AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Navaratri 2025: నవరాత్రుల్లో అమ్మవారికి ఈ పువ్వు సమర్పించండి.. దుర్గమ్మ ఆశీస్సులతో ఇంట్లో లక్ష్మి తిష్టవేసుకుంటుంది..

నేటి నుంచి శరన్నవరాత్రులు ప్రారంభంఅయ్యాయి. భక్తులు దుర్గాదేవిని రోజుకి ఒక్క రూపంలో పూజిస్తారు. అమ్మవారికి ఇష్టమైన రంగుల దుస్తులను, పువ్వులను, నైవేద్యాన్ని సమర్పిస్తారు. అయితే దుర్గాదేవిని నవ దుర్గలుగా రోజుకి ఒకొక్క రూపంలో ఒకొక్క ప్రత్యేక పద్దతిలో పూజించినా.. ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి పూజలో ఈ పువ్వుని తప్పనిసరిగా చేర్చుకోవడం.. ఈ పువ్వుతో పూజ చేయడం అత్యంత ఫలవంతం. అదే పారిజాతం పువ్వు. ఇది దుర్గాదేవి అనుగ్రహాన్ని, శక్తిని ఇచ్చే పువ్వుగా పరిగణింప బడుతుంది. ఈ పువ్వుతో పూజ వెనుక ఉన్న రహస్యం గురించి తెలుసుకోండి.

Navaratri 2025: నవరాత్రుల్లో అమ్మవారికి ఈ పువ్వు సమర్పించండి.. దుర్గమ్మ ఆశీస్సులతో ఇంట్లో లక్ష్మి తిష్టవేసుకుంటుంది..
Navratri 2025
Surya Kala
|

Updated on: Sep 22, 2025 | 7:16 AM

Share

శారదీయ నవరాత్రిలోని ఒకొక్క రోజు దుర్గాదేవి విభిన్న రూపానికి అంకితం చేయబడింది. ప్రతి రూపం పూజకు దాని సొంత నిర్దిష్ట పదార్థాలు, పువ్వులు ఉంటాయి. పురాణ గ్రంథాల ప్రకారం కొన్ని పువ్వులు దేవతకు చాలా ప్రియమైనవి. వీటిలో పారిజాత పువ్వు అత్యంత పవిత్రమైనది. అరుదైనదిగా పరిగణించబడుతుంది. ఈ పువ్వుతో అమ్మవారికి పూజ చేయడం వలన ఇంటికి ఆనందం, శ్రేయస్సు , అదృష్టాన్ని తెస్తుందని.. దీనిని అమ్మవారికి సమర్పించడం వలన దేవత ఆశీర్వాదాలు సులభంగా లభిస్తాయని నమ్ముతారు.

అమ్మవారి ఆశీర్వాదాన్ని ఇచ్చే పారిజాతం పువ్వు

హిందువులు పూజ చేసే సమయంలో పువ్వులకు విశేషమైన ప్రాముఖ్యత ఉంది. సరైన పువ్వులను సమర్పించడం దేవతను ప్రసన్నం చేసుకోవడానికి సులభమైన మార్గం అని ప్రతి భక్తుడి నమ్మకం. అయితే కొన్ని పువ్వులు వాటి అందానికి మాత్రమే కాదు.. ఆధ్యాత్మిక శక్తి, ఆశీర్వాదాలకు కూడా ప్రసిద్ధి చెందాయి.

దుర్గాదేవి రాకకు చిహ్నం పారిజాతం

నవరాత్రులలో పారిజాత పుష్పాన్ని దుర్గాదేవి రాకకు చిహ్నంగా భావిస్తారు. ఈ పుష్పాన్ని ప్రత్యేకంగా పూజ మండపాలు, దేవాలయాలలో అలంకరణ, నైవేద్యం కోసం ఉంచుతారు. ఈ తాజా, సువాసనగల పుష్పాన్ని సమర్పిస్తే దేవత ఆశీస్సులు వెంటనే లభిస్తాయని చెబుతారు. పారిజాతం పువ్వు అదృష్టం, శాంతిని తెచ్చేదిగా భావిస్తారు.

ఇవి కూడా చదవండి

పురాణ గ్రంథాలలో ప్రాముఖ్యత

పవిత్ర గ్రంథాలలో పారిజాతం దేవతకు ఇష్టమైన పుష్పాలలో ఒకటిగా ప్రస్తావించబడింది. ఇది కేవలం అలంకరణ మాత్రమే కాదు, భక్తి, విశ్వాసం, శక్తికి చిహ్నం. పురాణాలు దీనిని దేవత రాక, ఆశీర్వాదాలకు చిహ్నంగా వర్ణించాయి. ఈ పువ్వు భక్తుల మనస్సులను శుద్ధి చేస్తుంది. ఇంట్లో సానుకూల శక్తిని వ్యాపింపజేస్తుంది.

ఇంట్లో పారిజాతం పువ్వుతో ఎలా పూజ చేయాలంటే

పూజ సమయంలో పారిజాత పువ్వును శుభ్రంగా, తాజాగా ఉంచండి. దీనిని పూజ చేసే ప్రాంతం.. ప్రధాన గది లేదా వార్డ్‌రోబ్‌లో ఉంచవచ్చు. ఇది ఇంటి అందాన్ని పెంచడమే కాదు దేవత ఆశీర్వాదం, సానుకూల శక్తి ప్రవాహాన్ని కూడా నింపుతుంది.

ఈ పువ్వు ఎందుకు అంత ప్రియమైనది?

పారిజాతం సువాసన, దైవిక స్వభావం భక్తులకు దీనిని ప్రత్యేకంగా చేస్తాయి. హిందూ సంప్రదాయంలో పారిజాతం పువ్వుని దుర్గాదేవి రాకకు చిహ్నంగా భావిస్తారు. ఈ పువ్వుతో పూజ చేయడం వలన ఆధ్యాత్మికంగా అనుసంధానించబడినట్లు భావిస్తారు. ఈ పువ్వు ఇంట్లో అదృష్టం, శాంతి, బలానికి చిహ్నంగా మారుతుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు