Sankranti Festival: సంక్రాంతి పండుగ విశిష్టత ఏమిటీ ? ఆ రోజున చేయాల్సిన దానాలేంటో తెలుసుకుందామా..

సంక్రాంతి అంటే కొత్త వెలుగులు. ముఖ్యంగా సంక్రాంతి రోజున గాలిపటాల వేడుక నిర్వహించడం అనేది విధి. ఇక ఈ పండుగను పూర్వం

Sankranti Festival: సంక్రాంతి పండుగ విశిష్టత ఏమిటీ ? ఆ రోజున చేయాల్సిన దానాలేంటో తెలుసుకుందామా..
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 13, 2021 | 7:49 AM

Sankranti Festival: సంక్రాంతి అంటే కొత్త వెలుగులు. ముఖ్యంగా సంక్రాంతి రోజున గాలిపటాల వేడుక నిర్వహించడం అనేది విధి. ఇక ఈ పండుగను పూర్వం మన పెద్దలు దాదాపు 33 రోజలపాటు ఘనంగా జరుపుకునేవారు.. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రస్తుతం ఈ పండుగను 3 రోజులపాటు మాత్రమే నిర్వహించుకుంటున్నారు. అయితే భగీరథుడు గంగను భూలోకానికి తీసుకువచ్చి.. సాగరులకు శాప విమోచనం చేయించింది ఈ రోజే అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇక సంక్రాంతికి నెల రోజుల ముందు నుండే పండుగ వాతావరణం కనిపిస్తుంది. మకర సంక్రమణం అంటే పాత పోయి కొత్తదనానికి స్వాగతం పలికే రోజు అని అర్థం. ఈ పర్వదినాలలో విష్ణు మూర్తిని ఆరాధిస్తాం.

సంక్రాంతి రోజు ఏం చేయాలి…

సంక్రాంతి పండుగకు పంట కోతలు అయిపోయి ధాన్యం ఇంటికి వస్తుంది. దీంతో పొలాల్లో ఉండే కీటకాలు ఇంట్లోకి రాకుండా వాకిళ్ళలో కళ్లాపి చల్లుతారు. ఆ తర్వాత ముగ్గులు వేసి అందులో రకరకాల రంగులు నింపి.. వాటి మధ్యలో ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలను పెడతారు. ఇక శ్రీమన్నారాయణుడి ప్రత్యక్షరూపం సూర్యభగవానుడు. సంక్రాంతి పర్వదినం రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి కొత్త దుస్తులను ధరించి.. సూర్యభగవానుడిని ఆరాధించాలి. ఆ తర్వాత ఆదిత్యహృదయం, సూర్యాష్టకం పారాయణం చేయాలి. ఇక ఇంట్లో ఉండే పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి. ఈ రోజు సూర్యుడు సంక్రమణ జరిగే సమయంలో సత్యనారాయణ వ్రతం, సూర్యనారాయణ స్వామి వ్రతం చేస్తే పుణ్యం వస్తుందని చెబుతుంటారు. అలాగే ఉదయం 7.30 నుంచి 9 గంటల సమయంలో ఈ వ్రతాలను చేయడం వలన అన్ని శుభాలు కలిగి.. భక్తుల కోర్కెలు నెరవేరుతాయని తెలిపారు.

ఆరోజున చేయాల్సిన ధానాలు..

సంక్రాంతి రోజున మన పూర్వీకులను పూజించడం ఆనవాయితీ. ఈరోజున సూర్యుడు సంక్రమణ సమయంలో పితృదేవతలకు తర్పణాలు, దేవతలు, పితృదేవతలకు దానాలు చేయాలి. సంక్రాంతి పర్వదినంనాడు భూదానం, సువర్ణదానం, వెండిదానం, అన్నదానం, పుస్తకదానం, బియ్యం, పప్పు, ఉప్పు, గుమ్మడికాయ వంటి నిత్యావసర వస్తువులను దానం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే ఆరోజున పితృదేవతలకు ఆరాధించడం వలన కుటుంబానికి మంచి జరుగుతుంది. సంవత్సరంలో ప్రతి రవి సంక్రమణానికి పితృదేవతలకు తర్పణాలు చేయలేని వారు మకర సంక్రాంతి రోజున నల్ల నువ్వులతో పితృదేవతలకు తర్పణాలిస్తే సంవత్సరంలో వచ్చే అన్ని సంక్రాంతులకు ఇచ్చినట్టేనని మన పూర్వీకులు చెబుతుంటారు. అలాగే ఈ పండుగ రోజున గడపకు పసుపు పెట్టి.. కుంకుమ పెట్టడం, వాకిట్లో ముగ్గులు వేసి.. వాటిలో ఆవు పేడ గొబ్బెమ్మలు పెట్టడం.. ఇంట్లో పిండివంటలు, పరమాన్నం చేసి శ్రీమన్నారాయణుడిని ఆరాధించడం వలన అన్ని శుభాలు జరుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.

Also Read: Sankranthi Festival: సంక్రాంతి పండుగ రోజు ఈ పనులు అసలు చెయ్యొద్దంటా.. ఎందుకో తెలుసా ?

Sankranti Festival : దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రజలు వివిధ రకాలుగా జరుపుకునే పంటల పండుగ సంక్రాంతి!