Kanika Niti: లోకంలో ధనాశాపరులు, అధికార దాహంతో అలమటించేవాళ్లు పాటించే దుర్మార్గపు నీతి.. మహాభారతంలోని కణిక నీతి

Mahabharata Kanika Niti: మహాభారతం పంచమవేదంగా కీర్తింపబడుతుంది.  మంచి చెడుల తరతమ్యాన్ని తెలిజేస్తుంది.  భీష్ముడు, విదురుడు, కర్ణుడు వంటివారు చెడు పక్షాన నిలబడినా నీతికి మారుపేరుగా నిలిచారు. అయితే శకుని, కణికుడు..

Kanika Niti: లోకంలో ధనాశాపరులు, అధికార దాహంతో అలమటించేవాళ్లు పాటించే దుర్మార్గపు నీతి.. మహాభారతంలోని కణిక నీతి
Kanika Niti
Follow us

|

Updated on: Sep 15, 2021 | 7:06 AM

Mahabharata Kanika Niti: మహాభారతం పంచమవేదంగా కీర్తింపబడుతుంది.  మంచి చెడుల తరతమ్యాన్ని తెలిజేస్తుంది.  భీష్ముడు, విదురుడు, కర్ణుడు వంటివారు చెడు పక్షాన నిలబడినా నీతికి మారుపేరుగా నిలిచారు. అయితే శకుని, కణికుడు వంటివారు దుష్టబుద్దితో.. చెడుని మంచిగా చూపిస్తూ.. వారి వేళ్ళతో వారి కన్నునే పొడిచే విధంగా చేశారు. ఇంకా చెప్పాలంటే నేటి సమాజంలోని మూర్ఖుల నేచర్ ఎలా ఉంటుంది.. అనేది ఈ పాత్రల ద్వారా తెలుస్తుంది. కొందరి హితోక్తులు వినడానికి చాలా బాగుంటుంది. ఇంకా చెప్పాలంటే.. అవి నిజమేమో అలా చేస్తే.. మనం విజయాన్నీ పొందుతామేమో అనే ఆలోచన కలిగిస్తాయి.. మన మేలు కోరుకొనే ప్రత్యేకంగా చెబుతుంటే, వినకపోతే ఎలాగన్నట్లుగా అనిపిస్తాయి. దీనికి ఉదాహరణ కణికుడి హితోక్తులు. ధృతరాష్ట్రుడి మంత్రుల్లో కణికుడు ఒకడు. కూటనీతిని ఉపదేశించడంలో ఘటికుడు. కణికుడు రాజనీతి విశారదుడు. ‘పాండవుల విషయంలో ఎలాంటి రాజనీతిని పాటించాలి?’ అని ధృతరాష్ట్రుడు అడిగినప్పుడు కణికుడి జవాబు ఇది- ‘శత్రువు ఎంత వేడుకున్నా విడిచిపెట్టకూడదు. ఏదో ఒక ఉపాయంతో శత్రువును నశింపజేయాలి. దుర్బలుడే గదా అని ఉపేక్షించకూడదు. కాషాయవస్త్రాలు కట్టుకొని లోకుల్ని నమ్మించాలి. రాజా… ఇలా చెబుతున్నందుకు నా మీద కోపించకు.. ఆయుధంతోనే ప్రజలు మీ మాట వింటారు కాబట్టి సదా మీరు దండధరులై ఉండాలి! మీ లోపాలను ఎవరికీ తెలియనీయవద్దు. ఇతరుల లోపాలను మాత్రం బాగా కనిపెట్టాలి. కొంతకాలం శత్రువుల్ని కూడా భుజంమీద ఎక్కించుకోవాలి..  సరైన సమయంలో వాళ్లను కుండను రాతిమీదవేసి బద్దలు కొట్టినట్లు కొట్టాలి..  మనకు గురువైనా, పుత్రుడైనా, మిత్రుడైనా, తండ్రి అయినా, ఇంకెంత ఆత్మీయుడైనా శత్రుస్థానంలో ఉంటే చాలు… అతణ్ని తప్పక చంపాలి. కోపాన్ని బయటకు తెలియనీయరాదు. చిరునవ్వుతో మాట్లాడాలి. దెబ్బతీసి, తరవాత అతడి కోసం ఏడవాలి. అందర్నీ అనుమానిస్తూ ఉండాలి. అన్ని పనులూ రహస్యంగా చేయాలి..

