మాజీ ఐపీఎస్ అధికారి భార్య తనూజ హత్య కేసు దర్యాప్తు వేగవంతమైంది. నిందితుల కోసం ఐదు ప్రత్యేక బృందాలు ముంబై, లక్నో, ఢిల్లీ, నేపాల్ సరిహద్దుకు వెళ్లాయి. పనిమనిషి కల్పనతో పాటు ఇద్దరు యువకులు బంగారం, వెండి, నగదు దోచుకుని, హత్య చేసి నాంపల్లి స్టేషన్లో రైలు ఎక్కి పారిపోయినట్లు అనుమానిస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోంది.