Medaram Jatara 2022: జాతరకు ఏర్పాట్లు పూర్తి.. ఈనెల 18న కుటుంబ సమేతంగా వనదేవతలను దర్శింసుకోనున్న సీఎం కేసిఆర్

Medaram Jatara 2022: తెలంగాణ(Telangana)లోని మేడారం మహా జాతర ప్రాంతాన్ని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli), సత్యవతి రాథోడ్(Satyavathi Rathod), టీఎస్ఆర్టిసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి..

Medaram Jatara 2022: జాతరకు ఏర్పాట్లు పూర్తి.. ఈనెల 18న కుటుంబ సమేతంగా వనదేవతలను దర్శింసుకోనున్న సీఎం కేసిఆర్
Sammakka Saralamma
Follow us
Surya Kala

|

Updated on: Feb 13, 2022 | 6:30 PM

Medaram Jatara 2022: తెలంగాణ(Telangana)లోని మేడారం మహా జాతర ప్రాంతాన్ని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli), సత్యవతి రాథోడ్(Satyavathi Rathod), టీఎస్ఆర్టిసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. మహా జాతరకు ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 18వ తేదీన కుటుంబ సమేతంగా మేడారంకు వస్తారని తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అధికారులు ప్రజాప్రతినిధుల సమన్వయంతో మేడారంలో అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. గత జాతర అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఒక్క చిన్న లోటు కూడ లేకుండా చేయాలని సీఎం ఆదేశించారు. అవసరం అయితే మరిన్ని నిధులు కేటాయించేందుకు కూడ సీఎం సిద్దంగా ఉన్నారని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు.

సమ్మక్క సారలమ్మ జాతరకు చేసిన ఏర్పాట్లతో భక్తులు సంతృప్తిగా ఉన్నారని తెలిపారు. ఎక్కడా పారిశుధ్యం నిర్వహణలో ఇబ్బంది కలుగకుండా చర్యలు చేపట్టామని .. కోవిడ్ వ్యాప్తి చెందకుండా భక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆదివాసీ సంఘాలు, పూజారులు ఐక్యతతో ఏ నిర్ణయం తీసుకున్నా వారి నిర్ణయం మేరకు జాతరను నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలిపారు మంత్రులు. అంతేకాదు ఈ సందర్భంగా రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ మహా జాతర సజావుగా సాగేందుకు అందరూ సహకరించాలని కోరారు. 40 వేలమంది సిబ్బంది జాతర విధుల్లో పాల్గొంటారని తెలిపారు.

Also Read:

జస్టిన్ బీబర్ సంగీత కచేరీ వద్ద కాల్పుల కలకలం.. నలుగురికి గాయాలు..

 మేడారం జాతరకు నిధులను మంజూరు చేసిన కేంద్రం.. గిరిజనుల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్న మంత్రి కిషన్ రెడ్డి..

ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!