మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా..? లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఇలా చేయండి.. లేకపోతే..
దాదాపు చాలా మంది ఇళ్లల్లో మనీ ప్లాంట్ ఉంటుంది. అయితే.. మనీ ప్లాంట్‌ను ఇంట్లో పెంచుకున్నా ఆశించిన ఫలితాలు రావడం లేదని చెబుతుంటారు. ఆధ్యాత్మిక పద్ధతులను అనుసరించి మనీ ప్లాంట్‌ను సరైన రీతిలో నాటి, సంరక్షించుకుంటే ఆర్థిక శ్రేయస్సు సాధ్యమవుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.

ఇళ్లల్లో చాలా మంది రకరకాల మొక్కలను పెంచుకుంటారు. పూల మొక్కలు, తులసి మొక్క అలాగే ఆకర్షణీయమైన మనీ ప్లాంట్ లాంటివి పెంచుకుంటారు. ఇవి మంచి గాలిని అందించడంతోపాటు.. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నెలకొల్పుతాయి.. అయితే.. ఇంటికి అదృష్టంగా భావించే మొక్కలలో మనీ ప్లాంట్ ఒకటి.. ఇది సంపదను శ్రేయస్సు అందిస్తుందని విశ్వసిస్తారు. మనీ ప్లాంట్‌ను ఇంట్లో పెంచుకోవడం వల్ల ఆర్థిక శ్రేయస్సు చేకూరుతుందని తరచుగా వినిపిస్తుంది. మనీ ప్లాంట్ ఇంట్లో ఉంటే ప్రతికూల శక్తి తగ్గి సానుకూల శక్తి వస్తుందని.. దీనివల్ల మానసిక ప్రశాంతత కలుగుతుందని.. ఆర్థిక ఇబ్బందులను దూరం చేస్తుందని వాస్తు నిపుణులు చెబుతుంటారు.. అయితే, చాలామంది తమ మనీ ప్లాంట్‌కు సరైన సంరక్షణ అందిస్తున్నప్పటికీ, ఆశించిన ఫలితాలు లభించడం లేదని పేర్కొంటుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో వాస్తు – ఆధ్యాత్మిక నియమాలను పాటించి మనీ ప్లాంట్‌ను మొక్కను తీసుకువచ్చి.. సరైన పద్ధతిలో నాటి, సంరక్షించడం ద్వారా 100% సానుకూల ఫలితాలను పొందవచ్చని సూచిస్తున్నారు పండితులు..
వాస్తు ప్రకారం, మనీ ప్లాంట్ ను తూర్పు, ఉత్తరం, దక్షిణ దిక్కులలో పెంచుకోవచ్చు. ఇంటికి ఆగ్నేయ దిక్కులో ఈ మొక్కను పెంచుకోవడం ద్వారా అత్యంత శుభం.. అయితే.. మనీ ప్లాంట్ మొక్కను ఉంచే దిశ ఇంటి ప్రధాన ద్వారం ఆధారంగా మారుతుంది. మీ ఇంటి మెయిన్ గేట్ తూర్పు లేదా దక్షిణం వైపు ఉంటే, మనీ ప్లాంట్‌ను ఆగ్నేయ (ఆగ్నేయం) దిశలో ఉంచాలి. ఈ దిశలో పెట్టే కుండీ ఆకుపచ్చ లేదా నారింజ రంగులో ఉండాలి. ఒకవేళ ఆ రంగు కుండీ దొరకకపోతే, ఇంకో రంగు కుండీని తీసుకొచ్చి ఒక రోజు ముందు ఆ రంగులు వేసుకోవచ్చు. మీ ఇంటి ప్రధాన ద్వారం పడమర లేదా ఉత్తరం వైపు ఉంటే, వాయువ్య (వాయువ్యం) మూలలో క్రీమ్ లేదా తెలుపు రంగు కుండీలో మొక్కను నాటాలి.
మొక్కకు క్రమం తప్పకుండా సంరక్షణ అందించడం ముఖ్యం. ప్రతి బుధవారం, శుక్రవారం సాయంత్రం, మొక్కకు కొన్ని పచ్చి పాలు సమర్పించండి. అలాగే, అక్కడ నెయ్యితో దీపాన్ని వెలిగించండి. మీకు వీలు చిక్కినప్పుడల్లా ఈ రెండు రోజుల్లో మొక్కకు సేవ చేయండి. మొక్కలోని ఎండిన భాగాలను ఎప్పటికప్పుడు కత్తిరించి, దాని మొదలును శుభ్రంగా ఉంచాలి. ఇది మొక్క ఆరోగ్యానికి, సానుకూల శక్తి ప్రవాహానికి దోహదపడుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే, ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అభ్యాసం సూచిస్తున్నారు. శుక్రవారం నాడు, ఒక తామర గింజల మాలతో మహాలక్ష్మి మంత్రాన్ని జపించి.. అక్కడ ఉంచాలి.. ఈ విధంగా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చని.. ఆర్థిక సమస్యలు తొలగిపోయి, శ్రేయస్సు చేకూరుతుందని వాస్తు నిపుణులు పండితులు చెబుతున్నారు.
ముఖ్య గమనిక : ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.
