- Telugu News Spiritual Chinna Jeeyar invites Chief Justice of India NV Ramana for unveiling of 'statue of equality' near Hyderabad
రామానుజ విగ్రహావిష్కరణకి రండి.. స్టాలిన్‌కు చిన్నజీయర్ స్వామి ఆహ్వానం
Statue of Equality: రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ శివారు శంషాబాద్ ముచ్చింతల్‌లో అతిపెద్ద సమతామూర్తి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి ఆహ్వానాలు అందిస్తున్నారు చిన్నజీయర్ స్వామి.
Updated on: Sep 19, 2021 | 3:58 PM

హైదరాబాద్ శివారు శంషాబాద్ ముచ్చింతల్‌లో అతిపెద్ద సమతామూర్తి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ బృహత్క్యార్యానికి రావాలంటూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆహ్వానించారు చిన్నజీయర్ స్వామి.

ఈ మహోత్సవ ఘట్టానికి దేశంలోని పలువురు ప్రముఖులను స్వయంగా అహ్వానిస్తున్న చిన్నజీయర్ స్వామి... ఇవాళ చెన్నైలో సీఎం స్టాలిన్ ను కలిసి ఆహ్వాన పత్రం అందించారు. చిన్నజీయర్ స్వామి వెంట మై హోమ్ గ్రూప్ అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు కూడా ఉన్నారు.

హైదరాబాద్ శివారు ముచ్చింతల్‌లోని చిన్నజీయర్ స్వామి ఆశ్రమంలో 200 ఎకరాల్లో వేయి కోట్లతో భగవద్రామానుజుల 216 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. 'స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ'కి నిలువెత్తు నిదర్శనమైన సమతామూర్తి విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు 2022 ఫిబ్రవరి 2 నుంచి 14వరకు కార్యక్రమాలు జరుగుతాయి.

విగ్రహావిష్కరణ సందర్భంగా ఒక వెయ్యి 35 హోమ గుండాలతో ప్రత్యేక యాగం నిర్వహించనున్నారు. కాగా, సమతా మూర్తి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి సంబంధించి మరిన్ని వివరాల కోసం మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెం.+91 790 14 2 2022, వెబ్‌సైట్ Statueofequality.org, ఈ-మెయిల్ Srs.samaroham@statueofequality.org





























