- Telugu News Photo Gallery Spiritual photos Chanakya niti should keep distance from these things or else there may be loss to your future know the details
Chanakya Niti: ఈ విషయాలకు దూరంగా ఉండాలి.. లేదంటే భారీ నష్టం జరిగే ఛాన్స్..
Chanakya Niti: ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో వ్యక్తి జీవితంలో పాటించాల్సి అనేక విషయాలను ప్రస్తావించారు. వీటిని పాటిస్తే జీవితంలో విజయం సాధించవచ్చు. ఆచార్య చాణక్యుడు కూడా దూరంగా ఉంచవలసిన నీతిశాస్త్రంలో ఇలాంటి అనేక విషయాలను ప్రస్తావించాడు. ఆ విషయాలు ఏంటో తెలుసుకుందాం.
Updated on: Aug 09, 2022 | 12:51 PM

ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో వ్యక్తి జీవితంలో పాటించాల్సి అనేక విషయాలను ప్రస్తావించారు. వీటిని పాటిస్తే జీవితంలో విజయం సాధించవచ్చు. ఆచార్య చాణక్యుడు కూడా దూరంగా ఉంచవలసిన నీతిశాస్త్రంలో ఇలాంటి అనేక విషయాలను ప్రస్తావించాడు. ఆ విషయాలు ఏంటో తెలుసుకుందాం.

అతికి పోవద్దు: ఆచార్య చాణక్యుడు ప్రకారం.. గొప్పలకు పోయి అతిగా ప్రవర్తించొద్దు. సాధారణంగానే మనిషి ఎన్నో రకాల అబద్ధాలు చెబుతారు. ఎదుటి వ్యక్తి ముందు తానే గొప్ప అని నిరూపించుకోవడం కోసం రకరకాల కబుర్లు చెబుతారు. దీనికి అంతమంటూ ఉండదు. అయితే, ఇది చివరకు ఇబ్బందులపాలు చేస్తుంది.

కోపం: కోపం అనేది ఒక వ్యక్తికి అత్యంత ఘోరమైన శత్రువు. మనిషి కోపంతో తనపై తాను నియంత్రణ కోల్పోతాడు. అలాంటి వారు ఎప్పటికీ గౌరవం పొందలేరు. ప్రతి ఒక్కరూ కోపంగా ఉన్నవారికి దూరమవుతారు. అందుకే సాధ్యమైనంత వరకు కోపాన్ని తగ్గించుకోవడం ఉత్తమం.

అహంకారం: మనిషికి అహంకారం ఉండకూడదు. అహంకారులు ఎప్పుడూ ఇబ్బందుల్లోనే ఉంటారు. వీరి అహంకారం వల్ల ప్రతిదీ కోల్పోతారు. అహం ఒక వ్యక్తిని సత్యానికి దూరంగా ఉంచుతుంది. అందుకే తనను తాను అర్థం చేసుకోలేరు. వీరి అహం కారణంగా భవిష్యత్‌లో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

సోమరితనం: ఆచార్య చాణక్యుడు ప్రకారం.. సోమరితనం ఒక వ్యక్తి ప్రతిభను నాశనం చేస్తుంది. సోమరితనం కారణంగా అనేక అవకాశాలను కోల్పోతాడు. సోమరితనం తన లక్ష్యానికి దూరం అవుతారు. ఇలాంటి వారు జీవితంలో ఏమీ సాధించలేరు.




