Dussehra: దసరా నవ రాత్రుల్లో మొదటి సారి ఉపవాస దీక్షను చేపడుతున్నారా.. పూజ, ముఖ్యమైన నియమాలు మీకోసం ,
దుర్గా దేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ 09 రోజుల్లో ప్రతి రోజుని అమ్మవారి భక్తులు పూర్తి ఆచారాలతో నియమ నిష్టలతో పూజిస్తారు. ఉపవాస దీక్షను పాటిస్తారు. మీరు కూడా ఈ సంవత్సరం నవరాత్రి వ్రతం పాటించాలని ఆలోచిస్తున్నట్లయితే.. ప్రయోజనకరమైన ఫలితాలను పొందడానికి నవరాత్రి పూజకు సంబంధించిన అన్ని ముఖ్యమైన నియమాలను తప్పక తెలుసుకోవాలి. ఈ రోజు నవరాత్రి వ్రతానికి సంబంధించిన 09 ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం.
సనాతన హిందూ సంప్రదాయంలో శక్తి సాధన అన్ని దుఃఖాలను తొలగించి, కోరికలను నెరవేర్చడానికి ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. హిందూ విశ్వాసం ప్రకారం ఈ సంవత్సరం అక్టోబర్ 15 నుండి 24 వరకు శక్తిని పూజిస్తారు. నవరాత్రులుగా 09 రోజులు పాటు సాగే ఈ ఉత్సవాలను చాలా పవిత్రమైనవిగా భావిస్తారు. దుర్గా దేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ 09 రోజుల్లో ప్రతి రోజుని అమ్మవారి భక్తులు పూర్తి ఆచారాలతో నియమ నిష్టలతో పూజిస్తారు. ఉపవాస దీక్షను పాటిస్తారు. మీరు కూడా ఈ సంవత్సరం నవరాత్రి వ్రతం పాటించాలని ఆలోచిస్తున్నట్లయితే.. ప్రయోజనకరమైన ఫలితాలను పొందడానికి నవరాత్రి పూజకు సంబంధించిన అన్ని ముఖ్యమైన నియమాలను తప్పక తెలుసుకోవాలి. ఈ రోజు నవరాత్రి వ్రతానికి సంబంధించిన 09 ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం.
- మీరు నవరాత్రులలో 9 రోజులు ఉపవాసం ఉండాలనుకుంటే, ముందుగా శరీరం, మనస్సుని స్వచ్ఛంగా ఉంచుకోండి. ప్రతిపాద తిథి శుభ సమయంలో ఉపవాస దీక్షను చేపట్టండి.
- మీరు 9 రోజులు రోజంతా ఉపవాసం ఉండలేకపోతే.. మీ సౌలభ్యం ప్రకారం.. మీరు నవరాత్రుల మొదటి రోజు అదే విధంగా చివరి రోజున ఉపవాసం ఉండి అమ్మవారిని పూజించవచ్చు
- శక్తి ఆరాధన, ఉపవాసం దీక్ష చేపట్టిన అనంతరం నవరాత్రి మొదటి రోజున ఒక శుభ సమయంలో సాధకుని మార్గదర్శకత్వంలో కలశాన్ని స్థాపించి, పవిత్రమైన నేలలో విత్తనాలను నాటండి.
- నవరాత్రులలో ఉపవాసం ఉండే భక్తులు తమ ఇంటికి ఈశాన్యం, తూర్పు లేదా ఉత్తరం వైపున కూర్చుని అమ్మవారిని పూజించాలి. అమ్మవారిని పూజించేటప్పుడు, మీ ముఖం ఎల్లప్పుడూ తూర్పు వైపు ఉండాలి.
- నవరాత్రులలో దుర్గా దేవిని ఎల్లప్పుడూ ఆసనంపై కూర్చొని పూజించాలి. శక్తి సాధన కోసం ఎరుపు రంగు ఉన్ని పీఠం శుభప్రదంగా పరిగణించబడుతుంది. దుర్గాదేవిని పొరపాటున కూడా నేలపై ఏర్పాటు చేసి పూజించకండి.
- నవరాత్రులలో ఉపవాసం దీక్షను చేపట్టిన భక్తుడు నవరాత్రుల్లో చివరి రోజున దుర్గాదేవి స్వరూపంగా భావించే అమ్మాయిని పూజించాలి. నవరాత్రి ఉత్సవాలలో శక్తి సాధనలో 2 సంవత్సరాల నుండి 09 సంవత్సరాల మధ్య బాలికలను పూజించడం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది.
- నవరాత్రులలో ఉపవాసం ఉండే వారు తామసమైన ఆహారాన్ని తినకూడదు. అదేవిధంగా దేవి సాధన కోసం చేపట్టిన ఉపవాస సమయంలో సంపూర్ణ బ్రహ్మచర్యాన్ని అనుసరించాలి.
- నవరాత్రులలో అమ్మవారిని పూజించే భక్తులు వ్రత సమయంలో పొరపాటున కూడా ఎవరినీ విమర్శించకూడదు. ఎవరిని అవమానించకూడదు. ఒకరిని ఇబ్బంది పడే విధంగా కబుర్లు చెప్పకూడదు,
- నవరాత్రులలో 09 రోజులు దుర్గాదేవి ఉపవాసం ఉండబోతున్నట్లయితే.. ఈ 09 రోజులలో మీ జుట్టు, గోళ్ళను కత్తిరించవద్దు. నవరాత్రి ఉపవాసం పాటించే భక్తుడు తన శక్తి మేరకు ఉపవాసం పాటించాలి. ఉపవాస సమయంలో ఆహారానికి బదులుగా పండ్లు తీసుకోవాలి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.