భారీ వర్షంలో పెళ్లి వేడుక.. విందు కోసం మోకాళ్ల నీటి లోతులో ఈదుకుంటూ వెళ్లిన అతిధులు.. వీడియో వైరల్
వరదలు, వర్షాలు ఇలా ప్రకృతి ఎంతగా ఇబ్బంది పెట్టినా పెళ్లి విందు పట్ల జనాలకు ఉన్న మక్కువతో ఏమైనా చేస్తారు అనడానికి సాక్ష్యం ఓ వీడియో. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో చూడండి. మోకాళ్ల వరకు నీరు ఉంది. మోకాళ్ల లోతు నీరులో కూడా పెళ్లికి వచ్చిన అతిథులు విందు కోసం ముందుకు సాగుతున్నారు.
మన దేశంలో వేసవి నుంచి ఉపశమనం కలిగిస్తూ ఋతుపవనాలు అడుగు పెట్టాటి. వర్షాకాలం రాకతో దేశంలో అనేక ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు చోట్ల వరద ఉధృతి నెలకొంది. ఓ వైపు వర్షాలు, వరదలతో జన జీవనం అస్తవ్యస్తంగా మారినా.. మరోవైపు పెళ్లిళ్లు జరుగుతూనే ఉన్నాయి. పెళ్ళిళ్ళను ఫంక్షన్లను జనాలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా ప్రతిరోజూ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతూనే ఉన్నాయి. వీటిల్లో కొన్ని ప్రజలకు బాగా నచ్చాయి. ప్రస్తుతం ఓ ఫంక్షన్ కు సంబంధించిన వీడియో జనాల్లో చర్చనీయాంశమైంది.
పెళ్లి ఊరేగింపు లేదా విందు విషయానికి వస్తే, భారతీయులు ఎప్పుడూ వెనుకడుగు వేయరని చెప్పవచ్చు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పెళ్లి వేడుకలకు ఒంటరిగా వెళ్లడం, వరదల సమయంలో జనం పెళ్లి ఊరేగింపులతో వచ్చే పరిస్థితి నెలకొంది. వరదలు, వర్షాలు ఇలా ప్రకృతి ఎంతగా ఇబ్బంది పెట్టినా పెళ్లి విందు పట్ల జనాలకు ఉన్న మక్కువతో ఏమైనా చేస్తారు అనడానికి సాక్ష్యం ఓ వీడియో. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో చూడండి. మోకాళ్ల వరకు నీరు ఉంది. మోకాళ్ల లోతు నీరులో కూడా పెళ్లికి వచ్చిన అతిథులు విందు కోసం ముందుకు సాగుతున్నారు.
ఇక్కడ వీడియో చూడండి
भले ही बाढ़ क्यों ना आ जाए पर भोज नहीं छूटना चाहिए, ये जज़्बा कायम रहे 😜😍 pic.twitter.com/Mr5r48L5Dq
— छपरा जिला 🇮🇳 (@ChapraZila) July 10, 2024
ఫంక్షన్ హాల్ వరద నీటితో నిండిపోయింది. మోకాళ్ల లోతు వరకూ నిండి ఉన్న ఫంక్షన్ హాల్ వీడియోలో మీరు చూడవచ్చు. ఈ నీటిని ఈదుకుంటూ అతిధులు విందుకు వెళ్తున్నారు. పెళ్లి వేడుకలో విందు భోజనాల కోసం అంత నీరు ఉన్నప్పటికీ.. అతిధులు తమ పిల్లలను ఎత్తుకుని నీటిని ఈదుకుంటూ వెళ్తున్నారు.
ఈ వీడియో @ChapraZila అనే ఖాతా ద్వారా Xలో భాగస్వామ్యం చేయబడింది. ఇప్పటికే ఈ వీడియోను వేలాది మంది చూడగా రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఒకరు వర్షం కురుస్తూనే ఉంటుంది.. అయితే విందు ఆగకూడదని కామెంట్ చేయగా.. ఇంకొకరు ‘ఇలా పెళ్లి వేడుకలో తినడానికి ఎవరు వెళ్తారు తమ్ముడూ?’ అని మరొకరు వ్యాఖ్యానించగా చాలా మంది ఈ వీడియోపై రకరకాలుగా వ్యాఖ్యానిస్తూ తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..