Lord Shiva: శివయ్య అనుగ్రహం కోసం.. కోరిన కోర్కెలు తీరడం కోసం సోమవారం ఇలా పూజించండి..

పరమశివుని హృదయపూర్వకంగా ఆరాధించడం వల్ల త్వరగా భక్తులు కోరిన కోర్కెలు తీరతాయి. సంతోషం కలుగుతుందని విశ్వాసం. జీవితంలోని సమస్యలన్నీ స్వయంచాలకంగా పరిష్కారమవుతాయి.

Lord Shiva: శివయ్య అనుగ్రహం కోసం..  కోరిన కోర్కెలు తీరడం కోసం సోమవారం ఇలా పూజించండి..
Lord Shiva Puja On Monday
Follow us
Surya Kala

|

Updated on: Dec 11, 2022 | 10:26 AM

సోమవారం శివునికి అంకితం చేయబడింది. భోళాశంకరుడి అనుగ్రహం కోసం భక్తులు సోమవారం ఓం నమః శివాయ అంటూ వివిధ రకాలుగా పూజిస్తారు. సోమవారం ఉదయం నిద్రలేచిన తర్వాత.. శివుడిని దర్శనం చేసుకుని, శివ చాలీసా లేదా శివాష్టకాన్ని పఠించవచ్చు. పరమశివుని హృదయపూర్వకంగా ఆరాధించడం వల్ల త్వరగా భక్తులు కోరిన కోర్కెలు తీరతాయి. సంతోషం కలుగుతుందని విశ్వాసం. జీవితంలోని సమస్యలన్నీ స్వయంచాలకంగా పరిష్కారమవుతాయి. సోమవారం శివుని ప్రసన్నం చేసుకోవడానికి ఈరోజు కొన్ని పరిహారాల గురించి తెలుసుకుందాం..

గ్రహదోషాల నివారణకోసం..సోమవారం నాడు ఏదైనా శివాలయానికి వెళ్లి శివలింగానికి పచ్చి పాలను నైవేద్యంగా పెట్టడం వల్ల జాతకంలో ఉన్న గ్రహదోషాలు తొలగిపోతాయి . 5 లేదా 7 సోమవారం వరకు ఇలా చేయండి. ఇలా చేయడం వల్ల జాతకంలో ఉన్న గ్రహదోషాలు తొలగిపోతాయని నమ్మకం. అంతే కాదు భక్తులు కోరిన కోర్కెలు నెరవేరతాయని విశ్వాసం.

దృష్టి దోషాలను తొలగించడానికి దృష్టి దోషాల నివారణ కోసం ఆదివారం రాత్రి పడుకునే ముందు మీ పక్కన ఒక గ్లాసు పాలను పెట్టుకుని నిద్రించండి. దీని తరువాత, మరుసటి రోజు ఉదయం స్నానం చేసి, శుభ్రమైన బట్టలు ధరించి, గ్లాసులో పాలను ఏదైనా మొక్కకు పోయండి.. ఇలా చేయడం వలన దృష్టి దోషాలను తొలగిపోతాయని విశ్వాసం.

ఇవి కూడా చదవండి

వైవాహిక జీవితంలో మాధుర్యం కోసం ఎవరైనా వైవాహిక జీవితంలో ఏవైనా సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే లేదా వివాహానికి ఏదైనా అడ్డంకిని ఎదుర్కొంటున్నట్లయితే, వారు సోమవారం ఉదయం శివాలయంలో గౌరీ-శంకర రుద్రాక్షను సమర్పించాలి. స్వామివారికి తమ మనసులో కోరికను శివయ్యకు చెప్పుకోండి.

డబ్బు  ఇబ్బందులను అధిగమించడానికి మీరు మీ జీవితంలో ఏవైనా ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే ప్రతి సోమవారం శివలింగానికి నీటితో పాలు సమర్పించండి. అంతే కాదు రుద్రాక్ష జపమాలను పట్టుకుని ‘ఓం సోమేశ్వరాయ నమః’ అని 108 సార్లు జపించండి. పౌర్ణమి నాడు పాలు కలిపిన నీటితో చంద్రునికి అర్ఘ్యం సమర్పించండి. ఇలా చేయడం వల్ల జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయి. జీవితంలో ఆనందం ఏర్పడుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉంటే జాతకంలో చంద్రుని స్థితిని బలోపేతం చేయడానికి, సోమవారం నాడు మీరు పరశివుడిని పూజించేటప్పుడు.. ఉత్తర దిశలో కూర్చుని, ‘శివ రక్షా స్తోత్రం’ జపించాలి. ఇలా చేయడం వలన విశ్వాసం పెరుగుతుంది. ఈ రోజున మీరు ‘చంద్రశేఖర స్తోత్రాన్ని’ పఠించవచ్చు.. ఇలా చేయడం వలన జాతకంలో చంద్రుని స్థితిని మెరుగుపడుతుంది.

శివ పంచాక్షరీ మంత్రాలను పఠిస్తూ ప్రతి సోమవారం ఉత్తరాభిముఖంగా కూర్చుని పరమేశ్వరుని స్మరిస్తూ శివ పంచాక్షరీ మంత్రం ‘ఓం నమః శివాయ’ 21, 51 లేదా 108 సార్లు జపించాలి. దీని వలన శివుడు మరింత సంతోషించి కోరిన కోర్కెలు తీరుస్తాడు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్