- Telugu News Photo Gallery Spiritual photos Rakshi Festival 2025: people of these religions also celebrate hindu festival
Rakhi: రాఖీ పండగ ఐక్యతకు చిహ్నం. మన దేశంలో హిందువులతో పాటు ఏ మతాలకు చెందినవారు జరుపుకుంటారో తెలుసా..!
రాఖీ పండగ హిందువులు జరుపుకునే ప్రధాన పండుగలలో ఒకటి. రాఖీ అనగా రక్షణ బంధం. తోబుట్టువుల మధ్య బంధానికి చిహ్నంగా ఈ పండగను జరుపుకుంటారు. అన్నా చెల్లెల్లు, అక్కా తమ్ముళ్ళు జరుపుకునే మహోత్తరమైన పండుగ భారతదేశంలో హిందువులు మాత్రమే జరుపుకుంటారా లేదా ఇతర మతాల ప్రజలు కూడా ఈ పండుగను జరుపుకుంటారా..వివరంగా తెలుసుకుందాం.
Updated on: Aug 01, 2025 | 11:21 AM

రాఖీ పండుగ అన్నదమ్ములు అక్క చెల్లెల మధ్య ఉన్న అమూల్యమైన, పవిత్రమైన సంబంధానికి చిహ్నం. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజుని రాఖీ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ రోజున సోదరి తన సోదరుడు మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ రాఖీని కడుతుంది.

ఈ రాఖీ పండుగను ప్రధానంగా దేశ విదేశాల్లో ఉన్న హిందూ మతస్థులు జరుపుకుంటారు. ఈ రోజున సోదరీమణులు తమ సోదరుడి మణికట్టుకి తమ ప్రేమని ఆప్యాయతని తెలియజేస్తూ తనకు రక్షణ ఇవ్వమని కోరుతూ దారాన్ని కడతారు.

ఈ పండగ ప్రధానంగా హిందూ పండుగ. హిందూ పురాణం ప్రకారం ఇంద్రుడు రాక్షసులతో యుద్ధంలో ఉన్నప్పుడు. ఇంద్రుడి భార్య శచి..తన భర్త రక్షణ కోరుతూ శ్రీకృష్ణుడి వద్దకు చేరుకుంది ఒక దారం కట్టి తన భర్తని రక్షించమని కోరింది. అప్పటి నుంచి రాఖీ కట్టడం ఒక ఆచారంగా మారింది. అందువల్ల హిందూ మతంలో రక్షా బంధన్ రోజున సోదరుడికి రాఖీ కట్టి సోదరి రక్షణ కోరుకుంటుంది.

ఈ పండుగను సిక్కు మతం, జైన మతానికి చెందిన వారు కూడా జరుపుకుంటారు. ఈ రోజున విష్ణుకుమార్ అనే ముని 700 మంది జైన సన్యాసులను రక్షించాడని నమ్ముతారు. అందుకే జైన సమాజం ప్రజలు రక్షాబంధన్ పండుగను జరుపుకుంటారు.

దీనితో పాటు ముస్లిం , క్రైస్తవ మతాలకు చెందిన చాలా మంది ప్రజలు కూడా ఈ పండుగను జరుపుకుంటారు. రక్షా బంధన్ పండుగ మతపరమైన సరిహద్దులకు అతీతంగా ప్రేమ, రక్షణ కోరుకుంటూ తోబుట్టువుల మధ్య బంధానికి చిహ్నంగా మారింది.

రాఖీ కట్టిన సోదరిని జీవితాంతం రక్షిస్తానని సోదరుడు వాగ్దానం చేస్తాడు. ఈ పండగ సోదరసోదరీమణుల మధ్య అనుబంధాన్ని బలోపేతం చేయడానికి, వారి మధ్య ప్రేమను పెంపొందించడానికి ఒక మార్గంగా పరిగణింపబడుతున్నది. అందుకనే దేశంలోని అన్ని వర్గాల ప్రజలు ఈ పండగను జరుపుకుంటారు. రాఖీ పండగ మన దేశంలో ఐక్యతకు చిహ్నం.




