- Telugu News Photo Gallery Cinema photos Sreeleela Shares Her Pre Birthday Photos Amid Engagment Rumours
Sreeleela: నిశ్చితార్థం అంటూ వార్తలు.. అసలు విషయం చెప్పిన హీరోయిన్ శ్రీలీల..
టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీలీల ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. తెలుగుతోపాటు హిందీలోనూ బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటిస్తుంది. కానీ గత రెండు రోజులుగా ఇన్ స్టాలో క్రేజీ ఫోటోస్ షేర్ చేస్తూ అభిమానులకు షాకిస్తుంది. దీంతో శ్రీలీల నిశ్చితార్థం అంటూ వార్తలు తెరపైకి వచ్చాయి.
Updated on: Jun 01, 2025 | 12:55 PM

హీరోయిన్ శ్రీలీల.. తెలుగు సినీప్రియులకు ఇష్టమైన హీరోయిన్. తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా వరుస ఫోటోస్ షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు షాకిస్తుంది.

శుక్రవారం ఆమె షేర్ చేసిన కొన్ని ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఆమెకు నిశ్చితార్థం జరిగిందని.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందంటూ నెట్టింట ప్రచారం జరిగింది. తాజాగా ఆ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చింది.

ఇప్పుడు మరికొన్ని ఫోటోస్ షేర్ చేస్తూ తమ ఇంట్లో జరిగిన ఓ వేడుక గురించి శ్రీలీల వివరించింది. తన ప్రీ బర్త్ డే వేడుకలను ఇంట్లోనే ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నామని తెలిపింది. ఇందుకు సంబంధించిన ప్లానింగ్ తన తల్లి చూసుకున్నారని తెలిపింది.

ఈ వేడుకలలో రానా సతీమణి మిహిక సైతం పాల్గొన్నారు. ఇందులో శ్రీలీల చీరకట్టులో, బుగ్గన చుక్కతో కనిపించారు. దీంతో శ్రీలీల, పెళ్లి, నిశ్చితార్థం అంటూ వచ్చిన వార్తలకు ఫుల్ స్టాప్ పడింది.

ప్రస్తుతం హిందీ, తెలుగులో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది శ్రీలీల. ఆమె పుట్టినరోజు జూన్ 14. ఈ సందర్భంగా ఆమె అప్ కమింగ్ మూవీస్ అప్డేట్స్ కూడా రివీల్ చేయనున్నట్లు తెలుస్తోంది.




