30 రోజులపాటు రోజుకో అరటి పండు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
అరటిపండును పోషకాల పవర్ హౌస్‌గా కూడా పిలుస్తారు. పేదల యాపిల్‌గా పిలిచే ఈ అరటి పండులో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. కాలంతో సంబంధం లేదు.. సీజన్ ఏదైనా సరే.. అందరికీ అందుబాటులో ధరలో లభిస్తుంది. కనుకనే అరటిపండు పేదల యాపిల్‌గా పిలుస్తారు. అరటి పండ్లలోనూ అనేక రకాలు ఉంటాయి. కాలం ఏదైనా, అరటి పండు ఏ రకమైనా సరే.. రోజుకు ఒకటి చొప్పున 30 రోజుల పాటు అరటి పండ్లను తింటే అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం...

Banana
- బంగాళదుంప, అరటి పండును కలిపి తినకూడదని నిపుణులు చెబుతున్నారు. బంగాళదుంపలో పిండిపదార్థం ఎక్కువగా ఉంటుంది. రెండింటినీ కలిపి తినడం వల్ల జీర్ణ సమస్యలు, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు ఏర్పడవచ్చు. అందుకే ఈ రెండిండి కాంబినేషన్‌కు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
- అంతేకాదు.. రాత్రిపూట కూడా అరటి పండును అస్సలు తినకూడదని నిపుణులు చెబుతుంటారు. బనానా తిన్న తర్వాత వేయించిన పదార్థాలు తినకూడదు. కారంతో చేసిన పదార్థాలకు వీలైనంత దూరంగా ఉండాలి. కాఫీలు, టీలు బనానా తిన్నాక తాగడం మానేయాలి. దీని వల్ల జీర్ణసమస్యలు , అలెర్జీలు, ముఖంపై మచ్చలు వస్తాయి.
- Banana
- అలాగే అరటిపండు లో ఉండే పొటాషియం గుండెను శక్తివంతంగా ఆరోగ్యవంతంగా చేసేందుకు క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. ప్రతిరోజు ఒక అరటిపండు తినడం వల్ల కండరాల పనితీరు కూడా మెరుగుపడుతుంది. వ్యాయామాలు చేసేవారు తప్పకుండా తినాల్సి ఉంటుంది.
- Banana 5









