Navaratri 2023: మొదటి సారి నవరాత్రి వ్రతం చేస్తున్నారా.. పూజ నియమాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి
ఈ సంవత్సరం నవరాత్రులు నేటి నుండి అంటే అక్టోబర్ 15 నుండి ప్రారంభమై అక్టోబర్ 24 వరకు కొనసాగుతాయి. చాలా మంది భక్తులు నవరాత్రుల్లో తొమ్మిది రోజులు ఉపవాసం ఉంటారు. పండ్లు, సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకుంటారు. నవరాత్రుల్లో 9 రోజులు ఉపవాసానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దుర్గామాత సంతోషించి ఆశీర్వాదం ఇస్తుందని విశ్వాసం. అంతేకాదు అమ్మవారి పూజ శరీరం, మనస్సు , ఆత్మను కూడా శుద్ధి చేస్తుంది.
హిందూ మతంలో అతిపెద్ద పండుగలలో ఒకటి దసరా.. అమ్మవారిని నవ దుర్గలుగా తొమ్మిరోజుల పాటు పూజిస్తారు. నేటి నుంచి దసరా నవరాత్రులు ప్రారంభమయ్యాయి. దేశ వ్యాప్తంగా దుర్గాదేవి భక్తులు అమ్మవారిని భక్తి శ్రద్దలతో పూజించడానికి రెడీ అవుతున్నారు. దసరా నవరాత్రులలో ఈ తొమ్మిది రోజులు, దుర్గాదేవి భూమిపైకి వచ్చి ప్రతి ఇంట్లో నివసిస్తుందని నమ్ముతారు. అందుకే ఈ నవరాత్రుల సమయంలో 9 రోజుల పాటు 9 రకాల రూపాల్లో అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించి చివరి రోజు విజయదశమిగా జరుపుకుని వీడ్కోలు పలుకుతారు. ఈ సంవత్సరం నవరాత్రులు నేటి నుండి అంటే అక్టోబర్ 15 నుండి ప్రారంభమై అక్టోబర్ 24 వరకు కొనసాగుతాయి.
చాలా మంది భక్తులు నవరాత్రుల్లో తొమ్మిది రోజులు ఉపవాసం ఉంటారు. పండ్లు, సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకుంటారు. నవరాత్రుల్లో 9 రోజులు ఉపవాసానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దుర్గామాత సంతోషించి ఆశీర్వాదం ఇస్తుందని విశ్వాసం. అంతేకాదు అమ్మవారి పూజ శరీరం, మనస్సు , ఆత్మను కూడా శుద్ధి చేస్తుంది. శరన్ననవరాత్రులలో ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన కొన్ని నియమాలున్నాయి. మీరు మొదటి సారి నవరాత్రి వ్రతం పాటిస్తున్నట్లయితే.. ఈ నియమాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి, లేకుంటే ఉపవాసం అసంపూర్ణంగా మారవచ్చు.
ఈ నియమాలను గుర్తుంచుకోండి
- నవరాత్రులలో తొమ్మిది రోజులు సాత్విక ఆహారాన్ని మాత్రమే తినండి. ఉపవాసం పాటించే వ్యక్తులు గోధుమలు, బియ్యం వంటి ధాన్యాలతో చేసిన ఆహారాన్ని పొరపాటున కూడా తినకూడదు. ఈ రోజున రాగులు, బంగాళదుంపలు, డ్రై ఫ్రూట్స్, టొమాటోలు, వేరుశెనగలు, శనగతో చేసిన వస్తువులను తీసుకోవచ్చు.
- నవరాత్రులు తొమ్మిది రోజులూ అమ్మవారు ఇంట్లో నివసిస్తారు. కనుక ఇంటిని శుభ్రపరచడంలో ప్రత్యేక శ్రద్ధ వహించండి. మీరు ఉదయాన్నే నిద్రలేచి, స్నానం చేసి ఈ తొమ్మిది రోజులు శుభ్రమైన బట్టలు ధరించాలి.
- ఈ 9 రోజులలో జుట్టు, గోర్లు కత్తిరించకూడదు. ఇలా చేయడం వలన దుర్గాదేవికి కోపం వస్తుందని నమ్ముతారు.
- దుర్గాదేవి ఆరాధన సమయంలో ఖచ్చితంగా ఎర్రటి పువ్వులు సమర్పించండి. అమ్మవారి సంతోషించి ఆశీర్వాదం ఇస్తుందని విశ్వాసం. అంటుకు అమ్మవారికి పసుపు, కుంకుమ, గాజులు, చీర జాకెట్ వంటి వస్తువులు సమర్పించడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది.
- నవరాత్రుల మొదటి రోజున ఒక శుభ సమయంలో కలశాన్ని స్థాపించి ఉపవాసం దీక్షను చేపట్టండి.
- 9 రోజుల పాటు దుర్గాదేవిని వివిధ రూపాల్లో పూజించండి. ఉదయం, సాయంత్రం పూజ చేసి నైవేద్యం సమర్పించి ఆరతి ఇవ్వండి.
- ఈ తొమ్మిది రోజులు పొరపాటున కూడా వెల్లుల్లి, ఉల్లిపాయలు తినకూడదు, మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఎవరిపైనా కోపం తెచ్చుకోకూడదు, ఎవరినీ దూషించకూడదు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.