పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో స్నేహలత, దుర్గాప్రసాద్ దంపతులు అధిక వడ్డీ, తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తామని నమ్మబలికి 25 మంది బాధితుల నుంచి సుమారు రూ. 25 కోట్లు వసూలు చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. మోసపోయిన బాధితులు న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించారు. ఈ భారీ మోసంపై పోలీసులు విచారణ చేపట్టారు.