Malla Reddy: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని అనరానిమాటలన్న మంత్రి మల్లారెడ్డి
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీద మళ్లీ తిట్ల దండకం అందుకున్నారు. అంతేకాదు, ఏకంగా..
Malla Reddy Vs Revanth Reddy: తెలంగాణ మంత్రి మల్లారెడ్డి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీద మళ్లీ తిట్ల దండకం అందుకున్నారు. అంతేకాదు, ఏకంగా పురుగులు పడి చస్తాడంటూ శాపనార్థాలు కూడా పెట్టేశారు. సీఎం కేసీఆర్ ను తిట్టిన రేవంత్‌రెడ్డి.. డొకబాజీగాడు అని కూడా మంత్రి మల్లారెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
‘చర్లపల్లి జైలుకు వెళ్లిన వాడు సీఎం కేసీఆర్‌ను తిడుతాడా?’ అంటూ తీవ్రమైన పదజాలంతో మంత్రి మల్లారెడ్డి మళ్లీ ఇవాళ కూడా విరుచుకుపడ్డారు. టీపీసీసీ అధ్యక్ష పదవి 50 కోట్లతో కొని తెచ్చుకున్న రేవంత్ రెడ్డి.. సీఎం కేసీఆర్ ను తిట్టడం ఏంటని ప్రశ్నించారు మల్లారెడ్డి.
దేవుడు లాంటి తెలంగాణ సీఎం కేసీఆర్‌ను తిట్టిన రేవంత్ రెడ్డి పురుగులు పడి చస్తాడంటూ మల్లారెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఆదివారం జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో కాంగ్రెస్.. బీజేపీ నుండి TRS లోకి చేరికలు సందర్భంలో మల్లారెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
Read also: రామానుజ విగ్రహావిష్కరణకి రండి.. స్టాలిన్‌కు చిన్నజీయర్ స్వామి ఆహ్వానం