కణికుడు చెప్పిన కథ: 

ఓ మహారణ్యం. ఆ అడవిలో ఎన్నో కౄరమృగాలు యధేచ్చగా విహరిస్తూన్నాయి. అక్కడి ఓ నక్క ఉంది. అది చాలా తెలివైనది, కుటిల బుద్ది కలది. తన పనులన్నీ ఇతరులు చేత చేయించుకొని, పని పూర్తి కాగానే వారిని మోసం చేసి హాయిగా ఆ ఫలాన్ని అనుభవిస్తూ ఉండేది. ఈ నక్కకి నలుగురు స్నేహితులున్నారు. పులి, తోడేలు, ముంగిస, ఎలుక. ఈ నక్క వీటితో కలిసి మెలిసి ఉన్నట్లు నటిస్తూ సుఖంగా జీవిస్తున్నది. ఒకరోజు ఒక లేడి.. హాయిగా గంతులేస్తూ, చెంగుచెంగున దూకుతూ ఆడుకుంటుంది. ఆలేడి ఈ మిత్రబృందాన్ని దూరం నుంచి చూసింది. చూస్తూనే వాటికి దూరంగా పారిపోయింది. అయితే నక్క దృష్టి ఆ లేడి మీద పడింది. దానిని తినాలనే కోరిక కలిగింది. నక్క ఎంత ప్రయత్నించినా లేడీని పట్టుకోలేదు. దీంతో నక్క తన ఆలోచనలకు పదును పెట్టింది.  మిత్రులను చుట్టూ కూర్చో బెట్టుకుని, “స్నేహితులారా..  ఈ లేడి ఎంత అందంగా ఉందో, దాని మాంసం అంత రుచిగా ఉంటుంది. అయితే దానితో పరుగెత్తే శక్తి మనకెవరికీ లేదు. కనుక దాన్ని చంపడం మనకు సాధ్యం కాదు. ఇప్పడు మనం ఒక కుట్రపన్ని దాన్ని చంపాలి. అప్పుడు హాయిగా దాని మాంసం మనం అరగించవచ్చు” అని నాలుక చప్పరించి, అది ఎంత రుచిగా ఉంటుందో చూపించింది. అన్నిటికీ నోరూరించి. “ఆ ఉపాయం నువ్వే చెప్పాలి నేస్తం” అన్నాయి అవి ఆతురతతో అటే చూస్తూ.

జాగ్రత్తగా విని మీ అభిప్రాయం చెప్పండి. ఈ లేడి మెలకువగా తిరుగుతుండగా మనం పట్టుకోలేం. అందుచేత ఇది అలిసిపోయి సుఖంగా నిద్రపోయే సమయం కనిపెట్టాలి. అప్పడు చప్పడు కాకుండా పాకుతూపోయే ఈ ఎలక బావ దాని కాళ్ళు కొరికి పారేయాలి. అదే అదనులో పులి వెళ్ళి దాని మెడ విరిచివేయాలి. అంతే!” అంది. దాని తెలివికి అవి ఎంతో ఆనందించాయి. ఆ లేడి నిద్రపోయే సమయం కోసం ఎదురుచూశాయి. అడవిలో గడ్డి ఏపుగా పెరిగిన ప్రాంతాలలో చెంగు చెంగున గంతులేస్తూ, పచ్చికమేసి, సెలయేటి ఒడ్డున నీరు త్రాగి, బాగా అలిసి విశ్రాంతిగా కాళ్ళు జాపి నిద్రపోతున్నది లేడి. నక్క సలహా ప్రకారం అలికిడి కాకుండా ఎలకవెళ్ళి దాని కాలు కటుక్కున కొరికింది. బాధతో అది లేవబోతుండగా పులి తన పంజాతో దాని వెన్ను మీద కొట్టి మెడ కొరికేసింది. నక్కతో పాటు దాని స్నేహితులు నలుగురూ సంతోషంతో లేడి చుట్టూ కూర్చున్నాయి.

