AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పది పాసైతే చాలు.. హైదరాబాద్ సీసీఎంబీలో ఉద్యోగాలు, పూర్తి వివరాలివే..

CCMB Hyderabad Recruitment 2026: సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (CCMB), హైదరాబాద్ టెక్నీషియన్, డ్రైవర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు పదో తరగతి లేదా ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక ప్రక్రియలో ట్రేడ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను నియమించనున్నట్లు సంస్థ వెల్లడించింది.

పది పాసైతే చాలు.. హైదరాబాద్ సీసీఎంబీలో ఉద్యోగాలు, పూర్తి వివరాలివే..
CCMB Hyderabad Recruitment 2026: Job Opportunities for 10th Pass and ITI Candidates, How to Apply
Rajashekher G
|

Updated on: May 09, 2026 | 4:55 PM

Share

సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (CSIR – Centre for Cellular and Molecular Biology), హైదరాబాద్ టెక్నీషియన్, డ్రైవర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 10వ తరగతి లేదా ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక ప్రక్రియలో ట్రేడ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, రాత పరీక్ష నిర్వహించనున్నారు.

పోస్టుల వివరాలు

1. టెక్నీషియన్

ఖాళీలు: 22

అర్హతలు:

  • కనీసం 55% మార్కులతో 10వ తరగతి ఉత్తీర్ణత
  • ల్యాబొరేటరీ అసిస్టెంట్ (కెమికల్ ప్లాంట్), కంప్యూటర్ ఆపరేటర్ & ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ లేదా ఫుడ్ ప్రొడక్షన్ ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్ లేదా
  • 10వ తరగతి + సంబంధిత విభాగంలో 2 సంవత్సరాల అప్రెంటిస్ ట్రైనీ అనుభవం

2. డ్రైవర్

ఖాళీ: 1

అర్హతలు:

  • 10వ తరగతి ఉత్తీర్ణత
  • లైట్ & హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్
  • కనీసం 3 సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం
  • వాహన మెకానిజంపై ప్రాథమిక జ్ఞానం

ఎంపిక విధానం

టెక్నీషియన్ పోస్టులు

ఎంపిక రెండు దశల్లో జరుగుతుంది:

  • స్టేజ్–1: ట్రేడ్ టెస్ట్ (నైపుణ్య పరీక్ష)
  • స్టేజ్–2: రాత పరీక్ష
  • ట్రేడ్ టెస్ట్‌లో అర్హత సాధించిన వారినే రాత పరీక్షకు ఎంపిక చేస్తారు.

రాత పరీక్ష విధానం:

  • పేపర్–1: మెంటల్ ఎబిలిటీ (50 ప్రశ్నలు – 100 మార్కులు, నెగటివ్ మార్కింగ్ లేదు)
  • పేపర్–2: జనరల్ అవేర్‌నెస్ & ఇంగ్లీష్ (50 ప్రశ్నలు – 150 మార్కులు, నెగటివ్ మార్కింగ్ ఉంటుంది)
  • పేపర్–3: సబ్జెక్ట్ సంబంధిత ప్రశ్నలు (50 ప్రశ్నలు – 150 మార్కులు, నెగటివ్ మార్కింగ్ ఉంటుంది)
  • చివరి ఎంపిక పేపర్–2, పేపర్–3లో వచ్చిన మార్కుల ఆధారంగా జరుగుతుంది.

డ్రైవర్ పోస్టు

  • ముందుగా స్కిల్ టెస్ట్ ఉంటుంది. తర్వాత రాత పరీక్ష నిర్వహిస్తారు.
  • రాత పరీక్షలో: జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్‌నెస్
  • ఇంగ్లీష్
  • క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్
  • మొత్తం 100 ప్రశ్నలు – 300 మార్కులు (నెగటివ్ మార్కింగ్ ఉంటుంది)
  • చివరి ఎంపిక రాత పరీక్ష మార్కుల ఆధారంగా జరుగుతుంది.

వయస్సు పరిమితి

  • టెక్నీషియన్: గరిష్టం 28 సంవత్సరాలు
  • డ్రైవర్: గరిష్టం 27 సంవత్సరాలు

వయో సడలింపు:

  • ఎస్సీ/ఎస్టీ: 5 సంవత్సరాలు
  • ఓబీసీ: 3 సంవత్సరాలు
  • దివ్యాంగులు: 10–15 సంవత్సరాలు

దరఖాస్తు ఫీజు

  • జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్: ₹500
  • ఎస్సీ / ఎస్టీ / మహిళలు / దివ్యాంగులు / మాజీ సైనికులు: ఫీజు లేదు

దరఖాస్తు విధానం

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి, ప్రింట్ తీసుకుని అవసరమైన ధ్రువపత్రాలతో ఈ చిరునామాకు పంపాలి:

చిరునామా:

సెక్షన్ ఆఫీసర్, సీఎస్‌ఐఆర్ – సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, ఉప్పల్ రోడ్, హబ్సిగూడ, హైదరాబాద్ – 500007

ముఖ్యమైన తేదీలు

  • ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 26 మే 2026
  • హార్డ్ కాపీ పంపడానికి చివరి తేదీ: 05 జూన్ 2026

అధికారిక వెబ్‌సైట్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

Follow Us
అపర ఏకాదశి మే 12నా 13నా? సరైన తేది తెలుసుకోండి.. ఇలా చేస్తే..
అపర ఏకాదశి మే 12నా 13నా? సరైన తేది తెలుసుకోండి.. ఇలా చేస్తే..
సూర్యకు షాక్.. టీమిండియా టీ20 కొత్త సారథిగా ఎవరంటే?
సూర్యకు షాక్.. టీమిండియా టీ20 కొత్త సారథిగా ఎవరంటే?
టీవీకేకు మద్దతు పలికిన వీసీకే.. విజయ్‌కు లైన్ ‌క్లియర్!
టీవీకేకు మద్దతు పలికిన వీసీకే.. విజయ్‌కు లైన్ ‌క్లియర్!
మీరెలా స్టార్స్ అవుతారు..? డబ్బులిచ్చి కొంటున్నారు..
మీరెలా స్టార్స్ అవుతారు..? డబ్బులిచ్చి కొంటున్నారు..
మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా..? లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే..
మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా..? లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే..
బూతు పాటతో వివాదం.. సైలెంట్‌గా ఓటీటీకి వచ్చేసిన తెలుగు సినిమా
బూతు పాటతో వివాదం.. సైలెంట్‌గా ఓటీటీకి వచ్చేసిన తెలుగు సినిమా
పది పాసైతే చాలు.. హైదరాబాద్ సీసీఎంబీలో ఉద్యోగాలు, పూర్తి వివరాలు
పది పాసైతే చాలు.. హైదరాబాద్ సీసీఎంబీలో ఉద్యోగాలు, పూర్తి వివరాలు
మీ డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా?
మీ డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా?
మనసును కదిలించే జ్ఞాపకం.. విజయ్ వాహనాలకు 0277 నంబర్ ఎందుకంటే..
మనసును కదిలించే జ్ఞాపకం.. విజయ్ వాహనాలకు 0277 నంబర్ ఎందుకంటే..
మీ ముక్క ఆకారమే.. మీ క్యారెక్టర్ ఎలాంటిదో చెప్పేస్తుంది! ఎలా అంటే
మీ ముక్క ఆకారమే.. మీ క్యారెక్టర్ ఎలాంటిదో చెప్పేస్తుంది! ఎలా అంటే