Pitru Paksham 2024: మొదలైన చంద్రగ్రహణం.. ఈ సమయంలో పొరపాటున కూడా పూర్వీకులకు తర్పణం విడవకండి.. ఎందుకంటే

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సంవత్సరంలో రెండవ, చివరి చంద్రగ్రహణం సెప్టెంబర్ 18, 2024 ఉదయం 6:11 గంటలకు ప్రారంభమైంది. ఇది ఉదయం 10:17 గంటలకు ముగుస్తుంది. ఈసారి చంద్రగ్రహణం 4 గంటల 6 నిమిషాల పాటు సుదీర్ఘంగా ఉంటుంది. పెనుంబ్రల్ చంద్ర గ్రహణం జ్యోతిషశాస్త్రంలో భారత దేశంలో ఏర్పడుతుందని గుర్తించబడలేదు.. కనుక ఈ గ్రహణ సమయం సూతక కాలం చెల్లదు. ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు..

Pitru Paksham 2024: మొదలైన చంద్రగ్రహణం.. ఈ సమయంలో పొరపాటున కూడా పూర్వీకులకు తర్పణం విడవకండి.. ఎందుకంటే
Chandra Grahan Impact On Pitru Paksham
Follow us
Surya Kala

|

Updated on: Sep 18, 2024 | 7:08 AM

ఈ సంవత్సరంలో రెండవ, చివరి చంద్రగ్రహణం ఏర్పడింది. అయితే ఈ గ్రహణం భారత్ లో కనిపించదు. కనుక గ్రహణ సమయంలో సూత కాలం ఉండదు. అయినప్పటికీ గ్రహణ ప్రభావం మాత్రం ఉండనుందని పండితులు చెప్పారు. అదే సమయంలో ఈ చంద్ర గ్రహణం రోజునే పితృ పక్షం ప్రతిపాద శ్రాద్ధ కర్మలను మొదలు పెట్టె సమయం కూడా వచ్చింది. ఈ గ్రహణం సమయంలో పూర్వీకులకు తర్పణం సమర్పించడం విషయంలో వివిధ మతపరమైన, సాంస్కృతిక విశ్వాసాలు ఉన్నాయి. భారతీయ సంప్రదాయాలలో గ్రహణం సమయంలో ప్రత్యేక నియమాలు ఉన్నాయి. అంటే కాదు గ్రహణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా సూచించబడ్డాయి.

గ్రహణం సమయంలో భూమిపై ప్రతికూల శక్తి ప్రభావం పెరుగుతుంది. కనుక గ్రహణ సమయంలో పూర్వీకులకు తర్పణం సమర్పించకూడదనేది ఓ నమ్మకం. ఈ కారణంగా పూర్వీకులకు ఈ సముయంలో సమర్పించిన తర్పణం ఫలితాన్ని ఇవ్వదు. గ్రహణం సమయంలో సూర్య చంద్రులు ఇబ్బంది పడతారని నమ్మకం. కనుక ఈ సమయంలో ఎటువంటి శుభకార్యాలు, పూజలు లేదా పూర్వీకులకు తర్పణం సమర్పించకూడదని పండితులు చెప్పారు. ఈ సమయంలో తర్పణం అందించడం పూర్వీకులకు కోపం తెప్పించవచ్చు.. కనుక ప్రయోజనానికి బదులుగా నష్టపోవచ్చు.

చంద్ర గ్రహణం సమయం

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సంవత్సరంలో రెండవ, చివరి చంద్రగ్రహణం సెప్టెంబర్ 18, 2024 ఉదయం 6:11 గంటలకు ప్రారంభమైంది. ఇది ఉదయం 10:17 గంటలకు ముగుస్తుంది. ఈసారి చంద్రగ్రహణం 4 గంటల 6 నిమిషాల పాటు సుదీర్ఘంగా ఉంటుంది. పెనుంబ్రల్ చంద్ర గ్రహణం జ్యోతిషశాస్త్రంలో భారత దేశంలో ఏర్పడుతుందని గుర్తించబడలేదు.. కనుక ఈ గ్రహణ సమయం సూతక కాలం చెల్లదు. ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు..

ఇవి కూడా చదవండి

పితృ పక్షం ఎప్పుడంటే

హిందూ క్యాలెండర్ ప్రకారం పితృ పక్షం భాద్రపద పౌర్ణమి తిది నుంచి భాద్రపద మాసం అమావాస్య తిథి వరకు ఉంటుంది. ఈ ఏడాది పితృ పక్షం 17 సెప్టెంబర్ 2024 నుండి ప్రారంభమైంది. ఇది అక్టోబర్ 02 వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో ప్రజలు తమ పూర్వీకులకు తర్పణం, శ్రాద్ధ కర్మలు మొదలైనవాటిని నిర్వహిస్తారు. పితృ పక్షాన్ని శ్రద్ధ కర్మల పక్షం అని కూడా అంటారు.

పూర్వీకులకు తర్పణం అందించే సమయం

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పూర్వీకులకు నీటిని సమర్పించడానికి ఉత్తమ సమయం మధ్యాహ్నం 11:30 నుండి 12:30 గంటల మధ్య. ఈ సమయంలో తర్పణం, శ్రద్ధ కర్మలు, పిండ ప్రదానం వంటి కార్యక్రమాల ద్వారా పూర్వీకులను ప్రసన్నం చేసుకోవచ్చు అని నమ్మకం.

పూర్వీకులకు తర్పణం ఇవ్వడంలో ప్రాముఖ్యత

హిందూ మతంలో పూర్వీకులకు తర్పణం అందించడం అంటే నీటిని సమర్పించడం అనేది ఒక ముఖ్యమైన ఆచారం. ఇది ఇంట్లో మరణించిన పూర్వీకులను తలచుకుంటూ నీటిని అందించే ప్రక్రియ. ఈ ఆచారం వల్ల పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూరుతుందని, వారికి మోక్షం లభిస్తుందని విశ్వసిస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి

భారత్‌-జర్మనీ మధ్య సుస్థిర అభివృద్ధికి రోడ్‌మ్యాప్‌..!
భారత్‌-జర్మనీ మధ్య సుస్థిర అభివృద్ధికి రోడ్‌మ్యాప్‌..!
రాజకీయాలకు పోసాని గుడ్‌బై.. ఇకపై ఆఖరి శ్వాస వరకు..
రాజకీయాలకు పోసాని గుడ్‌బై.. ఇకపై ఆఖరి శ్వాస వరకు..
పుష్ప2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్.! సుక్కు దెబ్బ అది
పుష్ప2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్.! సుక్కు దెబ్బ అది
మనబొమ్మ అదుర్స్.. బాలీవుడ్‌ బెదుర్స్.! ఫిల్మ్ ఇండస్ట్రీ పై టాలీవు
మనబొమ్మ అదుర్స్.. బాలీవుడ్‌ బెదుర్స్.! ఫిల్మ్ ఇండస్ట్రీ పై టాలీవు
మీ రివ్యూ మీ ఇష్టమైతే.. మా సినిమా మా ఇష్టం.! రివ్యూవర్స్‌పై
మీ రివ్యూ మీ ఇష్టమైతే.. మా సినిమా మా ఇష్టం.! రివ్యూవర్స్‌పై
జక్కన్న సంగతి తెలిసిందేగా.. SSMB29 ఇప్పట్లో లేనట్లేనా.?
జక్కన్న సంగతి తెలిసిందేగా.. SSMB29 ఇప్పట్లో లేనట్లేనా.?
బన్నీ,సుకుమార్‌ దేవీశ్రీ ని పక్కన పెట్టేశారా? మధ్యలో తమన్ ఎందుకు?
బన్నీ,సుకుమార్‌ దేవీశ్రీ ని పక్కన పెట్టేశారా? మధ్యలో తమన్ ఎందుకు?
వామ్మో.. అనుష్క.! వయసు 43ఏళ్లే.. కానీ సంపాదన 140 కోట్లు.!
వామ్మో.. అనుష్క.! వయసు 43ఏళ్లే.. కానీ సంపాదన 140 కోట్లు.!
ఇండియాలోనే పరమ చెత్త సినిమా.. 45కోట్లు పెడితే 70 వేల కలెక్షన్స్‌.
ఇండియాలోనే పరమ చెత్త సినిమా.. 45కోట్లు పెడితే 70 వేల కలెక్షన్స్‌.
శివునికి నమస్కరిస్తూ కుప్పకూలిపోయిన వ్యక్తి... CPR చేసినా..
శివునికి నమస్కరిస్తూ కుప్పకూలిపోయిన వ్యక్తి... CPR చేసినా..