అప్పడా నక్క: “న్నేహితులారా! ఇంత రుచిగల మాంసం మనందరం హాయిగా తినాలి. ఇప్పడు మీ శరీరాలన్నీ దుమ్మూ ధూళితో ఉన్నాయి. అందుచేత ఆకొండ లోయలో సెలయేటికి పోయి స్నానం చేసి రండి. అప్పుడు తినవచ్చు” అంది. అవి నాలుగూ సంతోషంతో స్నానానికి వెళ్ళాయి. అందరికంటే ముందుగా పరుగు పరుగున వచ్చింది పులి, ఆ లేడి మాంసం తినాలని. నక్క బొటబొటా కన్నీరు కారుస్తూంటే చూసిన పులి, “బావా! ఎందుకు విచారిస్తున్నావు?” అంది. “ఏం చెప్పను పులిబావా! ఆ ఎలక లేదూ! అది ఏమన్నదో తెలుసా! ’పులి ఎంత పెద్ద జంతువైతే ఏంలాభం? నేను కాళ్ళు కొరికితే గాని అది ఏమీ చేయలేకపోయింది. నా తెలివితో చచ్చిన లేడిని తినడానికి వస్తూంది సిగ్గులేకుండా.. అని వేళాకోళం చేస్తే నాకు బాధ కలిగింది అంటూ నక్క మొసలి కన్నీరు కార్చింది. దీంతో పులికి పౌరుషం వచ్చింది. దీంతో మిత్రమా.. ఎలక నా కళ్ళు తెరిపించింది. ఈ రోజు మొదలు నా శక్తితో నా తిండి సంపాదించుకుంటాను. ఒకరిమీద ఆధారపడను” అంటూ అక్కడ నుంచి వెళ్లిపోయింది. అంతలో ఎలక రాగా.. నక్క “విన్నావా, ఎలక బావా! ఈ లేడిని పులి ముట్టుకుంది కనుక ఇది విషపూరితం అయింది. దీన్ని నేను తినను. నా ఆకలి తీరడానికి ఎలకనూ తినేస్తా అంటూ ముంగిస నీకోసం  బయలుదేరింది” అనగా ఎలుక ప్రాణ భయంతో చటుక్కున కన్నంలోకి వెళ్ళింది. మరికొంతసేపటికి తోడేలు వచ్చింది. “విన్నావా.. పులి బావకు నీ మీద కోపం వచ్చి, నిన్ను తినేస్తానంటూ బయలుదేరింది. దాని భార్యతో కలిసి నిన్ను తింటుందట.. అనడంతో  తోడేలు అక్కడనుంచి ఆగమేఘాలమీద మాయం అయ్యింది.

ఇక చివరిగా ముగింస లేడిమాసం తింటామని ఆశగా వచ్చింది. అప్పుడు నక్క పులి, తోడేలు, ఎలుకలను చంపి దూరంగా పారేశాను. నీకు బలం ఉంటే నన్ను ఓడించి ఈ లేడి మాంసం తిను అంది. వెంటనే ముంగిస అక్కనుంచి పారిపోయింది.  ఒకరికి తెలియకుండా ఒకరిని తప్పించి తర్వాత హాయిగా నక్క ఒకటి.. లేడి మాంసం తింది. ఇదే విషయాన్నీ కణికుడు.. దృతరాష్ట్రుడి కి తెలియజేస్తూ.. మహారాజా..  తెలివితో, వంచనతో మనకార్యలు చక్క బెట్టుకోవాలని చెప్పాడు. అందుకనే కణికుడి చెప్పిన నీతిని కూటనీతి అంటారు. ఇది అధికార దాహంతో అలమటించేవాళ్లు పాటించే దుర్మార్గపు నీతి. పలువురు పాలకులు, ధనాశాపరులు ఈ నీతిని అనుసరిస్తుంటారు. ఎన్నో సంక్షోభాలకు ఇదే కారణం..

Also Read:  శ్రీవారి ప్రసాదాలుగా చంద్రగిరిలోని కొత్తజంటలకు పెళ్లికానుక.. తాళిబొట్టు, పట్టుబట్టలు, మెట్టెలు..

వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..