Parivartini Ekadashi: పరివర్తిని ఏకాదశి రోజున ఈ వస్తువులను దానం చేయండి.. లక్ష్మీ దేవి అనుగ్రహం మీ సొంతం
హిందూ క్యాలెండర్ ప్రకారం పరివర్తిని ఏకాదశి ఉపవాసం భాద్రపద మాసంలోని శుక్ల పక్షంలోని ఏకాదశి రోజున పాటించబడుతుంది. ఈ సంవత్సరం పరివర్తిని ఏకాదశి వ్రతం 14 సెప్టెంబర్ 2024 శనివారం రోజున చేయనున్నారు. మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 15న ఉపవాస దీక్ష విరమిస్తారు. అదే విధంగా పరివర్తినీ ఏకాదశి రోజున చేసే దానాలకు విశిష్ట ఫలితాలు ఉంటాయని నమ్మకం. ఈ నేపధ్యంలో ఏఏ వస్తువులను దానం చేయడం వలన ఏయే ఫలితాలు లభిస్తాయో తెలుసుకుందాం..

హిందూ మతంలో పరివర్తిని ఏకాదశి రోజున చేసే ఉపవాసం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఏకాదశి తిధి విష్ణుమూర్తికి అంకితం చేయబడింది. పరివర్తిని ఏకాదశి భాద్రపద మాసంలోని శుక్ల పక్షంలోని ఏకాదశి తిథిన ఆచరిస్తారు. ఈ రోజున ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల సకల పాపాలు నశించి మోక్షం లభిస్తుందని నమ్ముతారు. ఈ రోజున శ్రీమహావిష్ణువును పూజించి ఉపవాసం ఉంటారు. పరివర్తినీ ఏకాదశి పద్మ ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏకాదశి చాలా పవిత్రమైనదిగా భావిస్తారు.
పరివర్తినీ ఏకాదశి 2024 తేదీ
హిందూ క్యాలెండర్ ప్రకారం పరివర్తిని ఏకాదశి ఉపవాసం భాద్రపద మాసంలోని శుక్ల పక్షంలోని ఏకాదశి రోజున పాటించబడుతుంది. ఈ సంవత్సరం పరివర్తిని ఏకాదశి వ్రతం 14 సెప్టెంబర్ 2024 శనివారం రోజున చేయనున్నారు. మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 15న ఉపవాస దీక్ష విరమిస్తారు. అదే విధంగా పరివర్తినీ ఏకాదశి రోజున చేసే దానాలకు విశిష్ట ఫలితాలు ఉంటాయని నమ్మకం. ఈ నేపధ్యంలో ఏఏ వస్తువులను దానం చేయడం వలన ఏయే ఫలితాలు లభిస్తాయో తెలుసుకుందాం..
ఆహార ధాన్యాలు
పరివర్తిని ఏకాదశి రోజున బియ్యం, గోధుమలు, పప్పులు మొదలైన ఆహార ధాన్యాలను దానం చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆహార కొరత ఉండదని నమ్ముతారు.
నీటి దానం:
నీరు, ఆహార వితరణ అతిపెద్ద దానంగా పరిగణించబడుతుంది. సనాతన ధర్మం నమ్మకం ప్రకారం నీటిని దానం చేయడం ద్వారా ఒక వ్యక్తి మోక్షాన్ని పొందుతాడు. కనుక ఏకాదశి రోజున నీటిని దానం చేయడం మంచిదని భావిస్తారు.
బట్టలు దానం:
పరివర్తిని ఏకాదశి రోజున వస్త్రదానం చేయడం కూడా చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ రోజున పసుపు బట్టలు, దుప్పట్లు మొదలైన వాటిని కూడా దానం చేయవచ్చు. ఇలా చేయడం వల్ల కోరికలు నెరవేరుతాయని నమ్మకం.
డబ్బు విరాళం:
పరివర్తినీ ఏకాదశి నాడు తన శక్తి మేరకు డబ్బును అవసరమైన వారికి దానం చేయాలి.
పండ్లు దానం:
పరివర్తినీ ఏకాదశి రోజున అరటి, యాపిల్, బత్తాయి వంటి అనేక రకాల పండ్లను దానం చేయవచ్చు. ఈ రోజున పండ్లను దానం చేయడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు.
మిఠాయిలను పంచడం
పరివర్తినీ ఏకాదశి రోజున మోతీచూర్ లడ్డూలు, కోవా, మిఠాయిలను దానం చేయడం కూడా చాలా శుభప్రదంగా భావిస్తారు. కాబట్టి ఈ రోజున తీపి పదార్థాలను కూడా దానం చేయాలి.
తులసి మొక్క దానం:
పరివర్తిని ఏకాదశి నాడు తులసి మొక్కను దానం చేయడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు.
పుస్తకాల విరాళం:
పరివర్తిని ఏకాదశి రోజున మత గ్రంథాలు లేదా పుస్తకాలను దానం చేయడం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. వీలైతే ఈ రోజున భగవద్గీత, రామాయణం వంటి పుస్తకాలను దానం చేయండి. ఇలా చేయడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి








