి వసుదేవుడి కంటే ముందు జన్మించింది. అప్పుడు కుంతీ దేవిని ఆమె తండ్రి స్నేహితుడైన పృథు మహారాజుకు దత్తత ఇచ్చాడు. కుంతిని తన ఇంటికి తీసుకెళ్లిన తర్వాత పృథు మహారాజ్ ఆ చిన్నారికి పృథ అని పేరు పెట్టాడు. పాండు మహారాజుతో వివాహం జరిగిన తరువాత పృథ కుంతీ దేవిగా ప్రసిద్ధి చెందింది.

మూడు తరాల వివాహాలు

ఈ విధంగా పాండు మహారాజు శ్రీకృష్ణునికి మేనమామ అయ్యాడు. తరువాతి తరంలో శ్రీకృష్ణుడు తన సోదరి సుభద్రను తన మేనత్త కొడుకు అర్జునుడితో వివాహం చేశాడు. మూడవ తరంలో శ్రీ కృష్ణుడు కుమారుడు సాంబుడికి దుర్యోధనుడి కుమార్తెతో వివాహం జరిగింది. శ్రీమద్ భగవత్ ప్రకారం పురాణ గ్రంధాలలో ఇటువంటి వివాహాలు నిషేధించబడ్డాయి. అయితే ఇదే గ్రంథంలో, భగవంతుడు శుక్దేవ్ ఈ పాత్రలన్నీ దేవుడు ఆడే నాటకంలో పాల్గొనడానికి వివిధ రూపాల్లో వచ్చాయని.. అందువల్ల ఈ పాత్రల వివాహంపై ప్రశ్నలు లేవనెత్తడం సముచితంగా పరిగణించబడదని చెప్పారు. ఒక ఉదాహరణను చూపుతూ శ్రీకృష్ణుడు రుక్మణిని వివాహం చేసుకున్నాడని చెప్పాడు. కృష్ణుడు కుమారుడు రుక్మణి సోదరుని కుమార్తెతో, రుక్మణి మనవడు రుక్మణి సోదరుడి మనవరాలిని వివాహం చేసుకున్నారు. ఈ మూడు వివాహాలు కూడా శాస్త్రోక్తంగా జరిపారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు