King Cobra: పగబట్టి గ్రామస్థులను వెంటాడిన కింగ్ కోబ్రా.. పథకం వేసి చంపేసిన గ్రామస్థులు.. హిందూ సంప్రదాయంలో పూజలు చేసి ఖననం

ఈసారి గ్రామంలోకి వచ్చిన కింగ్ కోబ్రాను ఎలాగైనా చంపాల్సిందేనని డిసైడ్ అయ్యారు. తరువాత రెండు రోజులకే ఎప్పటిలాగే కింగ్ కోబ్రా గ్రామంలోకి వచ్చింది. దీంతో వెంటనే అప్రమత్తమైన గ్రామస్తులు పెద్ద పెద్ద కర్రలతో ఇళ్లలో నుండి బయటకు వచ్చారు. అంతా కలిసికట్టుగా పామును చుట్టుముట్టి దాడి చేసి కర్రలతో కొట్టి చంపారు.గ్రామస్తులు అంతా కలిసి ఒక జ్యోతిష్యుడుని కలిసి జరిగిన విషయం అంతా చెప్పారు. మీరు చంపిన కింగ్ కోబ్రా భయంకరమైన పాము అని, ఆ పాము చనిపోయినా సర్పదోషం రూపంలో ఏదో ఒకలా మీ గ్రామం పై పగ తీర్చుకుంటుందని చెప్పారు.

King Cobra: పగబట్టి గ్రామస్థులను వెంటాడిన కింగ్ కోబ్రా.. పథకం వేసి చంపేసిన గ్రామస్థులు.. హిందూ సంప్రదాయంలో పూజలు చేసి ఖననం
King Cobra
Follow us
G Koteswara Rao

| Edited By: Surya Kala

Updated on: Oct 15, 2023 | 9:45 AM

నిద్ర లేచిన దగ్గర నుండి భయం.. భయం.. కింగ్ కోబ్రా ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు మమ్మల్ని దాని పొట్టన పెట్టుకుంటుంది.. ఒక్కరొక్కరు బయటకు వెళ్లకండి.. గుంపులు, గుంపులుగానే వెళ్లండి.. ఇదే ఆ గ్రామస్తుల భయం.. అసలు ఇంతకీ ఆ గ్రామానికే కింగ్ కోబ్రా ఎందుకు వస్తుంది? వారినే ఎందుకు వెంటాడుతుంది? చుట్టుప్రక్కల గ్రామాల వారిని సైతం గగ్గుర్పాటుకు గురి చేస్తున్న ఆ ఘటన ఏంటి? ఇదే ఇప్పుడు సంచలనాత్మకంగా మారింది..

ఆ ఘటన ఎక్కడ జరిగిందంటే..

ఆ గ్రామానికి కింగ్ కోబ్రా తరచూ వచ్చి హల్ చల్ చేసేది. మనుషులు కనిపిస్తే వెంబడించేది తిరిగి కొద్దిసేపటికి తప్పించుకొని కొండ ప్రాంతంలోకి వెళ్లిపోయేది. అలా ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, అనేక సార్లు గ్రామంలోకి చొరబడి గ్రామస్తులను భయభ్రాంతులకు గురి చేసేది. తమ గ్రామంలోకి కింగ్ కోబ్రా ఎప్పుడు వస్తుందో తెలియదు? ఎవరి వెంట పడుతుందో తెలియదు? ఎవరిని హాతమారుస్తుందో తెలియదు? ఎప్పటికప్పుడు గ్రామస్తులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బ్రతికేవారు. సుమారు పది అడుగుల పైగానే పొడవు, లావుగా, ఒంటినిండా నల్లటి చారలతో భయానకంగా ఉంది. గ్రామంలోకి కింగ్ కోబ్రా ప్రవేశించింది అంటే ఒక భయానక వాతావరణం. కోబ్రా గ్రామంలోకి ఎంట్రీ ఇస్తే చాలు టెన్సన్ టెన్సన్.. అత్యంత వేగంగా పాకుతూ కలియతిరిగేది.

