AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: ఈ ఐదు లక్షణాలున్న స్త్రీ ఉన్న ఇల్లు శాంతికి నిలయం.. భార్యగా పొందిన భర్త అదృష్టవంతుడట

ఆచార్య చాణక్యుడు రాజనీతిజ్ఞుడు. ఆయన రచించిన నీతి శాస్త్రం అనే గ్రంథంలో మానవ జీవితానికి, జీవన విధానానికి సంబంధించిన అనేక విషయాలను తెలియజేశాడు. అవి నేటి తరం యువతకు ఉపయోగపడే ఎన్నో అద్భుతమైన విషయాలని వాటిని అనుసరించడం ద్వారా జీవితం సుఖంగా సాగుతుందని పెద్దలు చెబుతారు. చాణక్యుడు స్త్రీకి ఉండాల్సిన కొన్ని లక్షణాలను చెప్పాడు. ఇలాంటి లక్షణాలు ఉన్న స్త్రీని భార్యగా పొందిన భర్త అదృష్ట వంతుడు అని పేర్కొన్నాడు. ఈ రోజు ప్రతి స్త్రీకి ఉండాల్సిన లక్షణాలు ఏమిటంటే..

Chanakya Niti: ఈ ఐదు లక్షణాలున్న స్త్రీ ఉన్న ఇల్లు శాంతికి నిలయం.. భార్యగా పొందిన భర్త అదృష్టవంతుడట
Chanakya Niti
Surya Kala
|

Updated on: Aug 01, 2025 | 11:42 AM

Share

ఆచార్య చాణక్య స్త్రీల గురించి చాలా విషయాలు చెప్పాడు. అవి ఇప్పటికీ జీవితంలో సరిగ్గా సరిపోతాయి. చాణక్య నీతి శాస్త్రంలో చెప్పిన ప్రకారం స్త్రీకి గౌరవం, ప్రేమ , స్థిరత్వాన్ని ఇచ్చే కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉండాలి. అలాంటి స్త్రీ తన కుటుంబాన్ని కలిపి ఉంచుతుంది. ఏకతాటి మీద నడిచేలా చేస్తుంది. అంతేకాదు ఎవరికీ ఎటువంటి కష్టం ఎదురైనా.. అందరికీ మద్దతుగా ఉంటుంది. స్త్రీకి ఈ లక్షణాలు ఉంటే.. ఆమె జీవితం ఆనందం, శాంతి, విజయంతో నిండి ఉంటుందని.. కనుక అటువంటి లక్షణాలున్న స్త్రీని భార్యగా పొందిన భర్త అదృష్టవంతుడు అని చాణక్య స్పష్టంగా చెప్పాడు. స్త్రీకి ఉండాల్సిన 5 శుభ లక్షణాలు ఏమిటో తెలుసుకుందాం.

సహనం: స్త్రీలో సహనం చాలా ముఖ్యమైనది లక్షణంగా పరిగణించబడుతుంది. ఆమె ప్రతి కష్టాన్ని శాంతి, ఓర్పుతో భరిస్తుంది. కోపం, ఒత్తిడికి బదులుగా.. జ్ఞానంతో వ్యవహరిస్తుంది. అలాంటి స్త్రీ ఎల్లప్పుడూ కుటుంబాన్ని ఐక్యంగా ఉంచుతుంది.

మధుర స్వరం: చాణక్యుడి ప్రకారం మధురమైన స్వరం ఉన్న స్త్రీ అందరి హృదయాలను గెలుచుకుంటుంది. ఆమె ఎల్లప్పుడూ మధురంగా మర్యాదగా మాట్లాడుతుంది, ఇతరులను గౌరవిస్తుంది. ఆమె మాటలు ఇంట్లో ప్రేమ , కుటుంబ సభ్యుల మధ్య సాన్నిహిత్యాన్ని కొనసాగిస్తాయి. ఇలాంటి స్త్రీతో ప్రతి ఒక్కరూ అనుబంధం కలిగి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మనస్సాక్షి: స్త్రీ తన పనులన్నింటినీ నిజాయితీగా, పూర్తి బాధ్యతతో చేస్తుంది. ఆమె తన కుటుంబం, పిల్లలు, సంబంధాల పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటుంది. ఆమె తన విధిని అర్థం చేసుకుని దానిని పూర్తి భక్తితో నిర్వహిస్తుంది. అలాంటి స్త్రీ ఇంటికి నిజమైన శక్తి.

జ్ఞానం: తెలివైన స్త్రీ ఎటువంటి పరిస్థితి ఎదురైనా సరే ఆలోచనాత్మకంగా అడుగులు వేస్తుంది. ఆమెకు మంచి, చెడుల మధ్య తేడాను ఎలా గుర్తించాలో తెలుసు. ఆమె ఆలోచన కుటుంబాన్ని అనేక సమస్యల నుంచి కాపాడుతుంది. చాణక్యుడి ప్రకారం అలాంటి స్త్రీ ఇంటికి ఇల్లాలుగా దొరికడం శుభప్రదం.

సత్యం, నిజాయితీ: ఎల్లప్పుడూ సత్యం మాట్లాడుతూ.. నిజాయితీతో జీవించే స్త్రీ నిజంగా ఆదర్శవంతమైనద ఇల్లాలు అని చాణక్యుడు చెప్పాడు. ఆమె ఎప్పుడూ ఎవరి నమ్మకాన్ని ఒమ్ము చేయదు. ఆమె వ్యక్తిత్వం స్వచ్ఛమైనది. బలమైనది. ఇలాంటి లక్షణాలున్న స్త్రీని ఆమె మొత్తం కుటుంబ సభ్యులు విశ్వసిస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.