చారిత్రక ట్యాంక్‌బండ్‌లో ఖైరతాబాద్ గణేశుడి చివరి నిమజ్జనం.. మళ్లీరా బొజ్జగణపయ్య అంటూ గంగమ్మ ఒడికి
ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం ఇవాళ ప్రశాంతంగా ముగిసింది. ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకపోవడంతో పోలీసులు
Khairatabad Ganesh Immersion – Hussain Sagar: ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం ఇవాళ ప్రశాంతంగా ముగిసింది. ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకపోవడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. ఉదయం ఆరుగంటలకు ప్రారంభమైన శోభాయాత్ర మధ్యాహ్నం రెండున్నర వరకూ సాగింది. ఖైరతాబాద్, లక్డీకాపూల్, సైఫాబాద్, తెలుగుతల్లి ఫ్లైఓవర్, లుంబినీపార్క్ గుండా ఎన్టీఆర్ మార్గ్ వరకు ఈ శోభాయాత్ర అంత్యంత వైభవంగా కన్నుల పండువగా సాగింది.
అదీకాకుండా.. ఎంతో చారిత్రక ప్రాశస్త్యం ఉన్న ట్యాంక్‌బండ్‌లో ఖైరతాబాద్ గణేషుడి చివరి నిమజ్జనం ఇదే కావడం ఈ ఏడాది నిమజ్జనం ప్రత్యేకత. వచ్చే ఏడాది నుంచి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయనున్నారు. గణేశుడిని విగ్రహాన్ని నెలకొల్పిన చోటనే నిమజ్జనం చేయాలని ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ తాజాగా తీర్మానించిన సంగతి తెలిసిందే. ఇక, ఈ ఏడాది పంచముఖ ఖైరతాబాద్ గణేశుడిని వేలాది మంది ప్రజలు, భక్తులు వైభవంగా సాగనంపారు. బప్పా మోరియా అంటూ నినదించారు. మళ్లీరా బొజ్జగణపయ్య అంటూ గంగమ్మ ఒడికి చేర్చారు.
భారీ గణనాథుడిని చూసేందుకు వందలాదిగా ప్రజలు తరలివచ్చారు. గణపతిబప్పా మోరియా నినాదాలతో హోరెత్తించారు. బైబై గణేశా అంటూ వీడ్కోలు పలికారు. ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనం అంటే పెద్దపండుగే. ఏటా నిమజ్జనం రోజు భారీ గణపయ్యని చూసేందుకు వేలాది మంది తరలివస్తారు. నగరం నలుమూలల నుంచే కాదు.. పక్క జిల్లాల నుంచీ గణేషుడిని చూసేందుకు వస్తారు. ఈసారి కూడా అదే ట్రెండ్ నడిచింది.
Read also: Malla Reddy: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని అనరానిమాటలన్న మంత్రి మల్లారెడ్డి