గ్రామస్తులు కనిపిస్తే వెంబడించేది. ఈ క్రమంలోనే అనేకసార్లు కింగ్ కోబ్రా దాడి నుండి గ్రామస్తులు తప్పించుకున్న సందర్భాలు ఉన్నాయి. కింగ్ కోబ్రాను చూడగానే గ్రామస్తులు భయంతో ఇళ్లలోకి పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకునే పరిస్థితి ఉండేది. ఏదోలా పాముని కొట్టి చంపుదామని గ్రామస్తులు ప్రయత్నించినా పామును చూసి భయంతో ఆ పరిస్థితి ఉండేది కాదు. చాలా చురుకుగా జనాలపై దూసుకు వచ్చి హంగామా చేసేది. గ్రామంలోకి ఎంటర్ అయిన పామును ఏదైనా స్నేక్ క్యాచర్ సహాయంతో పట్టుకుందాం అనుకుంటే పాము ఎప్పుడు వస్తుందో తెలియదు? వచ్చినప్పుడు స్నేక్ క్యాచర్ ని పిలుద్దామంటే స్నేక్ క్యాచర్ వచ్చేలోపే కింగ్ కోబ్రా గ్రామం నుండి వెళ్లిపోయేది. గ్రామం కొండ ప్రక్కనే ఉండటంతో కింగ్ కోబ్రాకు అనువుగా ఉండటం, తరుచూ వచ్చి హంగామా చేయడం గ్రామస్తులకు కంటి మీద కునుకు ఉండేది కాదు.

ఇవి కూడా చదవండి

వేపాడ మండలం భర్తాపురంలో జరిగిన ఈ ఘటన పరిసర ప్రాంత గ్రామాల్లో సైతం సంచలనంగా మారింది. నిత్యం కింగ్ కోబ్రా భయంతో నిద్ర లేని రాత్రులు గడుపుతుండేవారు గ్రామస్తులు. ఇక చేసేదిలేక గ్రామస్తులు అందరూ కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈసారి గ్రామంలోకి వచ్చిన కింగ్ కోబ్రాను ఎలాగైనా చంపాల్సిందేనని డిసైడ్ అయ్యారు. తరువాత రెండు రోజులకే ఎప్పటిలాగే కింగ్ కోబ్రా గ్రామంలోకి వచ్చింది. దీంతో వెంటనే అప్రమత్తమైన గ్రామస్తులు పెద్ద పెద్ద కర్రలతో ఇళ్లలో నుండి బయటకు వచ్చారు. అంతా కలిసికట్టుగా పామును చుట్టుముట్టి దాడి చేసి కర్రలతో కొట్టి చంపారు.

కోబ్రా గ్రామంలోకి అన్ని సార్లు ఎందుకు వచ్చింది?

అంత వరకు బాగానే ఉన్నా అసలు కింగ్ కోబ్రా గ్రామంలోకి అన్ని సార్లు ఎందుకు వచ్చింది? ఎందుకు గ్రామస్తులను వెంబడించింది? అనే అనుమానాలు గ్రామస్తులను తొలిచాయి. వెంటనే గ్రామస్తులు అంతా కలిసి ఒక జ్యోతిష్యుడుని కలిసి జరిగిన విషయం అంతా చెప్పారు. వారు చెప్పిందంతా విన్న జ్యోతిష్యుడు ఒక నిర్ఘాంతపోయే విషయం చెప్పాడు. గత ఆరు నెలల క్రితం భర్తాపురం సమీపంలో ఒక పెద్ద కింగ్ కోబ్రా, ఒక చిన్న కింగ్ కోబ్రా సంచరిస్తున్నాయని, వాటిని చూసిన స్థానికులు కొట్టి చంపారని, అప్పటి నుండి వాటితో కలిసి ఉండే ఈ కింగ్ కోబ్రా మీ గ్రామం పై పగపట్టిందని చెప్పాడు..

సర్పదోషం రూపం

మీరు చంపిన కింగ్ కోబ్రా భయంకరమైన పాము అని, ఆ పాము చనిపోయినా సర్పదోషం రూపంలో ఏదో ఒకలా మీ గ్రామం పై పగ తీర్చుకుంటుందని చెప్పారు. అంతే కాకుండా కింగ్ కోబ్రాను చంపటం మంచిది కాదని, గ్రామస్తులంతా కలిసి పూజలు చేయాలని, అప్పుడు మాత్రమే దోష నివారణ జరుగుతుందని చెప్పాడు. దీంతో ఇదెక్కడ ఖర్మ రా బాబు అని భయం భయంగానే గ్రామస్తులంతా కలిసి చనిపోయిన పామును హిందూ సంప్రదాయం ప్రకారం ఊరేగించి ఖననం చేసి ప్రత్యేక పూజలు చేశారు. తాము చేసిన తప్పును మన్నించి, తమ గ్రామాన్ని కాపాడాలని వేడుకున్నారు. ఇప్పుడు ఇదే అంశం చుట్టుపక్కల గ్రామాల్లో సైతం కలకలం రేపుతుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..