AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Navaratri 2025: నవరాత్రికి ఉపవాసం ఉంటున్నారా..! పాటించాల్సిన నియమాలు ఇవే..

హిందూ మతంలో శారదీయ నవరాత్రికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ సంవత్సరం ఈ నవరాత్రి సెప్టెంబర్ 22న ప్రారంభమై అక్టోబర్ 2న ముగుస్తుంది. ఈ తొమ్మిది రోజులలో దుర్గాదేవి తొమ్మిది రూపాలను పూజిస్తారు. అమ్మవారి అనుగ్రహం కోసం భక్తులు ఉపవాసం ఉంటారు. ఉపవాసం చేసిన పూర్తి ప్రయోజనాలను పొందడానికి, కొన్ని నియమాలను పాటించడం చాలా అవసరం.. లేకుంటే ఉపవాసం అసంపూర్ణంగా మారవచ్చు. ఈ రోజు ఉపవాస నియమాలను తెలుసుకుందాం

Navaratri 2025: నవరాత్రికి ఉపవాసం ఉంటున్నారా..! పాటించాల్సిన నియమాలు ఇవే..
Navaratri 2025
Surya Kala
|

Updated on: Sep 21, 2025 | 9:39 AM

Share

హిందూ మతంలో శారదీయ నవరాత్రులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ తొమ్మిది రోజులలో దుర్గాదేవి తొమ్మిది రకాల రూపాలను పూజిస్తారు. ఈ సమయంలో భక్తులు దుర్గాదేవిని ఆచారాలతో పూజించి ఉపవాసం ఉంటారు. నిర్మలమైన హృదయంతో ఇలా చేయడం ద్వారా దుర్గాదేవి భక్తుల కోరికలన్నింటినీ తీరుస్తుంది. ఈ సంవత్సరం, శారదీయ నవరాత్రి సెప్టెంబర్ 22వ తేదీ సోమవారం ప్రారంభమై అక్టోబర్ 2వ తేదీ దశమి తిథితో ముగుస్తుంది. ఉపవాసం పూర్తి ప్రయోజనాలను పొందాలంటే.. ఉపవాసం ఉండే భక్తుడు ముఖ్యమైన నియమాలను ప్రత్యేకంగా పాటించాలి. తెలిసి లేదా తెలియకుండా చేసే తప్పుల వల్ల ఉపవాసం అసంపూర్ణంగా మారవచ్చు. కనుక నవరాత్రి ఉపవాస సమయంలో ఏమి చేయాలి? చేయకూడదు తెలుసుకుందాం..

నవరాత్రి ఉపవాస సమయంలో ఏమి చేయకూడదంటే

  1. నవరాత్రి ఉపవాస సమయంలో కోపం, ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి. ఈ సమయంలో ఇతరుల గురించి చెడుగా మాట్లాడటం, అబద్ధం చెప్పడం కూడా చేయవద్దు.
  2. నవరాత్రి సమయంలో ఉపవాసం పాటించేవారు మంచం మీద నిద్రపోకూడదు. అంతేకాదు మృదువైన పరుపులను వాడకూడదు.
  3. సాధారణంగా భక్తులు రోజుకు ఒక పూట మాత్రమే భోజనం చేస్తూ నవరాత్రి ఉపవాసం పాటిస్తారు. ఇలా ఉపవాసం చేసేవారు మధ్యలో పండ్లు తినొద్దు. అయితే, శారీరక సమస్యలు ఉన్నవారికి ఈ నియమం వర్తించదు.
  4. నవరాత్రి మధ్యలో ఏదైనా ముఖ్యమైన ప్రయాణం చేయవలసి వస్తే.. ఉపవాసం ఉండవద్దు. ఎందుకంటే ఈ సమయంలో ఉపవాస నియమాలను పాటించడం కష్టం కావచ్చు.
  5. ఇవి కూడా చదవండి
  6. తీవ్రమైన శరీర సంబంధిత సమస్యలు ఉన్నవారు.. ఉపవాసం మధ్యలో ఆగిపోవచ్చు అని భావించేవారు నవరాత్రి ఉపవాసం పాటించవద్దు
  7. నవరాత్రి ఉపవాస సమయంలో ఇంట్లో తామసిక ఆహారాలు తయారు చేయవద్దు. కుటుంబ సభ్యులు కూడా ఈ నియమాన్ని ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి.
  8. ఉపవాసం చేసేవారు తమ ఆహారంలో సాధారణ ఉప్పును వాడకూడదు. దీనివల్ల ఉపవాసం విచ్ఛిన్నమవుతుంది. రాతి ఉప్పును ఉపవాస సమయంలో మాత్రమే ఉపయోగిస్తారు.

నవరాత్రి ఉపవాస సమయంలో ఏమి చేయాలి:

  1. నవరాత్రి సమయంలో ఉపవాసం ఉండే వ్యక్తి ఎల్లప్పుడూ సత్యాన్నే మాట్లాడాలి. తన మనస్సును అదుపులో ఉంచుకుని తన ఇష్టదేవతను ధ్యానించాలి.
  2. నవరాత్రి ఉపవాస సమయంలో బ్రహ్మచర్యం పాటించాలి. ఈ సమయంలో క్షమ, దయ, దాతృత్వం, ఉత్సాహాన్ని పెంపొందించుకోవాలి. ఇంకా తామసిక భావోద్వేగాలకు దూరంగా ఉండాలి.
  3. ఏడవ, ఎనిమిదవ లేదా తొమ్మిదవ రోజున ఉపవాసం విరమిస్తే..తొమ్మిది మంది కన్య బాలికలను పిలిచి ఆహారాన్ని పెట్టాలి. ఈ రోజున అమ్మవారి పేరుతో హవనం, పూజ నిర్వహించాలి.
  4. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం అమ్మవారిని ఆచారాలతో పూజించి, దీపం వెలిగించాలి. ఆ తర్వాతే ఏదైనా తినాలి.
  5. నవరాత్రి తొమ్మిది రోజులలో దుర్గాదేవి తొమ్మిది రూపాలకు పూజ చేసి హారతి ఇవ్వాలి. శాస్త్రాల ప్రకారం నవరాత్రి సమయంలో రకాల ఉపవాసాలు ఉంటాయి. ఈ సమయంలో చాలా మంది ఒక పూట మాత్రమే భోజనం తింటారు. కొందరు పండ్లు మాత్రమే తింటారు. కొందరు నీరు తీసుకుంటారు. మరికొందరు తులసి దళం వేసిన గంగా జలం తాగుతారు. రోజుకు ఒక పూట భోజనం చేసేవారు రాతి ఉప్పును ఉపయోగించాలి.
  6. నవరాత్రి సమయంలో దుర్గా సప్తశతి పారాయణం చేయాలి. ప్రతిరోజూ ఒక అధ్యాయాన్ని పారాయణం చేయవచ్చు. అంతేకాదు పూజ సమయంలో దుర్గాదేవికి ప్రతిరోజూ అమ్మవారికి ఇష్టమైన ఆహరాన్ని నైవేధ్యంగా సమర్పించాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..