Bodda Ganesha Temple: గుడిని ధ్వంసం చేయడానికి వెళ్లిన టిప్పు సుల్తాన్‌.. మనసు మార్చుకున్నారు.. ఎందుకో తెలుసా..?

హిందూ సంప్రదాయంలో ఏ పూజ చేసినా తొలి పూజ విగ్నాధిపతి విఘ్నేశ్వరుడికే. ఏ శుభకార్యం మొదలుపెట్టినా తొలిసారిగా తలుచుకునేది లంబోదరుడినే. పండగలలో తొలి పండుగగా వినాయకుడి పండుగనే..

Bodda Ganesha Temple: గుడిని ధ్వంసం చేయడానికి వెళ్లిన టిప్పు సుల్తాన్‌.. మనసు మార్చుకున్నారు.. ఎందుకో తెలుసా..?
లంబోదరుడిని ఇక్కడ బొడ్డ గణేశా అని పిలుస్తారు
Follow us
Surya Kala

|

Updated on: Feb 03, 2021 | 1:14 PM

Bodda Ganesha Temple in Kerala: హిందూ సంప్రదాయంలో ఏ పూజ చేసినా తొలి పూజ విగ్నాధిపతి విఘ్నేశ్వరుడికే. ఏ శుభకార్యం మొదలుపెట్టినా తొలిసారిగా తలుచుకునేది లంబోదరుడినే. పండగలలో తొలి పండుగగా వినాయకుడి పండుగనే జరుపుతాం. అందుకే ఇంటింటా.. ఊరూరా ఆ స్వామివారి నామమే మారుమ్రోగుతుంది. భాద్రపదమాసంలో ప్రత్యేకంగా నవరాత్రి పూజలందుకునే స్వామి.. గణేశుడు. ఇక ఈ గణనాథుడికి దేశంలో అనేకచోట్ల ఆలయాలున్నాయి.. అయితే కేరళలో కాసరగోడ్ జిల్లాలో ఉన్న లబోధరుడు మాత్రం వేరేవేరీ స్పెషల్.. ఏమిటా విశిష్టత చూద్దాం పదండి..

కేరళలోని మధూరులో పరమేశ్వరుడి ఆలయం ఉంది. మధురవాహినీ నదీ తీరంలో ఇది కొలువైంది. ఈ గుళ్లో నీలకంఠుడు… మదరాంతేశ్వర స్వామిగా పూజలందుకుంటున్నాడు. ఈ ఆలయంలో ప్రధాన దైవం ఈశ్వరుడే అయినా.. ఎక్కువమంది ఇక్కడ విఘ్నేశ్వరుడిని దర్శించుకోవడానికి వస్తారు. కారణం.. లంబోదరుడి విగ్రహం సైజు ఇక్కడ రోజూ పెరుగుతూ ఉండడమే.

ఆలయ చరిత్ర :

మధుర మహాగణపతి ఖ్యాతిగాంచిన ఈ ఆలయంలో పరమశివుడు మదరనాథేశ్వరునిగా పూజలందుకుంటున్నాడు. పూర్వం రాజుల కాలంలో ఈ ఆలయం తుళునాడు రాజ్యంలో ఉండేది. స్వయంభువుగా వెలసిన శివలింగానికి తుళురాజులు ఆలయం నిర్మించారు. మదరు అనే వృద్ధురాలు ఈ శివలింగాన్ని కనుగొనడంతో ఆమె పేరిట ఇక్కడి శివుడు మదరనాథేశ్వరునిగా ప్రసిద్ధి పొందాడని ప్రతీతి. ఒకనాడు స్థానిక తుళు బాలుడు ఒకడు ఆలయంలో ఆడుకుంటూ, గర్భగుడిలోని దక్షిణ గోడపై వినాయకుడి బొమ్మ గీశాడు. గోడలపై ఆ బాలుడు గీసిన వినాయకుడి బొమ్మ పరిమాణం నానాటికీ పెరగసాగింది. చూస్తుండగానే కొద్దిరోజుల్లో ఆ గణేశుడి బొమ్మ భారీ స్థాయికి పెరిగింది. ఆలయంలోనే ఆటలాడుకునే ఆ బాలుడు బొడ్డ గణేష అంటూ పిలుస్తూ ఆడుకునేవాడట.. అప్పటి నుంచి ఆ ఆలయం శివాలయమైనా మహాగణపతి ఆలయంగా ప్రసిద్ధి పొందింది.

ఈ ఆలయం నిర్మాణం కూడా ఏనుగు ఆకారంలో ఉంటుంది. మూడంతస్తులతో నిర్మించిన ఈ ఆలయ వాస్తు, శిల్పకళా కౌశలం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. బయటి నుంచి చూస్తే ఏనుగు వీపు ఆకారంలో కనిపిస్తుంది. ఆలయం లోపలి భాగంలో కలపపై చెక్కిన రామాయణ దృశ్యాలు కనువిందు చేస్తాయి. మైసూరు రాజ్యాన్ని పరిపాలించిన టిప్పు సుల్తాను చాలా హిందూ ఆలయాలపై దాడులు చేసినట్లుగానే ఈ ఆలయంపైనా దాడి చేసి ధ్వసం చేయడానికి వచ్చాడట. దాహం వేసిన టిప్పు సుల్తాన్ అక్కడ బావిలోని నీరు తాగిన తర్వాత మనసు మార్చుకుని ఆలయాన్ని ధ్వంసం చేయకుండానే వెనుదిరిగాడట. తన వెంట ఉన్న సేనలను తృప్తిపరచడానికి ఆలయంపై దాడి చేసినట్లుగా లాంఛనప్రాయంగా బయటి వైపు గోడపై కత్తితో వేటు వేసి, వెనుదిరిగాడట. టిప్పు సుల్తాన్‌ గోడపై వేసిన వేటు గుర్తు ఇప్పటికీ కనిపిస్తుంది.

మొత్తం మూడు అంతస్తుల్లో ఉన్నమధుర మహాగణపతి కోవెల ఆధ్యాత్మిక ప్రశాంత వాతావరణంలో ఉంటుంది. భక్తులకు ఆధ్యాత్మిక చింతనను కలిగిస్తుంది. ఈ విగ్రహం పరిమాణం రోజురోజుకూ పెరుగుతుండడంతో భక్తులు ఆశ్చర్యపోతున్నారు. ఇదంతా స్వామివారి లీల అంటూ పూజలు చేస్తున్నారు. ఈ లంబోదరుడిని ఇక్కడ బొడ్డ గణేశా అని పిలుస్తారు.వినాయకచవితికి ఇక్కడ విశేషమైన పూజలుంటాయి.

Also Read:

గరుత్మంతుని విగ్రహంపై చెమటలు.. సైన్స్ కే సవాల్.. ఈ క్షేత్రం ఎక్కడుందో తెలుసా..!

ఔరంగజేబు వేల సైన్యాన్ని పెట్టి 3 ఏళ్ళు కష్టపడినా ధ్వంసం కాని ఈ ఆలయ నిర్మాణం ఇప్పటికీ అంతుచిక్కని రహస్యమే..!

ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!