Yadagirigutta: యాదగిరిగుట్ట కిక్కిరిసింది..రికార్డు స్థాయిలో స్వామివారిని దర్శించుకున్న భక్తులు..
ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకున్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రానికి రోజు రోజుకు భక్తుల తాకిడి ఎక్కువవుతోంది. వేసవి సెలవులు ముగుస్తుండటంతో తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా ఆలయానికి తరలిచ్చారు. యాదగిరిగుట్ట ఆలయ చరిత్రలోనే తొలిసారిగా శ్రీ లక్ష్మీనర్సింహస్వామి వారిని రికార్డు స్థాయిలో భక్తులు దర్శించుకున్నారు.

రాష్ట్రంలో తెలంగాణ తిరుపతిగా పేరొందిన యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి ప్రజల ఇలవేల్పుగా వెలుగోందుతున్నాడు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్న శ్రీ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఇటీవల కాలంలో భక్తుల తాకిడి ఎక్కువైంది. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని సాధారణ రోజుల్లో 30 వేలకు పైగా శని, ఆదివారం, సెలవు దినాల్లో 50 వేల మంది భక్తులు దర్శించుకుంటున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు యాదగిరిగుట్టకు వస్తున్నారు.
వేసవి సెలవులు ముగుస్తుండటంతో తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా ఆలయానికి తరలిచ్చారు. ఆదివారం ఒక్కరోజే 90 వేలకు పైగా మంది భక్తులు పాంచ నరసింహుడిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం కోసం తెల్లవారుజాము నుండే భక్తులు తరలివచ్చారు. భక్తుల రద్దీతో ఆలయ పరిసరాలు, క్యూలు, ప్రసాద విక్రయశాల, బస్టాండ్, కల్యాణకట్ట, సత్యనారాయణస్వామి వ్రత మండపం, మెట్ల దారి కిక్కిరిసిపోయింది. లక్ష్మీనరసింహుడి దర్శనానికి 4 గంటలకుపైగా సమయం పట్టింది. ఆదివారం రాత్రి ఆలయాన్ని మూసేసే వరకు దర్శనం కోసం క్యూలో భక్తులు నిల్చున్నారు.
కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం విరాజిల్లుతున్న యాదాద్రి లక్ష్మినరసింహ స్వామిని దర్శించుకొని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు లడ్డు, పులిహోరలను మహా ప్రసాదంగా భావిస్తుంటారు. ఈ ప్రసాదాలను ఇంటికి తీసుకువెళ్లి కుటుంబ సభ్యులకు పంపిణీ చేస్తుంటారు. ఆదివారం 90వేలకు పైగా మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని, వివిధ పూజలతో ఆలయానికి నిత్యాదాయం రూ.79.51 లక్షలు వచ్చినట్లు ఆలయ ఈఓ వెంకట్రావ్ తెలిపారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




