Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ ఐదు ఆలయాలను దర్శిస్తే మీ శని దోషం తొలగిపోతుంది..కష్టాలు తీరిపోయి అదృష్టం వరిస్తుంది..!

శని దోషం వీటిలో ముఖ్యమైనది. ఇది జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తుంది. శనీశ్వరుని సాడేసతి ప్రజల జీవితాల్లో విధ్వంసం సృష్టిస్తుంది. అటువంటి పరిస్థితిలో శని దోషాన్ని వదిలించుకోవడానికి అనేక నివారణలు చేస్తారు. అంతే కాకుండా శనిదేవుని ప్రత్యేక ఆలయాలను సందర్శించాలి. ఇక్కడ శనిశ్వరుడి దర్శనం మిమ్మల్ని కష్టాలనుంచి గట్టెక్కిస్తుంది. 

ఈ ఐదు ఆలయాలను దర్శిస్తే మీ శని దోషం తొలగిపోతుంది..కష్టాలు తీరిపోయి అదృష్టం వరిస్తుంది..!
Shani Dev
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 20, 2023 | 10:01 PM

శనివారం శనిశ్వరుడికి ప్రియమైన రోజు. అందుకే శనివారం శనిశ్వరుడికి అంకితం చేసిన రోజు. ఈ రోజున శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు అనేక చర్యలు చేపడుతుంటారు. శనిదేవుని అనుగ్రహం వల్ల జీవితంలో ఎలాంటి సమస్యలు దరిచేరవని నమ్ముతారు. శనివారం నాడు నిర్మలమైన మనస్సుతో శనిశ్వరుడిని పూజించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. కొందరు శనిదేవుని అనుగ్రహం కోసం ఈ రోజు ఉపవాసం కూడా ఉంటారు. అయితే,  శని దోషం నుండి బయటపడే చర్యలతో పాటు, మీరు ఈ ప్రత్యేక దేవాలయాలను సందర్శించవచ్చు. ఈ ఆలయాలను దర్శించుకుంటేనే శనిదోషం తొలగిపోతుందని నమ్మకం.

జ్యోతిషశాస్త్రంలో ఇటువంటి అనేక దోషాలు ప్రస్తావించబడ్డాయి. దీని కారణంగా మానవులు చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. శని దోషం వీటిలో ముఖ్యమైనది. ఇది జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తుంది. శనీశ్వరుని సాడేసతి ప్రజల జీవితాల్లో విధ్వంసం సృష్టిస్తుంది. అటువంటి పరిస్థితిలో శని దోషాన్ని వదిలించుకోవడానికి అనేక నివారణలు చేస్తారు. అంతే కాకుండా శనిదేవుని ప్రత్యేక ఆలయాలను సందర్శించాలి. ఇక్కడ శనిశ్వరుడి దర్శనం మిమ్మల్ని కష్టాలనుంచి గట్టెక్కిస్తుంది.

కోకిలవ శని దేవాలయం..

ఇవి కూడా చదవండి

కోకిలవన్ ధామ్ ఆలయం.. ఉత్తరప్రదేశ్‌లోని మధురలో ఉంది.7 శనివారాల పాటు వరకు ఇక్కడ శనిశ్వరుడికి తైలాన్ని నైవేద్యంగా పెట్టడం ద్వారా శని సంబంధమైన సర్వదోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.

శని సింఘాపూర్…

మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా శింగనాపూర్ గ్రామంలో శనిదేవుని ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని సందర్శించడం ద్వారా శనిదేవుని అనుగ్రహంతో శనిదోషం తొలగిపోతుంది. ఇక్కడ గ్రామంలోని ఇళ్లకు ఎవరూ తాళాలు వేయరు. ప్రతి ఇల్లు శనిదేవుని దయతో రక్షించబడుతుంది.

శ్రీ శనిశ్చర దేవాలయం..

శనిశ్చర మందిరం గ్వాలియర్‌లో ప్రసిద్ధ శనిదేవుని ఆలయం. మత విశ్వాసాల ప్రకారం, లంక నుండి హనుమంతుడు విసిరిన శని దేవుడి శరీరం ఇక్కడ పడిందని నమ్మకం. ఈ ఆలయాన్ని సందర్శిస్తే శని దోషం తొలగిపోతుంది.

తుమకూరు శని దేవాలయం..

శని దేవాలయం కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో ఉంది. ఈ ఆలయాన్ని సందర్శిస్తే శని దోషాలు తొలగిపోతాయి. శని దోషం ఉన్నవారు ఈ ఆలయాన్ని తప్పక దర్శించాలి. ఇక్కడ శని దేవుడు కాకిపై కూర్చుని ఉంటాడు.

శనిధామ్ ఆలయం..

ఢిల్లీలోని చత్తర్‌పూర్‌లోని శనిధామ్ ఆలయం కూడా చాలా ప్రసిద్ధి చెందింది. శనివారాల్లో చాలా మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. ఈ ఆలయంలో శనిదేవుడిని దర్శించుకోవడం ద్వారా శనిదోషం తొలగిపోతుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..