AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sri Rama Navami: మానవుడిగా పుట్టి దైవంగా మారిన శ్రీరాముడిలో ఈ ఐదులక్షణాలు పాటించి చూడండి.. జీవితంలో విజయం మీ సొంతం

తన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా.. రాము ఎప్పుడూ సత్యాన్ని, ధర్మాన్ని విడిచిపెట్టలేదు. శ్రీరామునిలో గొప్ప లక్షణాల గురించి వివరంగా తెలుసుకుందాం.. వాటిని నేటి మనిషి అనుసరించినట్లు అయితే.. జీవితంలోని ప్రతి రంగంలో విజయం సాధించడం ఖాయం.

Sri Rama Navami: మానవుడిగా పుట్టి దైవంగా మారిన శ్రీరాముడిలో ఈ ఐదులక్షణాలు పాటించి చూడండి.. జీవితంలో విజయం మీ సొంతం
Lord Sri Rama
Surya Kala
|

Updated on: Mar 28, 2023 | 1:36 PM

Share

హిందూ సనాతన సంప్రదాయంలో శ్రీ రాముని పేరు అతిపెద్ద తారక మంత్రంగా పరిగణించబడుతుంది. హిందూ పురాణాల ప్రకారం, విష్ణువు అవతారంగా భావించే శ్రీరాముని ఆరాధన అన్ని దుఃఖాలు, కష్టాలను తొలగిస్తుందని.. సుఖ సంపదలను ప్రసాదిస్తుందని నమ్మకం. మానవునిగా పుట్టి తన నడతతో, నడవడికతో పురుషోత్తముడుగా ఖ్యాతిగాంచిన శ్రీరాముడు ప్రపంచంలోనే ఆదర్శప్రాయుడు.  తన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా.. రాము ఎప్పుడూ సత్యాన్ని, ధర్మాన్ని విడిచిపెట్టలేదు. శ్రీరామునిలో గొప్ప లక్షణాల గురించి వివరంగా తెలుసుకుందాం.. వాటిని నేటి మనిషి అనుసరించినట్లు అయితే.. జీవితంలోని ప్రతి రంగంలో విజయం సాధించడం ఖాయం.

సూర్యోదయానికి ముందే నిద్ర లేవడం పురాణాల ప్రకారం.. రాముడు సూర్యవంశస్థుడు. ప్రతిరోజూ సూర్యోదయానికి ముందే నిద్ర లేచి.. ఉదయించే సూర్య భగవానుని పూజించేవాడు. శ్రీరామునిలోని ఈ గుణాన్ని మీరు మీ జీవితంలో పెంపొందించుకుంటే.. మీ లక్ష్యాన్ని సాధించడానికి, సవాళ్లను ఎదుర్కోవడానికి ఒక మార్గాన్ని కనుగొనవచ్చు. ఉదయమే నిద్రలేవడం వలన ఆలోచనలపై ప్రభావం చూపుతుంది. అంతేకాదు మీ జీవితంలోని సగం సమస్యలు ఖచ్చితంగా రెప్పపాటులో తొలగిపోతాయి. మంచి ఆలోచనలతో జీవితాన్ని సుఖమయం చేసుకోగలరు.

అసాధ్యమైన ప్రతి పనిని మేనేజ్‌మెంట్ తో సాధించడం పురాణాల ప్రకారం..రాముడు నిర్వహణ కళలో ప్రావీణ్యం కలిగి ఉన్నాడు. తన వనరులను, ప్రజలను ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఆయనకు తెలుసు. రాముడు ఇతరులలోని లక్షణాలను పరిశీలించడం ద్వారా వారి నుండి అత్యుత్తమ గుణాలను తీసుకునేవాడు.  హనుమంతుడిని లంకకు పంపడం, సంజీవని మూలికను తెచ్చే విషయం, సముద్రాన్ని దాటేందుకు వంతెనగా నిర్మించే బాధ్యత ఇలా ప్రతి విషయంలోనూ రాముడి ఆలోచన విధానం కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

అందరి పట్ల సమాన వైఖరి రామాయణ కథానాయకుడిగా పిలుచుకునే శ్రీరాముడు చాలా వినయం గలవ్యక్తి. అందరిని సమాన దృక్పథంతో చూసేవాడు. చిన్నా పెద్దా అందరిని సమానంగా చూస్తాడు. పడవ నడిపే వ్యక్తి నుంచి అష్ట-సిద్ధి దాత అయిన మహాబలి హనుమంతుడి సహా అందరిని సమదృష్టితోనే చూశాడు. వారిని కౌగిలించేకూరి వారి పట్ల తన ప్రేమను వ్యక్తం చేశాడు. అయోధ్యకు రాజుగా అయినప్పటికీ తన  మనస్సులో ఎటువంటి విషయాలకు ప్రాముఖ్యత ఇవ్వలేదు. అంతేకాదు ప్రేమతో శబరి పెట్టిన ఎంగిలి పండ్లను అత్యంత ఇష్టంగా తిన్నాడు. సమాజంలోని అన్ని వర్గాల నుండి  శ్రీరాముడికి ప్రేమ, మద్దతు లభించడానికి ఇదే కారణం.

సంబంధాలను గౌరవించే గుణం తన జీవితంలో ఏర్పడిన అన్ని సంబంధాలను గౌరవిస్తూ.. రామయ్య తన తర్వాత తరాల వారికీ ఉదాహరణగా నిలిచాడు. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు తమ ఇంట్లో రామయ్య వంటి కొడుకు, సోదరుడు, స్నేహితుడు, యజమాని కావాలని కోరుకుంటున్నారు. అంటే దీనికి కారణం రాముడు బంధాల పట్ల చూపించిన బాధ్యతనే.. రాముడు తన ప్రతి బంధానికి గౌరవం ఇస్తూ తన భావాలను విస్మరించలేదు. తన తండ్రి వాగ్దానాన్ని నెరవేర్చడానికి, మొత్తంరాజ్యాన్ని విడిచిపెట్టాడు. సుగ్రీవుడు, విభీషుణుడు వంటి వారితో చేసిన రాముడి స్నేహం.. నేటికీ గొప్ప ఉదాహరణగా నిలిచింది. రాముడికి హనుమంతుడు గొప్ప భక్తుడు..

 గొప్ప ఉదాహరణగా ఉండడం కోసం మహావిష్ణువు అవతారమైనా, లోకరక్షకుడైనా, సమస్త శక్తులను కలిగి ఉన్నా, రాముడు ఎప్పుడూ సామాన్య మానవుడిగానే జీవించాడు. జీవితానికి సంబంధించిన అతి పెద్ద సవాళ్లను అధిగమించేందుకు పరిమిత మార్గాల్లో అపరిమిత లక్ష్యాలను నిర్దేశించుకుని సామాన్యుడిలా సాధించి చూపించాడు. ఒక సాధారణ మానవుడిలా.. కష్టాలు ఎదురైనా… వాటిని అనుభవిస్తూ.. ఆ కష్టతరమైన జీవిత మార్గంలో నడవడం ద్వారా నేటి తరానికి మార్గదర్శకంగా నిలిచాడు.

మరిన్ని ఆధాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

Follow Us