Justin Bieber: జస్టిన్ బీబర్ సంగీత కచేరీ వద్ద కాల్పుల కలకలం.. నలుగురికి గాయాలు..

Justin Bieber: జస్టిన్ బీబర్‌కి ఒక్క అమెరికా(America)లోనే కాదు.. అనేక దేశాల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా ఉంది. మన భారతదేశం(Bhrath)లో కూడా జస్టిన్‌కి లక్షలాది మంది అభిమానులు ఉన్నారు..

Justin Bieber: జస్టిన్ బీబర్ సంగీత కచేరీ వద్ద కాల్పుల కలకలం.. నలుగురికి గాయాలు..
Justin Bieber
Follow us
Surya Kala

|

Updated on: Feb 13, 2022 | 6:03 PM

Justin Bieber: జస్టిన్ బీబర్‌కి ఒక్క అమెరికా(America)లోనే కాదు.. అనేక దేశాల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా ఉంది. మన భారతదేశం(Bhrath)లో కూడా జస్టిన్‌కి లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. జస్టిన్ బీబర్ సంగీత కచేరీ జరుగుతుంది అంటే చాలు.. చూసేందుకు భారీగా అభిమానులు పెద్దఎత్తున తరలివస్తారు. అయితే ఇటీవల జరిగిన సంగీత కచేరీ తర్వాత గొడవ జరిగింది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో హాలీవుడ్ ప్రముఖ గాయకుడు స్టార్ జస్టిన్ బీబర్ సంగీత కచేరీని నిర్వహించారు. ఈ కచేరీ జరిగిన రెస్టారెంట్‌లో వెలుపల జరిగిన కాల్పులు జరిగాయి. ది నైస్ గై రెస్టారెంట్ వెలుపల జరిగిన కాల్పుల్లో నలుగురు గాయపడ్డారని లాస్ ఏంజిల్స్ పోలీస్ డిపార్ట్‌మెంట్ అధికారి లిజెత్ లోమెలి తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు అక్కడ ఇద్దరు బాధితులను గుర్తించారని, వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారని పోలీసులు తెలిపారు.

క్షతగాత్రులకు వెంటనే చికిత్స అందించారని.. శరీరంలోని బులెట్లు బయటకు తీశారని ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి బాగుందని చెప్పారు. అయితే కాల్పులు జరిపిన నిందితుడి గురించి సమాచారం తెలియదని అన్నారు. ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నామని చెప్పారు. అయితే జస్టిన్ బీబర్ ఉన్న ప్రాంతంలో కాల్పులు జరపడంతో అభిమానులు కలత చెందారు.

నివేదికల ప్రకారం.. డ్రేక్, లియో డికాప్రియో, కెండల్ జెన్నర్, కోల్ కర్దాషియాన్ వంటి పలువురు ప్రముఖులు ఈ పార్టీలో పాల్గొన్నారు. సంగీత కచేరీ అనంతరం కొడాక్ బ్లాక్, గున్నా , లిల్ బేబీ బయటికి వచ్చారని, అప్పుడే గొడవ జరిగిందని ప్రత్యక్ష సాక్షుల కథనం. కొందరు వ్యక్తులు కారుపైకి ఎక్కడంతో గొడవ మొదలైందని.. కొంతసేపటికి బుల్లెట్ల శబ్ధం రావడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది.

Also Read:

మక్కల్‌ సెల్వన్ సినిమా టీజర్‌కు సూపర్‌ రెస్పాన్స్‌.. ఒక్క రోజులోనే కోటికి పైగా వ్యూస్‌..