Nirjala ekadashi 2025: 24 ఏకాదశుల పుణ్యఫలం దక్కాలంటే.. ఈ రోజున మీరు చేయాల్సిన పనులివే..!
ఏడాదిలో వచ్చే అన్ని ఏకాదశుల ఫలితం ఈ ఒక్క నిర్జల ఏకాదశిని ఆచరించటం వల్ల పొందగలరని నిపుణులు చెబుతున్నారు. గతంలో చేసిన పాపాలన్నింటికీ క్షమాపణ దొరుకుతుందని అంటారు. మీరు చేసిన ఎలాంటి ఘోరమైన సరే.. నిర్జల ఏకాదశి నియమాన్ని భక్తితో పాటిస్తే మోక్షాన్ని ప్రసాదిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఒక సంవత్సరంలో జరుపుకునే 24 ఏకాదశులలో నిర్జల ఏకాదశి ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంటుందని జ్యోతిశాస్త్ర పండితులు చెబుతున్నారు. ఎందుకంటే..ఏడాదిలో వచ్చే అన్ని ఏకాదశుల ఫలితం ఈ ఒక్క నిర్జల ఏకాదశిని ఆచరించటం వల్ల పొందగలరని నిపుణులు చెబుతున్నారు. గతంలో చేసిన పాపాలన్నింటికీ క్షమాపణ దొరుకుతుందని అంటారు. మీరు చేసిన ఎలాంటి ఘోరమైన సరే.. నిర్జల ఏకాదశి నియమాన్ని భక్తితో పాటిస్తే మోక్షాన్ని ప్రసాదిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
నిర్జల ఏకాదశి వ్రతాన్ని కూడా ఎంతో నిష్టతో ఉండి చేయాలని చెబుతున్నారు. ఇందులో కనీసం మంచి నీరు కూడా తాగకుండా ఉపవాసం చేయాలంటున్నారు.. ఏకాదశి నాడు సూర్యోదయం నుండి ద్వాదశి మరుసటి రోజు సూర్యోదయం వరకు ఏది తినకూడదు.. త్రాగకూడని ఉపవాసం. ఇది అన్ని ఉపవాసాలలోకీ పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఉపవాసం ఉండి విష్ణు మూర్తి పూజించటం, వీలైనంత మేరకు దానం చేయటం చేయాలని చెబుతున్నారు. ఈ రోజున దానం చేయగల కొన్నింటి గురించి ఇక్కడ తెలుసుకుందాం…
నీళ్లు దానం చేయాలి: నిర్జల ఏకాదశి రోజున నీటిని దానం చేస్తే డబ్బుకు సంబంధించిన, వివాహానికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు.
ధాన్యం దానం చేయటం: ఈ రోజున బియ్యం, గోధుమలు, పండ్లు నుండి కూరగాయలు వరకు, పేదలకు సహాయం చేయడం వలన ఆ శ్రీ మహా విష్ణువు ఆశీర్వాదం పొందుతారని అంటున్నారు.
ధనం దానం చేయటం: దేవాలయాలు, ట్రస్టులు, ధార్మిక సంస్థలు, అవసరంలో ఉన్నవారికి డబ్బును కూడా విరాళంగా ఇవ్వవచ్చు. ఇది గొప్ప, శుభప్రదమైన కార్యంగా పరిగణించబడుతుంది.
ఆవులను దానం చేయండి: గోశాలలకు ఆవులను లేదా డబ్బును కూడా ఇవ్వవచ్చు. ఇది జీవితంలో సానుకూల విషయాలను ఆకర్షించడంలో సహాయపడుతుంది.
పసుపు రంగు బట్టలు దానం చేయండి: నిర్జల ఏకాదశి రోజున, పేదలకు పసుపు రంగు దుస్తులను కూడా దానం చేయవచ్చు. పసుపు విష్ణువుకు ఇష్టమైన రంగులలో ఒకటి. ఈ రంగులో ఉన్న దుస్తులను దానం చేయడం వలన స్వామిని సంతోషపెట్టే అవకాశం ఉందని జ్యోతిశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








