OTT Movie: బూతు పాటతో కాంట్రవర్సీ.. మూడు నెలల తర్వాత సైలెంట్‌గా ఓటీటీకి వచ్చేసిన తెలుగు సినిమా
ఇటీవల కాలంలో ఒక సినిమా థియేటరో విడుదలైన 28 రోజులలోనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. మరికొన్ని సినిమాలైతే కేవలం 3 వారాలకే డిజిటల్ స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. అయితే పాటతోనే సంచలనం రేకెత్తించిన ఈ సినిమా ఏకంగా 3 నెలల తర్వాత ఓటీటీకి వచ్చేసింది.

సుమారు మూడు నెలల క్రితం.. ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ పెద్ద దుమారమే రేపింది. ఆ కార్యక్రమంలో అందరూ చూస్తుండగానే స్టేజ్ ఎక్కిన ఓ యంగ్ హీరో బూతు పాటను అందుకున్నాడు. అందరూ చూస్తున్నారన్న సోయి లేకుండా గుంజి గుంజి అంటూ రచ్చ రచ్చ చేశాడు. దెబ్బకు ఆ పాట సోషల్ మీడియాలో బాగా వైరలైంది. కానీ ఆ స్టేజిపై ఆ పాటను పాడిన హీరోపై మాత్రం చాలా నెగెటివిటీ వచ్చింది. బూతులు ఉన్న అలాంటి పాటను పబ్లిక్ గా పాడటమేంటని ఆ హీరోపై విమర్శల వర్షం కురిపించారు. అలా బూతు పాటతో కాంట్రవర్సీ క్రియేట్ చేసిన సినిమా ఇప్పుడు సడెన్ గా ఓటీటీలోకి వచ్చింది. అది కూడా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే. బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ తనయుడు చంద్రహాస్ అలియాస్ యాటిట్యూడ్ స్టార్ నటించిన రెండో సినిమా బరాబర్ ప్రేమిస్తా. సంపత్ రుద్ర తెరకెక్కించిన రొమాంటిక్ లవ్ స్టోరీలో చంద్రహాస్‌కు జోడీగా మేఘన ముఖర్జీ హీరోయిన్‌గా నటించింది. ఫిబ్రవరి 07న రిలీజైన ఈ సినిమా ఓ మోస్తరుగా ఆడింది. బూతు పాటతో వార్తల్లో నిలిచిన ఈ మూవీకి కాస్త ప్రమోషన్ వచ్చింది కానీ.. తీరా థియేటర్లలో రిలీజయ్యాక పెద్గా ఆడలేదు. దీంతో ఈ మూవీ జస్ట్ యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది.
ఇప్పుడీ బరాబర్ ప్రేమిస్తా సినిమా సుమారు మూడు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. అది కూడా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మే 08 నుంచి బరాబర్ ప్రేమిస్తా సినిమా స్ట్రీమింగ్ కు వచ్చింది. విలేజ్ బ్యాక్‌డ్రాప్ రొమాంటిక్ లవ్ కామెడీ స్టోరీగా తెరకెక్కిన బరాబర్ ప్రేమిస్తా సినిమాలో మురళిధర్ గౌడ్, లక్ష్మణ్ మీసాల, అర్జున్ మహి, అభయ్ నవీన్, సునిత మనోహర్, కీర్తి లత తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. గేద చందు, గాయత్రి చిన్ని, వెంకటేశ్వేరరావు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఆర్ఆర్ ధృవన్ సంగీతం సమకూర్చారు. మరి థియేటర్లలో పెద్దగా ఆడని బరాబర్ ప్రేమిస్తా సినిమా ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో చంద్రహాస్ బరాబర్ ప్రేమిస్తా సినిమా..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




