Varalakshmi Devi: సంతానం, సంపద కోసం ఈ శ్రావణ శుక్రవారం రోజున ఈ లక్ష్మిలను పూజించండి.. శుభఫలితాలు మీ సొంతం
సౌభాగ్యం కోసం మహాలక్ష్మిని పూజించే సమయం శ్రావణం. అష్ట లక్ష్ములను ఆడపడుచులు ఇష్టంగా పూజించే తరుణం. ఆదిలక్ష్మి, ధాన్య లక్ష్మి, ధన లక్ష్మి, గజ లక్ష్మి, సంతాన లక్ష్మి..ఇలా అష్టలక్ష్ములను భక్తి శ్రద్ధలతో ఆరాధించే దివ్యమైన కాలం.. శ్రావణ శుక్రవారం.

Varalakshmi Devi: శ్రావణమాసం(Shravana Masam) వచ్చిందంటే చాలు సందడిని తెలుస్తుంది. పండగలు, శుభకార్యాలతో ప్రతి ఇంటా సంతోషాల పర్వం నెలకొంటుంది. మహిళలు ఇష్టపడే మంగళ గౌరీ వ్రతం (Mangala Gouri Vratam) , వరలక్ష్మి వ్రతములతో పాటు.. పిల్లలు పెద్దలు ఇష్టంగా జరుపుకునే కృష్ణాష్టమి (krishnashtami), రాఖి పౌర్ణమి వంటి పండగలు కూడా శ్రావణ మాసంలో వస్తాయి. ముఖ్యంగా సౌభాగ్యం కోసం మహాలక్ష్మిని పూజించే సమయం శ్రావణం. అష్ట లక్ష్ములను ఆడపడుచులు ఇష్టంగా పూజించే తరుణం. ఆదిలక్ష్మి, ధాన్య లక్ష్మి, ధన లక్ష్మి, గజ లక్ష్మి, సంతాన లక్ష్మి..ఇలా అష్టలక్ష్ములను భక్తి శ్రద్ధలతో ఆరాధించే దివ్యమైన కాలం.. శ్రావణ శుక్రవారం.
గజలక్ష్మి ప్రాముఖ్యత:
అయితే అష్టలక్ష్మీ వైభవంలో గజలక్ష్మి రూపం ఎంతో ప్రత్యేకమైనది. దేవ దానవులు అమృతం కోసం సముద్రాన్ని మధనం సాగించే సమయంలో.. సముద్రుని కూతురుగా లక్ష్మీదేవి.. గజలక్ష్మిగా ఉద్భవించినట్లు భాగవతం చెబుతుంది. రెండు ఏనుగులు అమ్మ ప్రక్కన నిలబడి జలధారని వర్షింప చేస్తూంటాయి. ఇక్కడ ఏనుగులను గణపతి స్వరూపంగా భావిస్తారు. లక్ష్మీ గణపతి స్వరూపమైన గజలక్ష్మిని పూజిస్తే.. సకల శుభాలు, సుఖ సంతోషాలు కలుగుతాయని పురాణ వచనం.




సంతాన లక్ష్మి:
అలాగే అష్ట లక్ష్మీ వైభవంలో సంతాన లక్ష్మి ఆరాధనకు కూడా ప్రాముఖ్యత ఉంది. దంపతులు సంతోషంగా జీవించడానికి , తమ కుటుంబం మరో తరం ముందుకు వెళ్ళడానికి కావాల్సింది ఎవరికైనా సంతానమే. ఈ నేపథ్యంలో సంతానం కావాలనుకునే దంపతులు శ్రావణ మాసంలో సంతాన లక్ష్మిని పూజించి ప్రసన్నం చేసుకుంటారు.
బంగారం వరలక్ష్మి రూపం:
భారతీయులు బంగారు ప్రియులు. అలంకరణకోసమే కాదు.. కాదు.. ఆర్ధిక భరోసా కోసం కూడా తమ శక్తి కొలది బంగారం కొనుగోలుపై ఆసక్తిని చూపిస్తారు. ముఖ్యంగా శ్రావణ మాసంలో బంగారం కొనే సంప్రదాయం ఉంది. ఈ పవిత్ర మాసంలో బంగారం కొని.. వరలక్ష్మీ రూపంగా పూజిస్తారు. శ్రావణంలో కాసింత బంగారంతోనైనా వరమహాలక్ష్మిని ఆరాధించడం సర్వఫలప్రదమని భావిస్తారు. శ్రవణంలో లక్ష్మీదేవిని ఆరాధించండి.. శ్రావణ సిరిని మీ ఇంటికి ఆహ్వానించండి..! మీ పిల్లల కళ్లలో వెలుగు చూడండి..!
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, నమ్మకం పై ఆధారపడి ఇవ్వబడింది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది)