Vastu tips: ఇంట్లో ఆనందం కరువైందా.. ఈ వాస్తు చిట్కాలను పాటిస్తే సంతోషం మీ సొంతం.
ప్రతీ మనిషి ఆనందాన్ని కోరుకుంటారు. జీవితంలో ప్రతీ పని అందుకోసమే చేస్తుంటారు. అయితే మనం సంతోషంగా ఉండడం మన చుట్టూ ఉన్న పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ కొన్ని సందర్భాల్లో చుట్టూ వాతావరణం బాగున్నా, చేతి నిండా..
ప్రతీ మనిషి ఆనందాన్ని కోరుకుంటారు. జీవితంలో ప్రతీ పని అందుకోసమే చేస్తుంటారు. అయితే మనం సంతోషంగా ఉండడం మన చుట్టూ ఉన్న పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ కొన్ని సందర్భాల్లో చుట్టూ వాతావరణం బాగున్నా, చేతి నిండా డబ్బున్నా ఏదో లోటు వెంటాడుతుంటుంది. ఏదో తెలియని బాధ మనసును మెలిపెడుతుంటుంది. ఇంట్లో సంతోషం లేకపోవడానికి వాస్తు దోషాలు కూడా ఒక కారణమని వాస్తు నిపుణులు చెబుతుంటారు. ఇంట్లో వాస్తు మనుషుల ఆనందంపై ప్రభావం చూపుతుందనేది వాస్తు నిపుణులు అభిప్రాయం. అయితే కొన్ని రకాల వాస్తు చిట్కాలను పాటించడం ద్వారా ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని తరమికొట్టి, సంతోషం వెల్లివిరుస్తుందంటా. ఇంతకీ ఆ చిట్కాలు ఏంటంటే..
సాధారణంగా ఇంటిని శుభ్రం చేసేప్పుడు నీటిలో డిటర్జెంట్ లేదా ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్స్‌ను వేస్తుంటారు. అయితే వీటికి బదులుగా నీటిలో ఉప్పు కలపాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో సమస్యలు అన్ని దూరం అయిపోతాయి. నెగిటివ్ ఎనర్జీ దూరమవుతుంది. అలాగే ఇంట్లో చెడు ప్రభావం పడకుండా ఉండాలనే ఒక గాజు కప్పులో ఉప్పు వేసి బాత్రూంలో ఉంచాలని చెబుతున్నారు. దీనివల్ల ఇంట్లో మానసిక ప్రశాంతత నెలకొంటుంది. చిన్నారుల సంబంధిత సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే కాస్త ఉప్పును స్నానం చేసే నీళ్లలో వేయాలని చెబుతున్నారు.
ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకునే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా పాత వస్తువులను ఇంట్లో లేకుండా చూసుకోండి. వీటి కోసం ప్రత్యేకంగా స్టోర్ రూమ్‌లను ఏర్పాటు చేసుకోండి. ఇంట్లో ముళ్లు ఉండే చెట్లను పెంచుకోకండి వీటివల్ల మానసికంగా ప్రభావం చూపుతుంది. ఇంట్లో సువాసన వచ్చే పర్‌ఫ్యూమ్స్ లేదా కర్పూరం, సాంబ్రాణి లాంటివి వేయండి దీనివల్ల మనస్సు ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇంట్లో ఉండే వారి మానసిక పరిస్థితి శాంతంగా ఉంటుంది.
నోట్: పైన తెలిపిన విషయాలు కొందరు వాస్తు నిపుణుల సూచనల మేరకు అందించినవి మాత్రమే. వీటికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..