Significance of Owl: హిందూ ధర్మ శాస్త్రంలో గుడ్లగూబకు ఉన్న విశిష్టత ఏమిటో తెలుసా ..!

అనేక ప్రచారాలతో గుడ్లగూబ అంటే ఓ భయంకరమైన పక్షి అనే భావన చాలా మందిలో నెలకొంది. అయితే హిందూ శాస్త్ర పురాణాల ప్రకారం గుడ్లగూబ ను మించిన శుభ శకునం మరొకటి లేదట.

Significance of Owl: హిందూ ధర్మ శాస్త్రంలో గుడ్లగూబకు ఉన్న విశిష్టత ఏమిటో తెలుసా ..!
Follow us

|

Updated on: Feb 17, 2021 | 5:35 PM

Significance of Owl: అంతరించిపోతున్న పక్షుల్లో గుడ్లగూబ ఒకటి. పెద్ద పెద్ద కనులతో చూడడానికి అందవికారంగా ఉండడమే కాదు.. దీని అరుపు కూడా వినడానికి భయంకరంగా ఉంటుంది.. మిగతా పక్షులకంటే భిన్నంగా ఉండే ఈ గుడ్లగూబ రైతులకు నేస్తాలు.. అయితే వీటిని చూడడానికి చాలా మంది భయపడుతుంటారు.. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వీటిని చూస్తే కీడు అని వినడమే ఓ కారణమైతే.. అది ఇంట్లో కనిపిస్తే ఇల్లు విడిచి పెట్టాలి.. చావు వార్త వినిపిస్తుంది ఇలా అనేక ప్రచారాలతో గుడ్లగూబ అంటే ఓ భయంకరమైన పక్షి అనే భావన చాలా మందిలో నెలకొంది.

అయితే హిందూ శాస్త్ర పురాణాల ప్రకారం గుడ్లగూబ ను మించిన శుభ శకునం మరొకటి లేదట. లక్ష్మీదేవికి గుడ్లగూబ వాహనం అని చెబుతోంది. ఈ శ్రీలక్ష్మి స్వామివారితో కలిసి ప్రయాణం చేయవలసి వస్తే గరుత్మంతుడిని వాహనంగా.. ఒంటరిగా ప్రయాణం చేయాల్సి వస్తే.. గుడ్లగూబను అధిరోహించేదని శాస్త్రాలు చెబుతున్నాయి.

ఇక ఉల్లూక తంత్రం ప్రకారం నాల్గో జాములో గుడ్లగూబ ఎవరి ఇంటిపై వాలితే ఆ ఇల్లు సిరిసంపదలతో తులతూగుతుందట. ఇక ఎవరైనా ప్రయాణం చేస్తున్నపుడు ఈ పక్షి ఎడమవైపు కనిపిస్తే .. ఆ పని తప్పనిసరిగా పూర్తి అవుతుంది.. ఇక గుడ్ల గూబ దర్శనం శుభ ఫలితాలనిస్తుంది. ఏ ఇంటి అవారణలో గుడ్ల గూబ నివశిస్తుందో ఆ ఇంటి యజమాని సహా కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి. కనుక ఇక నుంచైనా ఈ గుడ్లగూబ అపశకునం అనుకోకుండా శుభం మంచి కలిగిస్తుంది అని భావించాలని అంటున్నారు.

Also Read:

రాజన్న ఆలయంలో నిండిన హుండీలు .. కానుకలు ఎక్కడ సమర్పించాలో తెలియక భక్తుల ఇబ్బందులు

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ‘కళ్యాణమస్తు’ కార్యక్రమానికి ముహూర్తం ఫిక్స్.. 10 ఏళ్ల తర్వాత మళ్లీ