AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Navaratri 2022: బెంగాలీ సమితి ఆధ్వర్యంలో ఘనంగా దుర్గాదేవి ఉత్సవాలు.. నేడు నిమజ్జన కార్యక్రమం

మంగళవారం మహా నవమి సందర్భంగా దుర్గాదేవిని మహిషాసురమర్దినిగా ఆరాధిస్తూ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహా నవమి రోజున దుర్గ మహిషాసురుడు అనే రాక్షసుడిని వధించిందని ప్రతీతి

Navaratri 2022: బెంగాలీ సమితి ఆధ్వర్యంలో ఘనంగా దుర్గాదేవి ఉత్సవాలు.. నేడు నిమజ్జన కార్యక్రమం
Hyderabad Bangalee Samity
Surya Kala
|

Updated on: Oct 05, 2022 | 7:40 AM

Share

హైదరాబాద్ బెంగాలీ సమితి, హైదరాబాద్ కాళీ బరి సంస్థల ఆధ్వర్యంలో దుర్గ దేవి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నేడు విజయదశమి సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో బారులు తీరారు. దుర్గ దేవిని అత్యంత భక్తి శ్రద్దలతో పూజిస్తున్నారు. మండపంలో కొలువుదీరి నవరాత్రుల్లో తొమ్మిది అలంకారాల్లో పూజలను అందుకున్న అమ్మవారిని నేడు నిమజ్జనం చేయనున్నారు.

మంగళవారం మహా నవమి సందర్భంగా దుర్గాదేవిని మహిషాసురమర్దినిగా ఆరాధిస్తూ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహా నవమి రోజున దుర్గ మహిషాసురుడు అనే రాక్షసుడిని వధించిందని ప్రతీతి. సాయంత్రం సంధ్య హారతి ను దర్శించుకునేందుకు భక్తులు వేలాది సంఖ్యలో పాల్గొన్నారు. సంధ్య హారతికి చివరి రోజు కావడంతో భక్తులతో ప్రాంగణం నిండిపోయింది. బెంగాల్ సమితి ఏర్పాటు చేసిన దుర్గ దేవి ఉత్సవాలకు vip ల తాకిడి ఎక్కువయింది. అమ్మ వారిని దర్శించుకున్న it శాఖ సెక్రటరీ జయేష్ రంజన్ ఏర్పాట్లు పట్ల సంతోషం వ్యక్తం చేసారు.

దుర్గ దేవి ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పూజ కార్యక్రమాల అనంతరం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. నేడు విజయ దశమి పండగ .. దీంతో దుర్గ దేవి నిమజ్జన కార్యక్రమం నిర్వహించనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..