Srisailam Temple: క్రమంగా పెరుగుతున్న శ్రీశైలం మల్లన్న హుండీ ఆదాయం.. తాజాగా ఎన్నికోట్లు వచ్చిందంటే..
శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయ హుండీ ఆదాయం ఎప్పటికప్పుడు పెరుగుతూ పోతుంది. నగదుతో పాటు బంగారు విదేశీ కరెన్సీ కూడా భక్తులు హుండీలో వేస్తూ తమ మొక్కులు తీర్చుకుంటున్నారు శక్తిపీఠము జ్యోతిర్లింగం కొలువైన శ్రీశైలం ఆలయం దిన దినాభా అభివృద్ధి చెందుతోంది అనడానికి ఇదే ప్రత్యక్ష నిదర్శనం. అవును, ఈసారి శ్రీశైలం మల్లన్న హుండీ ఆదాయం భారీగా వచ్చింది. దాదాపు రూ. 5,07,46,508 కోట్లు నగదు ఆదాయం వచ్చింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఓసారి చూద్దాం..
Srisailam Mallanna: శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయ హుండీ ఆదాయం ఎప్పటికప్పుడు పెరుగుతూ పోతుంది. నగదుతో పాటు బంగారు విదేశీ కరెన్సీ కూడా భక్తులు హుండీలో వేస్తూ తమ మొక్కులు తీర్చుకుంటున్నారు శక్తిపీఠము జ్యోతిర్లింగం కొలువైన శ్రీశైలం ఆలయం దిన దినాభా అభివృద్ధి చెందుతోంది అనడానికి ఇదే ప్రత్యక్ష నిదర్శనం. అవును, ఈసారి శ్రీశైలం మల్లన్న హుండీ ఆదాయం భారీగా వచ్చింది. దాదాపు రూ. 5,07,46,508 కోట్లు నగదు ఆదాయం వచ్చింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఓసారి చూద్దాం..
శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల ఉభయ, పరివార దేవాలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు. ఆలయంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో హుండీ లెక్కింపు నిర్వహించగా ఈ లెక్కింపు ద్వారా శ్రీశైల మల్లన్న దేవస్థానానికి రూ. 5,07,46,508 కోట్లు నగదు రాబడిగా లభించింది. ఈ ఆదాయాన్ని గత 34 రోజులలో శ్రీస్వామి అమ్మవార్లకు భక్తులు నగదు రూపంలో సమర్పించినట్టు ఆలయ ఈవో లవన్న తెలిపారు. ఈ హుండి లెక్కింపులో నగదుతో పాటుగా 324.500 గ్రాముల బంగారం,10.050 కేజీల వెండి దాతలు మొక్కులు చెల్లించారు. పైవాటితో పాటు ఈ హుండీ లెక్కింపులో పలు రకాల విదేశీ కరెన్సీ కూడా లెక్కించారు. అందులో యుఎస్ఏ డాలర్లు 839, యూఏఈ దిర్హమ్స్ 1,115, యూరోస్ 130, ఆస్ట్రేలియా డాలర్లు 100, మలేషియా రింగిట్స్ 100, ఇంగ్లాండ్ పౌండ్స్ 85, సింగపూర్ డాలర్లు10, ఎస్ ఏ యు రియాల్స్ 10 మొదలైన వివిధ విదేశీ కరెన్సీ కూడా ఈ హుండీల లెక్కింపులో లభించాయి. పటిష్టమైన నిఘా నేత్రాల మధ్య దేవస్థానం ఈవో లవన్న పర్యవేక్షణలో హుండీ లెక్కింపు జరిగింది. ఈ లెక్కింపులో దేవస్థానం అన్ని విభాగాలకు సంబంధించిన అధికారులు, సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..