గుమ్మడికాయలే మహా నైవేద్యం.. రాచగుమ్మడి రహస్యం ఏంటి.? ఎక్కడ ఆ వింత మొక్కులు..?

ఆ జాతరలో గుమ్మడి కాయలే ఫేమస్.. వీరభద్రుడికి గుమ్మడికాయ సమర్పిస్తే మొక్కు తీరినట్లే..! కోరికలు నెరవేరిన ప్రతిఒక్కరూ నెత్తిన గుమ్మడికాయ ఎత్తుకుని కోర మీసాల వీరభద్రుడి వద్దకు క్యూ కడతారు.. ఇంతకీ ఆ గుమ్మడకాయ మొక్కుల మిస్టరీ ఏంటి..? ఎక్కడుంది ఆ దేవాలయం..? ఇప్పడు తెలుసుకుందాం..

గుమ్మడికాయలే మహా నైవేద్యం.. రాచగుమ్మడి రహస్యం ఏంటి.? ఎక్కడ ఆ వింత మొక్కులు..?
Pumpkins Are A Great Offering
Follow us
Balaraju Goud

|

Updated on: Jan 15, 2024 | 5:27 PM

ఆ జాతరలో గుమ్మడి కాయలే ఫేమస్.. వీరభద్రుడికి గుమ్మడికాయ సమర్పిస్తే మొక్కు తీరినట్లే..! కోరికలు నెరవేరిన ప్రతిఒక్కరూ నెత్తిన గుమ్మడికాయ ఎత్తుకుని కోర మీసాల వీరభద్రుడి వద్దకు క్యూ కడతారు.. ఇంతకీ ఆ గుమ్మడకాయ మొక్కుల మిస్టరీ ఏంటి..? ఎక్కడుంది ఆ దేవాలయం..? ఇప్పడు తెలుసుకుందాం.

దేవాలయానికి వెళ్లిన భక్తులు కొబ్బరికాయలు కొట్టడం.. పసుపు కుంకుమలు సమర్పించడం.. ముడుపు కట్టడం కామన్.. మేడారం సమ్మక్క సారక్క దేవతలకైతే బెల్లం మహా నైవేద్యంగా మొక్కులు సమర్పిస్తారు. కానీ హనుమకొండ జిల్లాలోని కొత్తకొండ వీరభద్రుడికి మాత్రం గుమ్మడికాయలే మహా నైవేద్యం. కోటీశ్వరులైనా, కటిక పేదలైన సరే ఈ దేవుణ్ణి దర్శించుకోవాలంటే నెత్తిన గుమ్మడికాయ ఎత్తుకొని రావాల్సిందే..!

కొత్తకొండ వీరభద్రస్వామి కి మొక్కుకున్న ప్రతిఒక్కరు ఆ కోరిక తీరిన వెంటనే నెత్తిన రాచ గుమ్మడి కాయ ఎత్తుకొని కొత్తకొండకు క్యూ కడుతుంటారు. జాతర సమయంలో ఇక్కడ గుమ్మడికాయ రాసుల కనిపిస్తాయి. సామాన్య భక్తులేకాదు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు కూడా నెత్తిన రాచగుమ్మడికాయ, చేతిలో కోర మీసాలతో తరలివచ్చి మల్లన్నకు మొక్కులు చెల్లించుకుంటున్నారు..

భక్తులు గుమ్మడికాయ నెత్తిన ఎత్తుకొని కోర మీసాల వీరన్నకు రాచగుమ్మడికాయ సమర్పించడమే ఈ జాతరలో ఆనవాయితీగా కొనసాగుతుంది..ఐతే గుమ్మడికాయ మొక్కులకు కూడా చాలాపెద్ద చరిత్రే ఉంది. దక్షయజ్ఞంలో దక్షున్ని వీరభద్రుడు సంహరించినట్లు చరిత్ర చెపుతుంది. వీరభద్రుడు కోపాన్ని శాంతింప చేయాలంటే ఎన్నితలలు తెగినా అసాధ్యమే. పరిహారంగా కూష్మాండం అంటే రాచగుమ్మడి కాయను సమర్పిస్తే వీరభద్రుడు శాంతించి అనుగ్రహిస్తాడనేది నమ్మకం…

కూష్మాడంగా పిలువబడే రాచగుమ్మడి ప్రాశస్త్యం తెలిసిన ప్రతిఒక్కరూ కొత్తకొండకు రావాలంటే గుమ్మడికాయ నెత్తిన ఎత్తుకోవల్సిందే…ఆ నమ్మకంతోనే సంక్రాంతి పర్వదినాన భక్తులు నెత్తిన గుమ్మడి కాయ ఎత్తుకొని తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు.. జాతర సమయంలో కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయ ప్రాంగణంలో వేలాది రాచగుమ్మడికాయల వ్యాపారం జరుగుతుంది..

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

HMPV: భారత్‌లో తొలి HMPV కేసు.. 8 నెలల చిన్నారికి
HMPV: భారత్‌లో తొలి HMPV కేసు.. 8 నెలల చిన్నారికి
తోపులైనా, తరుములైనా జాన్తానై.. నాకు కావాల్సింది అదే: గంభీర్
తోపులైనా, తరుములైనా జాన్తానై.. నాకు కావాల్సింది అదే: గంభీర్
భారత్ వద్దంది.. కట్‌చేస్తే.. 7 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలతో రచ్చ
భారత్ వద్దంది.. కట్‌చేస్తే.. 7 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలతో రచ్చ
సైకిల్ తొక్కితే క‌లిగే అద్భుత‌మైన లాభాలు తెలుసా..? మానసిక ఒత్తిడి
సైకిల్ తొక్కితే క‌లిగే అద్భుత‌మైన లాభాలు తెలుసా..? మానసిక ఒత్తిడి
డబ్బుందన్న గర్వంతో అవమానిస్తున్నాడు.. హనీ రోజ్ ఆవేదన
డబ్బుందన్న గర్వంతో అవమానిస్తున్నాడు.. హనీ రోజ్ ఆవేదన
మిమ్మిల్ని కూడా ఇలా కాల్చేస్తే ఎలా ఉంటుంది బ్రో..
మిమ్మిల్ని కూడా ఇలా కాల్చేస్తే ఎలా ఉంటుంది బ్రో..
ప్లేయింగ్ 11లో మొండిచేయి.. కట్‌చేస్తే.. ఆడకుండానే ఖాతాలోకి కోట్లు
ప్లేయింగ్ 11లో మొండిచేయి.. కట్‌చేస్తే.. ఆడకుండానే ఖాతాలోకి కోట్లు
పట్టులాంటి జుట్టు కావాలంటే కలబందతో ఈ 5 హెయిర్ ప్యాక్స్ చేయండి..
పట్టులాంటి జుట్టు కావాలంటే కలబందతో ఈ 5 హెయిర్ ప్యాక్స్ చేయండి..
చర్లపల్లి స్టేషన్‌లో 9 ప్లాట్‌ఫామ్‌లు, 6 లిఫ్ట్‌లు, 7 ఎస్కలేటర్లు
చర్లపల్లి స్టేషన్‌లో 9 ప్లాట్‌ఫామ్‌లు, 6 లిఫ్ట్‌లు, 7 ఎస్కలేటర్లు
పాతబస్తీ మెట్రో ప్రాజెక్ట్ భూసేకరణలో కీలక ఘట్టం
పాతబస్తీ మెట్రో ప్రాజెక్ట్ భూసేకరణలో కీలక ఘట్టం