Saphala Ekadashi: సఫల ఏకాదశి ఈ నెల 25? లేదా 26నా? తేదీ, పూజా విధానం, మంత్రం, ప్రాముఖ్యత ఏమిటంటే

సఫల ఏకాదశి రోజున లోక రక్షకుడైన విష్ణువును పూజిస్తారు. ఈ రోజున ఉపవాసం, పూజలు చేయడం వల్ల మనిషి జీవితంలో సంతోషం కలుగుతుందని నమ్ముతారు. అంతేకాకుండా లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా లభిస్తాయని విశ్వాసం. ఈ ఏడాది సఫల ఏకాదశి ఎప్పుడు వచ్చింది? పూజా విధానం, గురించి తెలుసుకుందాం..

Saphala Ekadashi: సఫల ఏకాదశి ఈ నెల 25? లేదా 26నా? తేదీ, పూజా విధానం, మంత్రం, ప్రాముఖ్యత ఏమిటంటే
Saphala Ekadashi
Follow us
Surya Kala

|

Updated on: Dec 12, 2024 | 5:08 PM

ఏకాదశి ఉపవాసం నెలకు రెండుసార్లు ఆచరిస్తారు. అందులో ఒకటి శుక్ల పక్షంలోని ఏకాదశి రోజున.. మరొకటి కృష్ణ పక్షంలోని ఏకాదశిన. అయితే ప్రతి ఏకాదశికి దాని సొంత ప్రాముఖ్యత ఉంది. అందులో మార్గశిర మాసంలోని కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని సఫల ఏకాదశి అంటారు. ఈ రోజున శ్రీమహావిష్ణువును ఆరాధించడం, ఉపవాసం ఉండటం వల్ల మనిషి ప్రతి పనిలో విజయం సాధిస్తాడని నమ్ముతారు. అలాగే శ్రీ హరి అనుగ్రహం వల్ల జీవితంలో సుఖశాంతులు ఉంటాయి.

సఫల ఏకాదశి తేదీ

హిందూ వేద క్యాలెండర్ ప్రకారం ఈసారి మార్గశిర ఏకాదశి తిథి డిసెంబర్ 25వ తేదీ రాత్రి 10.29 గంటలకు ప్రారంభమవుతుంది. మర్నాడు అంటే డిసెంబర్ 26వ తేదీ మధ్యాహ్నం 12:43 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో..సఫల ఏకాదశి ఉపవాసం డిసెంబర్ 26 న ఆచరించబడుతుంది.

సఫల ఏకాదశి ఉపవాసం విరమణ సమయం

ఏకాదశి ఉపవాసం చేసిన వారు ఉపవాస దీక్షను విడిచి పెట్టె సమయం మర్నాడు సూర్యోదయం తర్వాత. అంటే ద్వాదశి తిధిలో చేయాల్సి ఉంటుంది. అందుకే సఫల ఏకాదశి ఉపవాసం ఉన్నవారు డిసెంబర్ 27న వ్రతాన్ని విరమించాల్సి ఉంటుంది. శుభ సమయం ఉదయం 7.12 నుంచి 9.16 వరకు ఉంటుంది.

ఇవి కూడా చదవండి

సఫల ఏకాదశి పూజ విధి

సఫల ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి ఉపవాసం ఉంటానని ప్రతిజ్ఞ చేసి విష్ణువుని పూజించాలి. ఆ తర్వాత ఆలయాన్ని శుభ్రం చేయాలి. తర్వాత పీటంపై విష్ణుమూర్తి విగ్రహం లేదా చిత్రాన్ని అమర్చండి. దీని తరువాత నెయ్యి దీపం వెలిగించి.. విష్ణువుకు పసుపు, కుంకుంతో బొట్టు పెట్టండి. స్వామికి ప్రసాదంగా తులసి దళం వేసి స్వీట్లను నైవేద్యంగా అందించండి. సాయంత్రం నియమాల ప్రకారం పూజలు చేసి విష్ణు సహస్ర నామాలను పఠించండి. చివరగా సఫల ఏకాదశి కథ చదివి హారతి ఇవ్వండి.

సఫల ఏకాదశి రోజున పూజ మంత్రం

ఓం నమః శ్రీ వాసుదేవాయ

ఓం హ్రీం శ్రీం లక్ష్మీవసుదేవాయ నమః

ఓం నమః నారాయణాయ

లక్ష్మీ వినాయక మంత్రం

ఓం నమో సిద్ధి వినాయకాయ సర్వ కార్య కర్త్రే సర్వ విఘ్న ప్రశమ్నాయ సర్వర్జయ వశ్యకర్ణాయ సర్వజన్ సర్వస్త్రీ పురుష్ ఆకర్షణాయ శ్రీం ఓం స్వాహా

సంపద , శ్రేయస్సు మంత్రం

ఓం భూరిద భూరి దేహినో, మ దభ్రం భూర్య భర్. భూరి ఘేదీంద్ర దిత్ససీ.

సఫల ఏకాదశి ప్రాముఖ్యత

హిందూ మత విశ్వాసాల ప్రకారం సఫల ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం వల్ల చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడకుండా అన్ని పనులు సులభంగా పూర్తవుతాయని నమ్మకం. ఈ రోజున, ఆలయం దగ్గర వెలిగించే దీపం , తులసి మొక్క దానం కూడా చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. సఫల ఏకాదశిని చేసిన వ్యక్తి అన్ని బాధలు తొలగిపోయి అదృష్టం తెరుచుకునే రోజుగా పురాణ గ్రంధాలలో వర్ణించబడింది. ఈ ఏకాదశి రోజున వ్రతాన్ని పాటించడం వల్ల మనిషి కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని విశ్వాసం

మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.